ఆత్మకూరు (గ్రామీణ)
ఆత్మకూరు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°24′41″N 80°34′58″E / 16.411332°N 80.582727°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | మంగళగిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 8,723 |
- పురుషుల సంఖ్య | 4,338 |
- స్త్రీల సంఖ్య | 4,385 |
- గృహాల సంఖ్య | 2,394 |
పిన్ కోడ్ | 522503 |
ఎస్.టి.డి కోడ్ | 08645 |
ఆత్మకూరు, గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం మంగళగిరి పట్టణానికి తూర్పు సరిహద్దునకు ఆనుకొని ఉంది.
గ్రామ చరిత్ర
[మార్చు]సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]ఈ గ్రామం గుండా జాతీయ రహదారి వెళ్ళు చున్నది.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
[మార్చు]- నిర్మలా ఫార్మసీ కళాశాల.
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- ఎల్.ఇ.ప్రాథమిక పాఠశాల.
బ్యాంకులు
[మార్చు]ఫెడరల్ బ్యాంక్:- గ్రామంలోని గణపతినగర్ లో, ఈ బ్యాంక్ శాఖను, ప్రారంభించారు.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]ఈ గ్రామం గుండా గుంటూరు వాహిని ప్రవహించుచున్నది.
గ్రామ పంచాయతీ
[మార్చు]- ఆత్మకూరు పంచాయతీ 1938లో ఏర్పడింది. ఆర్థికంగా బలోపేతమయినది ఈ పంచాయతీ.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ వినాయక దేవాలయం
[మార్చు]గణపతి నగర్ లోని ఈ ఆలయం ప్రముఖమైనది.
శ్రీ చక్రసహిత విజయదుర్గా చాముండేశ్వరీ ఆలయం
[మార్చు]ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని ఈ ప్రాంగణంలో, శ్రీ విజయేశ్వర స్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. విజయేశ్వరస్వామి(శివలిగం)తోపాటు, పంచముఖ ఆదిశేషు, నందీశ్వరుడు విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు.
శ్రీ అంకాళమ్మ అమ్మవారి ఆలయం
[మార్చు]స్థానిక వడ్డెరపాలెంలోమిని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతరను, వడ్డెరసంఘం ఆధ్వర్యంలో, శ్రావణమాసం, రెండవ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు.
శ్రీ భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో వెలసిన స్వామివారల వార్షిక కళ్యాణమహోత్సవం, పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారలకు గ్రామోత్సవం నిర్వహించారు.
గ్రామంలోని ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలోని ప్రధాన వృత్తులు
[మార్చు]ఇక్కడ చేనేత కార్మికులు అధికం.
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,103. ఇందులో పురుషుల సంఖ్య 3,094, స్త్రీల సంఖ్య 3,009, గ్రామంలో నివాస గృహాలు 1,447 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 955 హెక్టారులు.