శూద్రులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

శూద్రులు - చతుర్వర్ణాలలో నాల్గవ వర్ణం. వీరు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవకులు. చరిత్ర ప్రకారం వీరిలో ద్రావిడులు, కిరాతులు, నాగులు వంటి తెగలున్నాయి.

చరిత్ర[మార్చు]

క్రీస్తు పూర్వం 1500 క్రితం ఆర్యులు దక్షిణ ఆసియా నుండి హిమాలయాల మీదుగా ఉత్తర భారత దేశానికి వచ్చారు. భారతదేశంలో స్థిరపడిన ఆర్యులు మూడు విభాగాలుగా - క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులుగా విడిపోయారు.

డణ్డోయుద్ధ క్షత్రియస్య కృషి వైశ్యస్య శస్యతే
శుశ్రూషైవ ద్విజాతీనాం శూద్రాణం ధర్మసాధనం

దాని ప్రకారం వేదాలు, చదువులు తెలిసిన వారు బ్రాహ్మణులయ్యారు; యుద్ధ విద్యలు, పరిపాలన తెలిసినవారు క్షత్రియులైయ్యారు; వ్యాపారం తెలిసినవారు వైశ్యులయ్యారు.

ఆర్యులు వచ్చేనాటికి భారతదేశంలో కిరాత జాతులు ఉండేవారు. ఆర్యులు వీరిని అనాగరికులుగా భావించేవారు. ఆర్యులకు వీరి భాష తెలియనందున వీరికి భాష లేదని చెప్పారు. ఆర్యులకు, కిరాత జాతులకు తరచూ యుద్ధలు జరుగుతుండేవి. ఆర్యులు బలవంతులగుట చేత అనార్యులను తమ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టేవారు. అనార్యులు ఆర్యుల ఎదుట ముఖాముఖి నిల్చుని పోరాడలేక అరణ్యాలలో పర్వత గుహల్లో దాక్కొని రాత్రులయందు వారి నివాసస్థలాలపై పడి పశువు ధాన్యాదులను దోచుకొనుచూ యజ్ఞాతికర్మలు ధ్వంసం చేయుచూ స్త్రీలను ఎత్తుకెళ్ళిపోయేవారు. అయినప్పటికీ ఆర్యులు వీరితో యుద్ధం చేసి గెలిచేవారు.

వివక్ష[మార్చు]

శూద్రకులస్తులు శతాబ్దాల క్రితం వివక్షను అనుభవించినా వాటిలో చాలా అంతరాలుండేవి. తెలుగు ప్రాంతాలకు సంబంధించిన శూద్రకులస్తులు గత వేయి సంవత్సరాల నుంచి పరిపాలకులుగా, పోరాటయోధులుగా కూడా ఉండడంతో కొన్ని వర్గాలకు వివక్ష తక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. పరిపాలకులైన శూద్రకులస్తులు తమ కులాన్ని దాచుకోవలసిన, అవమానకరంగా భావించాల్సిన అగత్యం కూడా ఉండేది కాదు. అందుకు నిదర్శనంగా పలు శాసనాలపై హరి పాదజులు, హరి పాదసంభవులు, పావనగంగా సహోదరులు వంటి బిరుదులు వహించడాన్ని చెప్పుకోవచ్చు. ఐతే సమాజంలో ఉన్నతంగా భావించిన వృత్తులకు నోచని కులాల స్థితి దయనీయంగా ఉండేది.

కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సమాజంలోని అన్ని కులస్తులు కూడా కుల భేదాలు విడిచి వ్యవహరించిన సందర్భాలున్నాయి. శూద్ర, పొడబాగ్డి, అగురి కులాల వస్తాదుల వద్ద బ్రాహ్మణులు మొదలుగా అన్ని కులస్తులు ఛడీ, బాణా (కర్ర) మొదలైన పోరాటవిద్యలు నేర్చుకునేవారు. రంగంలోకి వెళ్ళగానే ముందుగా తన పోరాటానికి అడ్డురాకుండా జంధ్యాన్ని తొలగించేవారు. ఆయుధాలను గురువు పాదాల వద్ద ఉంచి, ఆయన మోకాళ్ళు తాకి, నమస్కరించి, ‘‘జేయ్ గురూ’’ అని గురువు అనుమతి పొందాకే విద్య నేర్వడం సాగేది. ఈ క్రతువును ఏ బ్రాహ్మణుడూ అవమానంగా భావించే స్థితి ఉండేదికాదు. అలాగే ఇవి చేసినందుకు తోటి బ్రాహ్మణులెవరూ వారిని అవమానించేదీ, వెలివేసేదీ లేదు.[1]

మూలాలు[మార్చు]

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127 – 140. Retrieved 1 December 2014. 
"https://te.wikipedia.org/w/index.php?title=శూద్రులు&oldid=2126487" నుండి వెలికితీశారు