చుండూరు
చుండూరు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°9′30″N 80°34′59″E / 16.15833°N 80.58306°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చుండూరు |
విస్తీర్ణం | 11.63 కి.మీ2 (4.49 చ. మై) |
జనాభా (2011) | 5,965 |
• జనసాంద్రత | 510/కి.మీ2 (1,300/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,069 |
• స్త్రీలు | 2,896 |
• లింగ నిష్పత్తి | 944 |
• నివాసాలు | 1,682 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 522318 |
2011 జనగణన కోడ్ | 590380 |
చుండూరు (Tsunduru), గుంటూరు జిల్లాలో గ్రామం, అదేపేరుగల మండలం. ఇది సమీప పట్టణమైన తెనాలి నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1682 ఇళ్లతో, 5965 జనాభాతో 1163 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3069, ఆడవారి సంఖ్య 2896. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2804 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 462. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590380[1].
గ్రామ గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా 6426, పురుషుల సంఖ్య 3362, మహిళలు 3064, నివాసగృహాలు 1584
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]1991 ఆగస్టు 6న చుండూరు గ్రామంలో దళితులపై అగ్రకులస్తులు (రెడ్డి, తెలగలు) చేసిన దాడి, హత్యాకాండలను చుండూరు ఘటనగానూ, చుండూరు హత్యాకాండగానూ అభివర్ణిస్తారు.
హత్యాకాండ 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు దళితవాడపై దాడి చేసి, వేట కొడవళ్ళతో, గొడ్డళ్లతో, బరిసెలతో దళితులను వెంటాడి, వేటాడి చంపారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడేశారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలోనే చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగానే సంచులలో కుక్కి కాలువలో పడేశారు.
న్యాయస్థానం తీర్పు, ఈ ఘోరంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ తదుపరి, 2007లో తీర్పును వెలువరించింది. ఇది అరుదైన వాటిలో కెల్లా అత్యంత అరుదైన కేసు కాదంటూ నిందితులకు మరణశిక్ష గాక, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు చేసిన ఈ వ్యాఖ్య నేరం తీవ్రతను తగ్గించేసింది. ఏడేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందంటూ నిందితులందరినీ విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఈ కేసులో 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా ఇదే కేసులో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను కూడా న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు చుండూరు ఘటనలో మరణించినవారి బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు 2014 జూలై 30 నాడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతోపాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది
గ్రామ భౌగోళికం
[మార్చు]సమీప గ్రామాలు
[మార్చు]వేటపాలెం 3 కి.మీ వెల్లలూరు 4 కి.మీ, మామిళ్ళపల్లి 4 కి.మీ ఆలపాడు 5 కి.మీ, వలివేరు 5 కి.మ 8 కి.మీ.నడిగడ్డపాలెం 2 కి.మీ
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప బాలబడి తెనాలిలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
[మార్చు]చుండూరు గ్రామంలో 22 సంవత్సరాల క్రితం, ఈ పాఠశాల ప్రారంభించారు. అప్పడి నుండి పక్కా భవనాలు లేవు. 4 సంవత్సరాల క్రితం, నూతనభవన నిర్మాణానికి రు. 9.75 కోట్ల నిధులు మంజూరయినవి. ఈ నిధులతో, 4వ తరగతి నుండి ఇంటరు వరకు చదువుకొనడానికి తరగతి గదులు, విద్యార్థులకు వసతి గృహాలు, ఒకేసారి 300 మంది కూర్చొని భోజనంచేయడానికి సువిశాలమైన స్థలం, మరుగుదొడ్లు, ఆ ప్రాంగణంలోనే ఉపాధాయులకు గృహాలు నిర్మించారు. మొదట 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు 350 మందికి మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉండేది. గత సంవత్సరం, స్థానిక పాఠశాలలో జూనియర్ కళాశాల ప్రారంభించారు. దీనితో ఇక్కడ చదువుకొనే విద్యార్థుల సంఖ్య 540 కి చేరుకున్నది. నూతన భవనం నిర్మాణం పూర్తి అయినచో మరో 150 మంది చదువుకొనడానికి అవకాశం ఉంటుంది.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]చుండూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]చుండూరులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 19 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]చుండూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 170 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1 హెక్టార్లు\
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 10 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 10 హెక్టార్లు\
- నికరంగా విత్తిన భూమి: 970 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 28 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 952 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]చుండూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 952 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]చుండూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గుదేటి బ్రహ్మారెడ్డి, సర్పంచిగా. ఉప సర్పంచ్‌గా ఎల్లారెడ్డి ఎన్నికైనారు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]చుండూరు గ్రామ పొలిమేర లో మధ్య "శ్రీ బాలకోటేశ్వరస్వామి" వారు స్వయంభూ వెలిశారు ఉంది. చీడెపూడి కోటిరెడ్డి పొలంను నార్కేట్ పల్లికి చెందిన అక్కి బాపయ్య కౌలుకు చేస్తున్నారు, పొలంలో దుక్కి చేయుచుండగా, ఒక శివలింగం బయట పడింది. 1938లో తాటాకు పందిళ్ళలో శివలింగం ఏర్పాటు చేసి, భక్తులు పూజలు చేశారు. నాలుగేళ్ళపాటు అవే తాటాకు పందిళ్ళలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తరువాత చుండూరుకు చెందిన గాదె నాగభూషణరెడ్డి, గ్రామస్తుల సహకారంతో ఆలయం నిర్మించాడు. అప్పటినుండి స్వామివారికి నిత్య నైవేద్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించుచున్నారు. అంచెలంచెలుగా దేవాలయ అభివృద్ధికి పలువురు విరాళాలిచ్చారు. రెండేళ్ళక్రితం దేవాలయ ప్రాంగణంలో మంటప నిర్మాణం, నవగ్రహాల ఏర్పాటుకు, వలివేరుకు చెందిన భక్తులు టి.వీరారెడ్డి బుల్లెయ్య, రు. 2 లక్షలు విరాళం అందజేశాడు. గత ఏడాది చుండూరుకు చెందిన జి.రామిరెడ్డి, ఒకటిన్నర లక్షల రూపాయలతో కళ్యాణమంటపం నిర్మించాడు. ఆలయంలో పొంగళ్ళు వండుకోవడానికి ఒక షెడ్డు ఏర్పాటుచేశారు. క్యూలైనులకోసం బ్యారికేడులు ఏర్పాటుచేశారు. తిరునాళ్లకు చుండూరు నుంచి 4, మున్నంగివారి పాలెం నుంచి 2 , మొదుకూరు, వలివేరు, యడ్లపల్లి, వేటపాలెం, మంచాల, వెల్లలూరు, గ్రామాలనుండి భారీ విద్యుత్ ప్రభలు నిర్మిస్తారు. మహాశివరాత్రి తిరునాళ్లకు లక్ష మందికి పైగా భక్తులు విచ్చేస్తారు మహాశివరాత్రి రోజు రాత్రి గుడి చుట్టూ ప్రభలు త్రిప్పుట, అలాగే కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచాల తో తిరునాళ్ళు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీ రామమందిరం
[మార్చు]ఈ మందిరం చుండూరు గ్రామంలోని దక్షిణ బజారులో ఉంది.
వెంకయ్యస్వామి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో స్వామివారి 13వ ఆరాధనోత్సవాలు, 2015, నవంబరు-15వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అద్జికసంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారధన నిర్వహించారు.
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]- ఎం.నారాయణరెడ్డి - హైదరాబాదు, రాజేంద్రనగర్ లోని, జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థలో ముఖ్య శాస్త్రవేత్త. వీరు మెట్ట సేద్యంలో, 35 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
- నారుమంచి సుబ్బారావు తెనాలి శ్రీ సీతారామ గాన సభ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు
గ్రామ విశేషాలు
[మార్చు]- ఈ గ్రామంలో రు. 60 లక్షల విరాళాలతో నిర్మించిన ఆర్యవైశ్య కళ్యాణమండపం 2014, డిసెంబరు-14వ తేదీనాడు ప్రారంభించారు.
- ఈ గ్రామంలో 3.94 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న "ఘనవ్యర్ధాల నిర్వహణ కేంద్రం" నిర్మాణ పనులకు 2015, అక్టోబరు-5వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు.
- 1991 ఆగస్టు 6న చుండూరు, ఆంధ్రప్రదేశ్ గ్రామంలో దళితులపై అగ్రకులస్తులు (రెడ్డి, తెలగలు) చేసిన దాడి, హత్యాకాండలను చుండూరు ఘటనగానూ, చుండూరు హత్యాకాండగానూ అభివర్ణిస్తారు