తెనాలి
పట్టణం | |
Coordinates: 16°14′35″N 80°38′24″E / 16.243°N 80.64°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | తెనాలి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 16.63 కి.మీ2 (6.42 చ. మై) |
జనాభా | |
• మొత్తం | 1,64,937 |
• జనసాంద్రత | 9,900/కి.మీ2 (26,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1026 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08644 ) |
పిన్(PIN) | 522201 |
Website | http://tenali.cdma.ap.gov.in/ |
తెనాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఒక నగరం,అదే పేరుగల మండలానికి కేంద్రం.[4] ఈ నగరాన్ని ఆంధ్ర పారిస్ అని కూడా పిలుస్తారు.[5] ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగం.[6] తెనాలి బంగారు నగలు తయారీకి ప్రసిద్ధిగాంచిన పట్టణం.
చరిత్ర
[మార్చు]1511లో కృష్ణదేవరాయలు విజయయాత్రలో భాగంగా తెనాలి ప్రాంతాన్ని సందర్శించారు. ఆ కాలంలో లక్ష్మీవల్లభుడైన గోవర్ధనస్వామి విగ్రహం తెనాలి నగరంలో ప్రతిష్ఠించినట్లు తెనాలి కైఫియ్యత్తులు తెలుపుతోంది. తన విజయయాత్ర సందర్భంగా రాయలు గోవర్ధనస్వామిని దర్శించుకుని అక్కడ ఓ శాసనాన్ని వేయించారు. గోవర్ధనస్వామి పేరిట శాసనం వేయడంతో పాటు ఆయనకు తేలప్రోలు గ్రామాన్ని దానంగా ఇచ్చారు. రాయలు వేసిన శాసనంలో రాయలు, తిమ్మరుసు చేసిన దానధర్మాల వివరాలతో పాటు తెనాలి ప్రాశస్థ్యాన్ని కూడా అభివర్ణించారు. తుంగభద్ర, కృష్ణవేణి నదుల మధ్యనున్న తెనాలి అని సంబోధించిన ఆయన జిల్లాలో నాదెండ్ల, కొండెపాడు లను దానం ఇచ్చినట్లు లిఖించారు. [7][8]
భౌగోళికం
[మార్చు]జిల్లా కేంద్రమైన గుంటూరునుండి తెనాలికి 25 కి.మీ (16 మైళ్ళు). సముద్ర తలం నుండి ఎత్తు 11మీటర్లు (36 అడుగులు). విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలు ఒకదానికొకటి 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక సమ త్రికోణంలా ఉంటాయి. తెనాలి గుంటూరు జిల్లాలో రెండవ పెద్ద పట్టణం.
కృష్ణానది నుండి వచ్చే మూడు కాలువలు ఈ మండలం గుండా ప్రవహిస్తున్నాయి. అందులో ఒక కాలువ పడవల కాలువ కాగా (ఒకప్పుడు ఈ కాలువ ఈ తాలూకాలో ముఖ్యమైన ప్రయాణ మార్గం) మిగిలిన రెండూ ఇక్కడ మంచి వరి పంటకు నీటి సదుపాయాన్ని అందిస్తున్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 164,937. ఇందులో 81,427 మగవారు, 83,510 ఆడవారు ఉన్నారు. తెనాలి అక్షరాస్యత 75.56% (రాష్ట్రం సగటు 67.41%. 14,340 మంది ఆరు సంవత్సరాలకంటే చిన్నవారైన వారు ఉన్నారు. [9][4]
పరిపాలన
[మార్చు]తెనాలి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]గుంటూరు, విజయవాడ, చెన్నై నగరాలకు గల రైలు మార్గాలను కలిపే ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్.
విద్యా సంస్థలు
[మార్చు]తెనాలి ఒక విద్యా కేంద్రంగా ఉండేది. 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో ఈ జిల్లాలో ఉన్న ఉన్నత పాఠశాలలలో తెనాలి తాలూకా ఉన్నత పాఠశాల పేరు గాంచింది. తెనాలి నుండి రేపల్లె వరకు గల చాల గ్రామాల నుండి స్నాతక విద్య (graduate course) కై చాల మంది విద్యార్థులు తెనాలి వచ్చేవారు. ఆయా ప్రదేశాలలో వివిధ కళాశాలల ఆవిర్భావముతో తెనాలి ప్రాముఖ్యత తగ్గింది. ముద్రాక్షర లేఖనం (టైపు రైటింగు), హ్రస్వ లేఖనం (షార్ట్ హేండు) ప్రాచుర్యంలో ఉన్న కాలంలో కొత్తపేటలో ఉన్న అనేక శిక్షణా శాలలు వివిధ గ్రామాలు, చిన్న పట్టణాలనుండి వచ్చే విద్యార్థులతో నిండి ఉండేవి.
కొన్ని విద్యాలయాలు
[మార్చు]- ఏ.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల[10]
- కె.ఎస్.ఎస్.మహిళా ఇంజనీరింగ్ కళాశాల.
- వి.యస్.ఆర్ & ఎన్.వి.ఆర్ కళాశాల
- జె.యం.జె మహిళా కళాశాల
- శ్రీ యలవర్తి ఆంజనేయశాస్త్రి వేద సంస్కృత పాఠశాల.
- కె.ఎల్.ఎన్.సంస్కృత కళాశాల
ఆర్ధికం
[మార్చు]- సారవంతమైన నల్ల రేగడి నేల, మూడు కృష్ణా కాలువలు, ప్రధాన నగరాలకు దగ్గరగా ఉండడం వలన తెనాలి ముఖ్యమైన వ్యవసాయోత్పత్తి కేంద్రం, వ్యాపార కేంద్రం, కళాకేంద్రంగా అభివృద్ధి చెందింది. చెరకు, వరి, మామిడి ఈ ప్రాంతంలో ముఖ్యమైన పంటలు.
- అలాగే తెనాలి బంగారు నగల వ్యాపారానికి కూడా పేరుగాంచింది. బంగారపు వ్యాపారానికి ప్రొద్దుటూరు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అంతటి ప్రాధాన్యత ఉంది.
- పట్టణంలో ప్రధాన వ్యాపార కేంద్రాలు - మెయిన్ రోడ్, బోస్ రోడ్, గాంధీ చౌక్.
సంస్కృతి
[మార్చు]తెనాలి నుండి నాటక, సినిమా రంగాలలోకి చాలా మంది కళాకారులు రావడం వల్ల దీనిని 'ఆంధ్రా పారిస్' (Andhra Paris) అని పిలుస్తారు. కాంచనమాల, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమున, శారద, ఘట్టమనేని కృష్ణ, ఎ.వి.ఎస్. వంటి కళాకారుల స్వస్థలం తెనాలి. వైకుంఠపురం అను అద్భుతమైన వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.
పర్యాటక ఆకర్షణలు/దేవాలయాలు
[మార్చు]- వైకుంఠ పురం (చిన్న తిరుపతి):- పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. దశాబ్దాలుగా తెనాలివారి తమదైన తిరుపతి. సుమారు నలభై సంవత్సరాల క్రితం ఒక పుట్టపై శయనించి ఉన్న వేంకటేశ్వరునికి దేవాలయనిర్మాణం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ తమ మొదటి పంట (వరి) ని తెచ్చి, పాయసం (పరమాన్నం) వండి, దేవునికి నివేదన చేస్తారు. కేశఖండన తిరుపతి లాగానే సర్వసామాన్యం.
- భవన ఋషి, భద్రవతి మాత ఆలయం, షరప్ బజార్ తెనాలి.
- కన్యకా పరమేశ్వరి మందిరం:- అమ్మవారి పేరుతో ప్రసిధ్ధమైన శివాలయం. రాజ రాజేశ్వరి అమ్మవారు కూడా వేంచేసి ఉన్నారు. పట్టణ వైశ్య సముదాయముచే నడపబడే ఈ దేవస్థానములో దసరా ఉత్సవము కనుల పండుగగా, పట్టణ సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది.
- శ్రీ పర్వతవర్ధనీసమేత రామేశ్వర స్వామి ఆలయం:- స్థానిక గంగానమ్మపేటలోని ఈ ఆలయం, అతి పురాతనమైనదిగా పేరుగాంచింది. త్రేతాయుగంలో పరశురామునిచే క్షత్రియ సంహారం అనంతరం, పాపపరిహారార్ధమై ప్రతిష్ఠించిన శివాలయాలలో ఈ క్షేత్రం గూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కశ్యప ప్రజాపతికి దానంగా ఇవ్వబడిన ఆలయంగా ఈ ధామాన్ని చెబుతారు. ఈ దివ్య మందిరంలో శ్రీ పర్వతవర్ధనీ సమేత రామేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు.
- శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం {పాత ఆంజనేయ స్వామి ఆలయం}:- తెనాలి పట్టణ నడిబొడ్డున షరాఫ్ బజారులోని ఈ ఆలయం 150 సంవత్సరాల క్రితం నిర్మితమైనది. దక్షిణ
- మార్వాడి గుడి (జైన దేవాలయం)
- శ్రీ బసవమందిరం:- ఈ మందిరం తెనాలిలోని నందులపేటలో, వినాయకుని గుడి వీధిలో ఉన్న ఈ మందిరాన్ని 1924లో నిర్మించారు. ఈ మందిర వ్యవస్థాపకులు సోము రాజమ్మ. శ్రీరామ నవమి సందర్భముగా వసంత నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో సుమారు ఒక కి.మీ. పొడవైన పందిరి (చిట్టి ఆంజనేయ స్వామి గుడి నుండి దొంగ రాముడి గుడి వరకు) వేసి చాల ఘనంగా జరుపుతారు. భద్రాచలం తరువాత అంత ఘనంగా చేస్తారని ప్రతీతి. ఇది కాక తెనాలిలో సంవత్సరం పొడవునా పెక్కు ధార్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.
- కూచిపూడిలో వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిర్మించిన శివాలయము గుడి గాలిగోపురం చాల ఎత్తైంది.
ఇతర విశేషాలు
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో మొదటి ముద్రణా యంత్రాలయం "కాకుమాను ప్రెస్" (జానకిరాం బైండింగ్ వర్క్స్) 1930లో స్ధాపించబడినది బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే పుస్తకం ప్రచురించబడింది. కాకుమాను జానకీరాం,కాకుమాను అంజయ్య ప్రెస్ స్థాపకులు
- తెనాలి లింగాకర్షక బుట్టల తయారీకి కూడా ప్రఖ్యాతి చెందివది. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ఊరి నుండి లింగాకర్షక బుట్టలు సరఫరా జరుగుతుంది
- తెనాలికి 1901 ముందు వరకూ తాలూకా హోదా లేదు. అప్పట్లో రేపల్లె తాలూకాలో తెనాలి ఉపతాలూకాగా ఉండేది. 1901 నుండి తెనాలికి తాలూకా హోదా కల్పించిన తర్వాత, అందులో రేపల్లె ఉపతాలూకాగా మారింది. 1909 లో తెనాలి రెవెన్యూ డివిజనుగా మారిన తర్వాత, తిరిగి రేపల్లెకు తాలూకా హోదా కల్పించారు.[11]
- తెనాలి పట్టణం నడిబొడ్డున ఐదున్నర ఎకరాలలో విస్తరించియున్న "పినపాడు చెరువు" పట్టణానికి ఒక అద్భుతమైన సహజ వనరు. కేవలం చెరువుగా ఉంటే దీనికి ఇంత ప్రత్యేకత ఉండదు. అయితే చెరువుకు మధ్యలో సహజంగా ఉండే ద్వీపం (ఐలండ్) గుర్తింపును తెసికొని వచ్చింది. ఇది పట్టణంలోని పురాతన చెరువులలో ఒకటి.
- శ్రీరామ విలాస సభ 1921లో తెనాలిలో స్థాపించబడింది.[12]
శాస్త్రి పెన్ వర్క్స్
[మార్చు]ఒకప్పుడు పెన్ను అంటే ఫౌంటెన్ పెన్'. పూర్వం రెండు మూడు వరుసలు రాయగానే ఇంకు సీసాలో ముంచి వ్రాసేవారు. కాలక్రమేనా సిరాలో ముంచే అవసరం లేకుండా నిబ్ వెనుక ఇంకు రిజర్వాయర్ ఉండేలా పెన్నుని అమెరికా వారు ఆవిష్కరించారు. దీనినే ఫౌంటెన్ పెన్ అంటారు. భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల వీటి తయారీ జరిగేవి. తెనాలికి ఫౌంటెన్ పెన్నుల తయారీలో ఘన చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం రాజమండ్రిలోని "రత్నం" పెన్స్ ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత తెనాలి పెన్నులదే రాజ్యం. తెనాలి ఉత్పత్తులైన "సోలార్", "అశోక", "ప్రసాద్" పెన్నులు దశాబ్దాల పాటు విశేష ఆదరణ పొందాయి. తెనాలిలో పౌంటెన్ పెన్స్ తయారీకి ఆద్యుడు వి.ఎస్.శాస్త్రి. తొలుత ఫాన్సీ షాపు వ్యాపారంతో ప్రారంభించి, పెన్నులు రిపేరు చేస్తూ, క్రమంగా వాటి తయారీపై దృష్టిపెట్టారాయన. 1946లో "శాస్త్రి పెన్ వర్క్స్"ను స్థాపించారు. "సోలార్" బ్రాండ్ పేరుతో పౌంటెన్ పెన్నులు తయారీ చేపట్టారు. పెన్నులకు కావలసిన క్లిప్పులు, పాళీలు, నాలికలను ఇక్కడే రూపొందించేవారు. ఆ రోజుల్లో ఆయన వద్ద 33 మంది వర్కర్లు ఉండేవారు. సోలార్ పెన్ను ధర 1953లో రూ.21 ఉండేది. అనేక మంది జాతీయ నాయకులు ఈ యూనిట్ ను సందర్శించి మెచ్చుకున్నారు. ఈ యూనిట్ 1960లో మూత పడింది.[13]
కొందరు ప్రముఖలు
[మార్చు]- తెనాలి రామకృష్ణ, కవి
- యలవర్తి నాయుడమ్మ, శాస్త్రవేత్త
- చక్రపాణి, సినీ దర్శకుడు
- కొడవటిగంటి కుటుంబరావు, కవి
- బయ్యారపు ప్రసాదరావు
- కాంచనమాల, సినీ నటి
- త్రిపురనేని రామస్వామి, కవి
- పరుచూరి రాజారాం
- కన్నెగంటి జగ్గయ్య, సినీ నటుడు
- పోలేపెద్ది నరసింహమూర్తి ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత
- రాచాబత్తుని సూర్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు.
- రాచాబత్తుని ఆంజనేయులు దారపు బంతుల యూనిట్ల స్థాపకుడు
- కొడవటిగంటి రోహిణీప్రసాద్,
- మీనాకుమారి, తెలుగు సినిమా నటి.
- రావులకొల్లు సోమయ్య పంతులు కర్ణాటక సంగీత నాథవిద్వాంసుడు.
- కృష్ణ- సినిమా నటులు
- శోభితా ధూళిపాళ్ల- సినీ నటి
- భీమవరపు లక్ష్మయ్య-రంగస్థల నటులు.
- కె.ఎల్. వనజ-రంగస్థల నటి
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://tenali.cdma.ap.gov.in/. Retrieved 19 జూలై 2018.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ 2.0 2.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ http://www.census2011.co.in/census/city/414-tenali.html.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ 4.0 4.1 "District Census Handbook - Guntur" (PDF). Census of India. pp. 14, 46. Retrieved 28 August 2015.
- ↑ Samuel Jonathan, P (12 November 2008). "Big Cinema comes to Andhra Paris". The Indian Express. Retrieved 1 April 2016.
- ↑ "Urban Footprints in APCRDA Region". APCRDA. Archived from the original on 11 ఆగస్టు 2016. Retrieved 27 June 2016.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ ఈనాడు గుంటూరు జిల్లా ఎడిషన్; 2013, జూలై-15; 15వపేజీ
- ↑ ఈనాడు గుంటూరు సిటీ; 2015, నవంబరు-23; 33వపేజీ.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 1 August 2014.
- ↑ Wald, Abraham. (2013). Sequential Analysis. Dover Publications. ISBN 1-306-32856-X. OCLC 868280879.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్ జులై 20, 2013.
- ↑ నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14
- ↑ సాక్షి, 24 డిసెంబరు, 2016 - మీకు తెలుసా - పౌంటెన్ పెన్నుల తయారీకి ఆధ్యుడు వీ ఎస్ శాస్త్రి