Jump to content

పొన్నూరు

అక్షాంశ రేఖాంశాలు: 16°04′00″N 80°34′00″E / 16.0667°N 80.5667°E / 16.0667; 80.5667
వికీపీడియా నుండి
Ponnur
Swarnapuri
Ponnur is located in ఆంధ్రప్రదేశ్
Ponnur
Ponnur
Location in Andhra Pradesh, India
Coordinates: 16°04′00″N 80°34′00″E / 16.0667°N 80.5667°E / 16.0667; 80.5667
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాGuntur
Government
 • శాసనసభ సభ్యుడుKilari Venkata Rosaiah
విస్తీర్ణం
 • Total25.64 కి.మీ2 (9.90 చ. మై)
జనాభా
 (2011)[2][3]
 • Total59,913
 • జనసాంద్రత2,300/కి.మీ2 (6,100/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
522 124
టెలిఫోన్ కోడ్+91–8643
లింగ నిష్పత్తి1:0.96 /

పొన్నూరు, గుంటూరు జిల్లాలో గుంటూరుకు దక్షిణాన 31 కి.మీ. దూరంలో ఉన్న ఒక చారిత్రక పట్టణం. ఇది పొన్నూరు మండలానికి కేంద్రం.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

పూర్వం పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని, "పొన్నూరు" (పొన్ను+ ఊరు) అని పిలవడం ప్రారంభించారు. తమిళంలో "పొన్ను" అంటే బంగారం అని అర్థం. పొన్ను+ఊరు, అంటే స్వర్ణపురి అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే నిలిచిపోయింది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా కేంద్రమైన గుంటూరుకు దక్షిణాన 31 కి.మీ. దూరంలో ఉన్నది. నిడుబ్రోలు పొన్నూరును ఆనుకుని ఉన్న ఒక ప్రముఖ గ్రామం. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే పట్టణం వలె అనిపిస్తాయి.

పరిపాలన

[మార్చు]

పట్టణంలోని ముఖ్య ప్రాంతాలు: పాత పొన్నూరు, గాజులపాలెం, షరాఫ్ బజార్, బ్రాహ్మణ బజార్, తెలగపాలెం, భావనగర్ కాలనీ, విద్యానగర్, నేతాజీనగర్, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వర నగర్, అంబేద్కర్ కాలనీ, ఐలాండ్ సెంటర్. పొన్నూరు పురపాలకసంఘం (మున్సిపాలిటీ) ఏర్పడి, 2014, సెప్టెంబరు-20 నాటికి 50 సంవత్సరాలు పూర్తి అయినవి. ఈ సందర్భంగా 2014, అక్టోబరు-6,7,8 తేదీలలో, పురపాలక సంఘ స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించారు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ పట్టణం గుంటూరు - చీరాల రాష్ట్ర రహదారి పై ఉంది. చెన్నై-కోల్‌కతా రైలు మార్గం ఈ పట్టణం గుండా పోతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క డిపో పొన్నూరు పట్టణంలో ఉండటంచేత పొన్నూరు, చుట్టుపక్కల గ్రామాలకు మంచి రవాణా వ్యవస్థ ఏర్పడింది. చెన్నై-కోలకతా ప్రధాన రైలుమార్గం పట్టణం గుండా పోతుండడం వలన రైలు సౌకర్యం కూడా బాగా ఉంది.

విద్యా సదుపాయాలు

[మార్చు]

సంస్కృత కళాశాల

[మార్చు]

పొన్నూరులోని శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ సాక్షి భావనారాయణస్వామి దేవస్థానం ఆవరణలో 1937లో వేద పాఠశాలను స్థాపించారు. 1950 లో ఆ పాఠశాలను సంస్కృత కళాశాలగా మార్చారు. ఈ కళాశాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.

పాములపాటి బుచ్చినాయుడు డిగ్రీ కాలేజి

[మార్చు]

నిడుబ్రోలులో డిగ్రీ కాలేజిని 50 సంవత్సరముల క్రిందట పాములపాటి బుచ్చినాయుడు అనే వితరణ శీలి ఏర్పాటు చేశాడు. ఒక పంచాయతి గ్రామంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు గావడం ఒక విశేషం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి వారి దేవాలయ గాలి గోపురం
శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి వారి ఆలయ ప్రాకారం
మండపం, గాలి గోపురం భావన్నారాయణ స్వామి వారి
శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి వారి గాలి గోపురం

శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ సాక్షి భావనారాయణస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ స్వామివారిని సాక్షిభావనారాయణుడని అంటారు. మరెక్కడాలేని బ్రహ్మ ఆలయము ఇక్కడ ఉంది. దీని ప్రథమ ధర్మకర్త రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈఆలయం నిర్మించాడు. ప్రస్తుతం ఇందులో విగ్రహం లేదు.

పొన్నూరు సమీపంలోని నండూరు గ్రామస్థుడు కేశవయ్య మేనల్లుడు గోవిందుని వెంటబెట్టుకొని కాశీలోని శ్రీభావనారాయణుని దేవాలయంలో సంతాన ప్రాప్తికి భగవంతుని ప్రార్థించాడు. కూతురు కలిగితే తనకిచ్చిట్లయితే కేశవయ్యకు మారుగా తాను ప్రార్ధిస్తానని గోవిందు చెప్పిందానికి అతను ఓడంబడి ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత తనకు కలిగిన అక్కలక్ష్మికి గూని ఉందని గోవిందుకు ఇవ్వటానికి కేశవయ్య నిరాకరించగా గోవిందు ప్రార్థనపై స్వామి కాశీనుంచి సాక్ష్య మివ్వటానికి అతనివెంట బయలుదేరి వచ్చాడు. పొన్నురువద్దకు వచ్చిన తరువాత స్వామి తనవెంట వస్తున్నదీ లేనిదీ అనుమానం వచ్చి వెనుతిరిగి చూడగా గోప్పీవనమనబడే ప్రస్తుత పొన్నూరులో శ్రీభావనారాయణస్వామి అంతర్ధాన మయ్యాడు. కేశవయ్య ఆకాశవాణి తెలియజేసిన మీదట తర్వాత తన కూతురును గోవిందుకు ఇచ్చి పెళ్ళి చేసాడు. సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినందున ఇప్పటికి సాక్షి భావనారాయణస్వామి అని పిలుస్తారు. ఆయనతోపాటు వచ్చిన కాశీ విశ్వనాధుడు, పేరులేని పెద్దమాను అనే రెండు చెట్లు, తుంగభద్ర అనే ఒక ఏరు ఇక్కడ చూపిస్తారు.

10వ శతాబ్దంలో అవుకు సీమాధిపతి నంద్యాల నారపరాజు అనే ఆయన తన రాచపుండు నివారణకు తీర్ధయాత్రలు చేస్తూ ఇక్కడకి వచ్చినప్పుడు, భావనారాయణస్వామి కలలో కనిపించి పుట్టలోఉన్న తన వెలికి తీసి పూజకు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినట్లు అందుమీదట నారపరాజు గర్భాలయాన్ని నిర్మించినాడని ఆయన రాచపుండు నయమయిందనీ చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయం ఆద్వర్యంలో 6 వేల ఆధ్యాత్మిక, మతగ్రంధాలతో ఒక గ్రంథాలయం నడుస్తున్నది. 1920 నుండి ఉన్న సంస్కృత పాఠశాల 1950లో కళాశాలగా మార్చబడింది.

శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానం

[మార్చు]

1961 లో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతస్వామి ల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహాలు 30 అడుగుల ఎత్తు 24 అడుగుల ఎత్తుతో నయనానందకరంగా కనిపిస్తూ బహుళ ప్రసిద్ధికెక్కినవి.

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం

[మార్చు]

నిడుబ్రోలులో వేంచేసియున్న ఈ స్వామివారి ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2017, జూన్-6వతేదీ మంగళవారంనాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. ఏడవతేదీ బుధవారం తెల్లవారుఝామున, ఆలయంలోని స్వామివారి మూలవిరాట్టుకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక మోమం చేసారు. సాయంత్రం నవగ్రహోమాంతోపాటు, మంగళహారతి కార్యక్రమం నిర్వహించారు. 8వతేదీ గురువారంనాడు స్వామివారి రథోసవం ఘనంగా నిర్వహించారు. 9వతేదీ శుక్రవారంనాడు స్వామివారి కళ్యాణం, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య కన్నులపండువగా నిర్వహించారు. రాత్రికి స్వామివారిని గజవాహనంపై పురవీధులలో ఊరేగించారు. ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, 10వతేదీ శనివారంతో ముగిసినవి. ముగింపురోజున ప్రతిష్ఠా మూర్తులకు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ తోటమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో పట్టణంలోని జి.బి.సి.రహదారిపై ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2017, ఏప్రిల్-23వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. కనకతప్పెలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారికి చీరె, సారె సమర్పించారు. తోటమ్మ తల్లి జాతర సందర్భంగా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:

[మార్చు]

పొన్నూరులో అబ్దుల్ కలాం రహదారిలో, భారత్ గ్యాస్ గోడౌన్ సమీపంలోని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక తిరునాళ్ళ సందర్భంగా, 2017, ఏప్రిల్-17వతేదీ సోమవారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో, సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. అర్చకులు అమ్మవారికి సహస్రానామార్చనతో పూజలు చేసారు. 18వతేదీ మంగళవారం ఉదయం 11 గంటల నుండి, ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ గణపతి సమేత శ్రీ పోలేరమ్మ తల్లి మహామంత్ర హోమం నిర్వహించెదరు.

ఇతర విశేషాలు

[మార్చు]
  • ఆసియా ఖండంలోనే అపరాల ఎగుమతిలో ప్రథమ స్థానం.
  • పొన్నూరు పట్టణంలో కీ.శే.ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఇండోర్ స్టేడియం ఉంది.
  • నిడుబ్రోలులో ప్రభుత్వ మత్స్య శాఖ ఆధ్వర్యంలో, చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది.
  • పొన్నూరు పట్టణంలోని విద్యానగర్ లో ఉంటున్న షేక్ మహబూబ్ సుబానీ, భారత వాయుసేనలో ఎయిర్ వైస్ మాస్టర్ గా విధులు నిర్వహించుచున్నారు. వీరు తను పనిచేయుచున్న రంగంలో విశిష్టసేవలందించినందుకు గాను, 2016, మే-7న ఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతులమీదుగా అతివిశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు.[4]
  • పొన్నూరుకు చెందిన ధూళిపాళ్ళ రమేష్‌బాబు, రత్నశ్రీ దంపతుల కుమారుడు బాలచంద్రప్రసాద్, ఇటీవల స్పెయిన్‌దేశంలోని బార్సెలోనాలో నిర్వహించిన చదరంగం పోటీలలో, అంతర్జాతీయ మాస్టర్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు.[5]

చిత్రమాలిక

[మార్చు]

పట్టణ ప్రముఖులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Basic Information of Municipality". ponnurmunicipality.com. Archived from the original on 24 March 2016. Retrieved 6 April 2016.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 24 August 2014.
  3. "Statistical Abstract of Andhra Pradesh, 2015" (PDF). Directorate of Economics & Statistics. Government of Andhra Pradesh. p. 43. Archived from the original (PDF) on 14 July 2019. Retrieved 26 April 2019.
  4. ఈనాడు గుంటూరు సిటీ; 2016,మే-9; 2వపేజీ.
  5. ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు; 2017,జులై-17; 2వపేజీ.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పొన్నూరు&oldid=4308827" నుండి వెలికితీశారు