దుగ్గిరాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుగ్గిరాల
—  రెవిన్యూ గ్రామం  —
దుగ్గిరాల వద్ద కొమ్మమూరు కాలువ పెద్ద తూము చిత్రం
దుగ్గిరాల వద్ద కొమ్మమూరు కాలువ పెద్ద తూము చిత్రం
దుగ్గిరాల is located in Andhra Pradesh
దుగ్గిరాల
దుగ్గిరాల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°21′55″N 80°35′52″E / 16.365274°N 80.597706°E / 16.365274; 80.597706
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం దుగ్గిరాల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి మేఘావత్ పార్వతీబాయి
జనాభా (2001)
 - మొత్తం 11,098
 - పురుషుల సంఖ్య 5,137
 - స్త్రీల సంఖ్య 5,143
 - గృహాల సంఖ్య 2,555
పిన్ కోడ్ 522330
ఎస్.టి.డి కోడ్ 08644

దుగ్గిరాల గుంటూరు జిల్లాలో తెనాలి సమీపములోని ఒక గ్రామం. అదేపేరుగల మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన తెనాలి నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3128 ఇళ్లతో, 11098 జనాభాతో 805 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5505, ఆడవారి సంఖ్య 5593. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2271 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 638. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590269[1].పిన్ కోడ్: 522330. ఎస్.టి.డి.కోడ్ = 08644.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

చింతలపూడి 3 కి.మీ, అనుమర్లపూడి 3 కి.మీ, నందివెలుగు 3 కి.మీ, మోరంపూడి 4 కి.మీ, ఈమని 4 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన తెనాలి మండలం, పశ్చిమాన పెదకాకాని మండలం, ఉత్తరాన మంగళగిరి మండలం, తూర్పున కొల్లిపర మండలం.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల (శ్రీ కొత్త రఘురామయ్య స్మారక డిగ్రీ కళాశాల) ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.

 • నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల
 • జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో 2014 డిసెంబరు 15 న చదువులతల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సమీప ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడిలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

దుగ్గిరాలలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

దుగ్గిరాలలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

దుగ్గిరాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 277 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 527 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 527 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

దుగ్గిరాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 421 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 106 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

దుగ్గిరాలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, పసుపు, మొక్కజొన్న

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

పసుపు పొడి, కాఫీ పొడి

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)[మార్చు]

ఈ సంఘం కొరకు, 9 లక్షల రూపాయల నాబార్డు నిధులతో చేపట్టిన నూతన గోదాము నిర్మాణం పూర్తి అయినది. ఈ సొసైటీ ద్వారా రైతులకు విక్రయించడానికి తెచ్చిన ఎరువులను, ఈ గోదాములో నిలువచేసెదరు. [15] ఈ గ్రామానికి మూడు మార్గాల ద్వారా చేర వచ్చు  1) రోడ్డు ద్వారా (విజయవాడ నుండి, తెనాలి నుండి, ఈమని నుండి, నంబూరు నుండి ) 2) రైల్ ద్వారా (విజయవాడ నుండి, తెనాలి నుండి ) 3) జల మార్గం ద్వారా (మంగళగిరి నుండి, తెనాలి నుండి, సంగం జాగర్లమూడి నుండి).

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. శ్రీ నిమ్మగడ్డ వెంకట్రావు గారు, 1959 నుండి 1964 వరకూ ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అప్పటి రాష్ట్ర సలహా కమిటీలో, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, గౌతు లచ్చన్న గార్లతోపాటు, వీరు గూడా సభ్యులుగా ఉన్నారు. వీరు 2014,మార్చిలో కాలధర్మం చెందినారు. [5]
 2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మేఘావత్ పార్వతీబాయి సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ వల్లూరి కోటేశ్వరరావు ఎన్నికైనారు. శ్రీ వల్లూరు కోటేశ్వరరావు, 2016,ఫిబ్రవరి-10న తన ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేసారు. [3]&[14]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయకస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక రథశాల వద్దయున్న ఈ ఆలయంలో, 2015,జూన్-6వ తేదీ శనివారంనాడు,శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ వినాయకస్వామివారి కళ్యాణం, అర్చకుల పవిత్ర వేదమంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. [11],

శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖమాసం(మే నెల)లో నాలుగు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. రెండవ రోజు రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. [7]

శ్రీ భూ, నీలా సమేత చెన్నకేశవస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, 2014,ఏప్రిల్-12 రాత్రి నుండి 15 వతేదీ వరకూ నిర్వహించెదరు. 13వ తేదీ రాత్రి 7 గంటలకు, స్వామివారి కళ్యాణం, వైభవంగా నిర్వహించారు. అర్చకుల పవిత్ర వేదమంత్రాల మధ్యన, ఉదయం నుండి ప్రత్యేకపూజలు, అభిషేకాలు జరిపినారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 14న భక్తుల దర్శనార్ధం, ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. విష్ణాలయం నుండి శివాలయం, జెండాచెట్టు, గ్యాస్ కంపెనీ, రైలుపేట మీదుగా ఈ ఉత్సవం సాగింది. గ్రామ వీధులలో భక్తులు, స్వామివారికి హారతుకు పట్టి నైవేద్యాలు సమర్పించారు. [6]

శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ రామాలయం[మార్చు]

దుగ్గిరాల రామానగర్ లో, గ్రామస్థుల వితరణతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2014, ఆగస్టు-20, శ్రావణమాసం, బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠా కార్యక్రం, కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. [8]

శ్రీ హనుమంత మందిరం[మార్చు]

దుగ్గిరాలలోని చెన్నకేశవనగర్‌లో నెలకొన్న ఈ అలయంలో 2017,మార్చి-10వతెదీ శుక్రవారంనాడు, ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అభయాంజనేయస్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. [14]

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు[మార్చు]

 • వెనిగళ్ళ సత్యనారాయణరావు స్వాతంత్ర్య సమరయోధునిగా కారాగార శిక్ష అనుభవించారు. గ్రామ సర్పంచిగా పనిచేసి గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. ప్రజాభిమానంతో వరుసగా సమితి అధ్యక్షునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, మంత్రిగా నిస్వార్ధ సేవలందించారు. దుగ్గిరాల గ్రామానికి డిల్లీ స్థాయిలో పేరు తెచ్చి పెట్టారు. అదే స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేశారు. మూడు వంతెనలు, ప్రత్యేక రహదారులు, యార్డు ఏర్పాటుచేసి, పసుపు వ్యాపారంలో దుగ్గిరాలకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చి పెట్టారు. గ్రామంలో టెలిఫోను ఎక్ఛేంజి, విద్యుత్తు సబ్ స్టేషను నిర్మింపజేశారు. రెండు సార్లు ఎం.ఎల్.సి.గా, మొత్తం 12 సం. రాజకీయ సేవలందించారు. [4]
 • పెద్దేటి యోహాను గుర్రం జాషువా కళా పరిషత్తు అధ్యక్షులు. వీరు గతంలో 1500 వరకు బుర్రకథా ప్రదర్శనలు ఇచ్చారు. వీరికి గత సంవత్సరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు పురస్కారం అందజేసినారు. తాజాగా వీరు 2015వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాదిపురస్కారానికి ఎంపికైనారు. [10]
 • నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రవీంద్రనాథచౌదరి, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీ రమేష్ కుమార్, ఐ.ఎ.ఎస్. చదివినారు. వీరు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. తాజాగా వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులైనారు. [13]
 • శిరోమణి సహవాసి (జంపాల ఉమామహేశ్వరరావు)
 • కొత్త లక్ష్మీరఘురామయ్య
 • నిమ్మగడ్డ రత్తయ్య కమ్యూనిస్టు హతసాక్షి
 • వడ్డెపాటి నిరంజనశాస్త్రి

గ్రామ విశేషాలు[మార్చు]

 1. దుగ్గిరాల భారతదేశంలోని ప్రధాన పసుపు వ్యాపారకేంద్రాల్లో ఒకటి.
 2. దేశంలోని అగ్రగామి కాఫీ తయారి సంస్థ "కాంటినెంటల్ కాఫీ" దుగ్గిరాల పట్టణంలో ఉంది.
 3. దుగ్గిరాలకు చెందిన దోస్త్ (దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ = Duggirala One Seva Trust) వారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టుచున్నారు. [12]

దుగ్గిరాల గ్రామానికి చెందిన పృద్ధ్వీరాజ్,ప్రస్తుతం, 2020లో జరుగుచున్న ఐ.పి.ఎల్.క్రికెట్ పోటీలలో,సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టు తరపున పోటీలలో పాల్గొనుచున్నాడు. దిగ్గజ బౌలర్ భువనేశ్వర్ గాయపడటంతో అతడి స్థానంలో, ఇతడికి అవకాశం రానున్నది. ఇప్పటికే ఇతడు ఆ జట్టులో అదనపు బౌలరుగా ఉన్నాడు. ఇంతకు ముందు 2018లో కూడా, ఇతడు కలకత్తా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించినాడు. దుగ్గిరాలకు చెందిన్ శ్రీ జంపాల వెంకటేశ్వరరావు (దేవుడు పాదాల వెంకయ్య) రెండవ కుమార్తె అయిన కృష్ణకుమారికి కుమారుడు ఇతడు. ఇతడి తండ్రి శ్రీ యర్రా శ్రీనివాసరావు,విశాఖపట్నంలో సివిల్ ఇంజనీరుగా పనిచేయుచున్నారు. తల్లి శ్రీమతి కృష్ణకుమారి ట్రాన్స్‌కో లో ఉద్యోగినిగా పనిచేయుచున్నారు. []

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10,280.[3] ఇందులో పురుషుల సంఖ్య 5,137, స్త్రీల సంఖ్య 5,143, గ్రామంలో నివాస గృహాలు 2,555 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 805 హెక్టారులు.

మూలాలు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.
 3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-09-06.

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు సిటీ;2020,అక్టోబరు-7,1వపేజీ.