మంచికలపూడి
మంచికలపూడి | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 16°20′42.000″N 80°36′54.000″E / 16.34500000°N 80.61500000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు |
| మండలం | దుగ్గిరాల |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( 08644 |
| పిన్‌కోడ్ | 522330 |
మంచికలపూడి , గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది దుగ్గిరాలకు 1 1/2 కి.మీ దూరములో ఉంది. 'కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీ' ప్రక్కన రోడ్డు గుండా మంచికలపూడి గ్రామం చేరుకోవలెను.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
[మార్చు]- మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
ఈ పై 2 పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్ధం, సి.సి.ఎల్.కంపెనీ తరపున, 2016, జనవరి-2న, 2.45 లక్షల రూపాయల విలువైన 55 బెంచీలను వితరణగా అందించారు. [2]
3.దళితవాడలోని ప్రభుత్వ పాఠశాల.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యార్లగడ్డ భగత్ సింగ్, సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన పోతరాజుదేవాలయం, పొలిమేర్లలో మహంకాళీ ఆలయము ఉన్నాయి. ప్రతి ఆదివారము ఈ ఆలయముల వద్ద భక్తులు వేలాదిగా చేరి ఆనందోత్సాహముతో ప్రార్థనలు చేస్తారు.
- శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం.
- శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.
