రేవేంద్రపాడు
రేవేంద్రపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°24′01″N 80°37′33″E / 16.400148°N 80.625754°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | దుగ్గిరాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి కేశంనేని అరుణకుమారి |
పిన్ కోడ్ | 522302 |
ఎస్.టి.డి కోడ్ | 08645 |
రేవేంద్రపాడు, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ చరిత్ర
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఈ గ్రామం దుగ్గిరాలకు పడమరగా 3 కి.మీ. దూరాన ఉంది.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
[మార్చు]రేవేంద్రపాడు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో, మండలంలోనే అత్యధిక సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు చదువుచున్నారు. 2013-14 వ సంవత్సరంలో, ఈ పాఠశాల విద్యార్థులు, 139 మంది 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, 118 మంది ఉత్తీర్ణులైనారు. 10 మంది 9 పైగా మార్కులు సాధించారు. ట్రిబుల్ ఐ.టి. ప్రారంభించినప్పటి నుండి, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా, ఈ పాఠశాల, 2 సీట్లు సాధించుచున్నది. ఒక సంవత్సరం 4 సీట్లు వచ్చినవి. [3] గ్రామంలో హారిక జూనియర్ కళాశాల ఉంది.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కేశంనేని అరుణకుమారి, సర్పంచిగా ఎన్నికైంది. ఈమె తరువాత దుగ్గిరాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం
[మార్చు]గ్రామంలోని జిల్లా పారిషత్తు వెనుక బాగంలో, ఈ ఆలయం ఇక్కడ 200 సంవత్సరాలుగా ఉంది. ఈ ఆలయాన్ని దాతల వితరణతో, నూతనంగా, నెలరోజుల వ్యవధిలోనే పునర్నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించనున్న గంగానమ్మ, పోతురాజు, నాగదేవత, బొడ్డురాయి విగ్రహాలను 2015, జూన్-4వ తేదీ గురువారంనాడు, గ్రామంలో ప్రదర్శనగా తీసికొనివచ్చారు. 5వ తేదీ శుక్రవారంనాడు ధాన్యాదివాసం చేయించారు. ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమలు, 6వ తేదీ శనివారం ఉదయం ఋత్విక్కుల వేదమంత్రాల మధ్య, గణపతిపూజతో ప్రారంభించి, కలశపూజ నిర్వహించారు. ప్రత్యేకంగా ఆలయ ఆవరణలో నిర్మించిన యాగశాలలో హోమాలు నిర్వహించారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి, సుబ్రహ్మణ్యపూజ, జంటనాగ, పంచముఖ నాగేంద్రస్వమిల క్షీరాధివసం, సాయంత్రం 4 గంటలకు రుద్రాభిషేకం నిర్వహించారు. 8వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలనుండి హోమాలు ప్రారంభించారు. 7-42 గంటలకు యంత్రస్థాపన, అనంతరం గంగానమ్మ, పోతురాజు, నాగేంద్రస్వామి విగ్రహాలను, భక్తుల జయజయధ్వానాల మధ్య ప్రతిష్ఠించారు. అదే రోజు ఉదయం 11-49 గంటలకు తదుపరి, బొడ్డురాయి (నాభిశిల) ని, శివాలయం ప్రహరీ గోడ ప్రక్కనే ఉన్న ప్రధాన ద్వారం సమీపంలో ప్రతిష్ఠించారు. వేలసంఖ్యలో వచ్చిన భక్తులు, దేవతా మూర్తులకు పసుపు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేసారు.
ఈ ఆలయం ప్రారంభించిన తరువాత మొదటి కొలుపులు, 2015, ఆగస్టు-30వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. జాతరకు, కొలుపులకు ఉపయోగించుటకు కొత్తగా ఉత్సవమూర్తిని తయారుచేయించారు.
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు 2017, జూన్-8వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, విశేషపూజలు నిర్వహించెదరు. సామూహిక కుంకుమార్చన నిర్వహించెదరు. ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగేంద్రస్వామివారికి పూజలు నిర్వహించెదరు. ఉదయం 11 గంటల నుండి భక్తులకు అన్నప్రాసాద వితరణ చేయుదురు.
శ్రీ ఙానసాయి మందిరం
[మార్చు]గ్రామంలో ప్రధానమైన పంటలు
[మార్చు]వరి, అపరలు, కాయగూరలు
గామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.