Jump to content

శిరోమణి సహవాసి

వికీపీడియా నుండి
(జంపాల ఉమామహేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)

శిరోమణి సహవాసి అని పేరొందిన జంపాల ఉమామహేశ్వరరావు గుంటూరు జిల్లా, తెనాలి సమీపమునగల దుగ్గిరాల గ్రామములో 1933 డిసెంబరు 23న జన్మించాడు[1].

విద్య

[మార్చు]

గ్రామ పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత విద్య తరువాత ఇంటర్ తెలుగులో ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుండి మొదటి స్థానములో నిలిచి బంగారు పతకము పొందాడు. 1954-58 లోబి.ఎ (రాజకీయ శాస్త్రము)హానర్స్ చేశాడు.

వృత్తి

[మార్చు]

1959 నుండి 1981 వరకు ఆంధ్ర ప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఆడిటర్ గా చేశాడు. 1983లో పదవీ విరమణ చేసి ఈనాడు దినపత్రికలో ఉద్యోగిగా చేరాడు. 1984లో సహాయక వార్తా సంపాదకునిగా పనిచేశాడు. 1985 జనవరి నుండి 1996 వరకు సంపాదకునిగా చేశాడు. పదమూడు సంవత్సరములు సంపాదకీయాలు, పతాక శీర్షికలు చూశాడు. 1996-98లో ఉదయం పత్రికకు ముఖ్య వ్రాతగానిగా చేశాడు. 2000-01లో విజేతకు సంపాదకునిగాను, 2002-03లో తెలుగుదేశం పక్ష పత్రికకు సహ సంపాదకునిగా ఉన్నాడు. కొంతకాలం డిస్కవరీ మాసపత్రికకు గౌరవ సంపాదకునిగా ఉన్నాడు.

ప్రముఖ రచనలు

[మార్చు]
  • తిరుమల తిరుపతి ధర్మస్థానము మిరాసీ వ్యవస్థపై "కలియుగ వైకుంఠపాళీ" పేరిట 14 రోజుల సీరియల్.
  • దేవాలయాల దుస్థితి, ఆలయ భూముల ఆక్రమణపై "ఘంటారావం" పేరిట వార్తా సీరియల్.
  • పట్టణ భూగరిష్ఠ చట్టం పై "సీలింగ్ సిత్రాలు" సీరియల్.
  • తిరస్కృతులు (దాస్తొయెవ్‌స్కీ "The insulted and the humiliated"కి తెలుగు అనువాదం).
  • రక్తాశ్రువులు (నార్మన్ బెథూన్ "The scalpel and the sword"కి తెలుగు అనువాదం).
  • ఏడుతారాలు ((అలెక్స్ హేలీ) "Roots" కి తెలుగు అనువాదం)
  • వేమన మాట తాట.
  • ప్రవక్త-సంస్కర్త వీర బ్రహ్మేంద్రస్వామి.
  • స్వరాజ్య సమరం
  • జలగం వెంగళరావు జీవిత చరిత్ర.
  • మాలపల్లి సంక్షిప్త నవల.
  • రాజశెఖర చరిత్ర సంక్షిప్త నవల.
  • మంచి చెడు సంక్షిప్త నవల.
  • కథాసరిత్సాగరం-అనుసరణ.
  • పంచతంత్రం-అనుసరణ.

పురస్కారాలు

[మార్చు]

1953లో ధర్మవరం కృష్ణాచార్యులు పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయమువారి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, తాపీ ధర్మారావు ధర్మనిధి పురస్కారం అందుకున్నాడు.

మరణం

[మార్చు]

సహవాసి 2007 ఆగస్టు 29న మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 296
  2. చౌదరి, జంపాల. "నూరేళ్ళ తెలుగు నవల". పుస్తకం.నెట్. Archived from the original on 2016-03-23. Retrieved 2019-05-26.