ఉదయం (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉదయం దినపత్రిక 1984 సంవత్సరంలో ప్రముఖ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత దాసరి నారాయణరావు ప్రారంభించారు.

ఉదయం పత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు ఛైర్మన్. రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేశారు. ఇది హైదరాబాదు, విజయవాడ నుండి ప్రచురించబడేది. ప్రసాద్ తరువాత కె.రామచంద్రమూర్తి, కె.ఎన్.వై.పతంజలి పత్రికను నిర్వహించారు.

1991లో మాగుంట సుబ్బరామరెడ్డి ఉదయం పత్రికను కొన్నారు. గజ్జెల మల్లారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, తరువాత కె.రామచంద్రమూర్తి ప్రధాన సంపాదకులుగా ఉన్నారు.

కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కార్మిక సమస్యలు తలెత్తి పత్రిక మూతపడినది.

ప్రత్యేకతలు[మార్చు]

  • అప్పటికి అత్యధికంగా అనగా రెండు లక్షల కాపీలతో పత్రిక ప్రారంభమైనది.
  • ఉదయంలో సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురించబడిన కొన్ని 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టులు' చాలా ప్రాచుర్యం పొందాయి.
  • హైదరాబాదు నగరం కోసం ప్రత్యేకంగా టాబ్లాయిడ్ ప్రచురించడం మొదలుపెట్టినది.
  • విద్యార్థుల కోసం వెలువరించిన అనుబంధం "దిక్సూచి" చాలా ప్రసిద్ధమైనది.