విహంగ (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విహంగ అంతర్జాలంలో ఒక మహిళా సాహిత్య పత్రిక.

’’విహంగ” తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక. ఇది మహిళా పత్రిక. అంతర్జాలంలోమహిళల కోసం ఒక్క వెబ్ పత్రిక కూడా లేకపోవడమే ఈ ప్రయత్నానికి కారణం. ఉన్న ఒకటి , అరా పత్రికలు కూడా ప్రింట్ మీడియా నుంచి వెబ్ కి తరలించబడ్డవే.

అయినా స్త్రీల సాహిత్య పరిమాణం కొరతగానే ఉన్నందు వల్ల ఇంకా విరివిగా స్త్రీల సాహిత్యం, పత్రికలు అంతర్జాలంలో కాలు మోపాలని మా ప్రగాఢ వాంఛ.

మా ప్రయత్నంగా … పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న… ‘మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ’ సంస్థ ఆధ్వర్యం లో తెలుగు మహిళల భావోద్వేగాలకు వేదిక గా ‘విహంగ’ ని తొలి తెలుగు వెబ్ పత్రికగా 11-1-2011 తేదీన అంతర్జాలపు వినువీధుల్లో సగర్వంగా ఎగరేస్తున్నాం.

ISSN గుర్తింపు పొందిన తొలి తెలుగు పత్రిక "విహంగ".

విహంగ విక్షణం[మార్చు]

‘విహంగ’ వ్యక్తి స్వేచ్ఛను , అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుంది. విశాల భావాల పట్ల ఆదరణ చూపుతుంది.వైజ్ఞానిక ,మనోవికాసానికి స్వాగతం పలుకుతుంది. కళాత్మకమైన, భావనాత్మకమైన సంవేదనల్ని తమ సంఘర్షణల్ని అక్షర రూపం లో ప్రకటించే సృజనకారులని ఆహ్వానిస్తుంది. అరమరికలు లేని స్నేహ హస్తాన్ని అందిస్తుంది.

==విహంగ పత్రిక సారధులు==
 • వ్యవస్థాపకులు  : పుట్ల హేమలత
 • సంపాదకులు :మానస ఎండ్లూరి
 • సహా సంపాదకులు : డా .అరసి
 • సంపాదక వర్గం:
  • కాత్యాయనీ విద్మహే
  • కుప్పిలి పద్మ
  • మెర్సీ మార్గరెట్
  • చల్లపల్లి స్వరూప రాణి
  • జాజుల గౌరి

పదేళ్ళ విహంగ పయనం :

పది సంవత్సరాలుగా అంతర్జాలంలో వెలువడుతున్న పత్రికగా విహంగకు మంచి గుర్తింపు ఉంది . తొలి మహిళా పత్రిక గా మొదలైన విహంగ ప్రస్తానం నేటికి నిర్విరామంగా కొనసాగుతుంది . విహంగలో పర్చురించబడిన కథలు పై విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు కూడా జరిగాయి .

ప్రస్తుతం :

ప్రస్తుతం మానస ఎండ్లూరి , డా.అరసి ల సారధ్యం లో విహంగ ప్రతి నెల ఒకటవ తేదీన అంతర్జాలంలో వెలువడుతుంది .

విహంగ సాహితీ పురస్కారాలు[మార్చు]

మహిళల జీవితంలోని వివిధ కోణాలను పాఠకులకు అందిస్తున్న విహంగ అంతర్జాల మాసపత్రిక, 2017 నుండి ‘విహంగ సాహితీపురస్కారాల’ను అందిస్తుంది. వివిధ రంగాల్లో కృషిచేసిన వ్యక్తులను గుర్తించి వారిని సత్కరిస్తుంది. 2017 సంవత్సరంలోగబ్బిట దుర్గా ప్రసాద్ , కె.వరలక్ష్మి ,కె .గీత , డా.దార్ల వెంకటేశ్వరరావు, డా.షమీఉల్లా , డా.లక్ష్మి సుహాసిని , విజయ భాను కోటే , బొడ్డు మహేందర్ ఈ పురస్కారాలను అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహితీపీఠం, రాజమహేంద్రవరం క్యాంపస్ మీటింగ్ హాలులో జనవరి 11, 2017 వతేదీన ఈ పురస్కారాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అందించారు. విహంగకి సాంకేతిక సహకారం అందిస్తున్నపెరుమాళ్ళ రవికుమార్ లకు కూడా ఈ పురస్కారాలతో సత్కరించారు. [1]

బయటి లింకులు[మార్చు]

 1. http://vihanga.com/?p=19138 (విహంగ పురస్కారాలు)

2.http://vihanga.com/