అరసిశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అరసి శ్రీ(Arasi Sri).Dr.Lakshman Adimulam. ఆగస్ట్ 26 1988 తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో జన్మించారు . నృత్య కళాకారులు , రచయిత , పత్రిక ఎడిటర్ , కాలమిస్ట్ .

చదువు

[మార్చు]

డిగ్రీ లో స్పెషల్ తెలుగు పూర్తి చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఏం .ఏ , ఏం .ఫీల్ , పి .హెచ్ .డి పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు .

నృత్యం

[మార్చు]

చిన్నతనంలో శ్రీమతి మద్దనాల లక్ష్మి జ్యోతి గారి వద్ద శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ ప్రారంభించారు . తర్వాత కాలంలో ఆంద్ర నాట్యం , ఆలయ నృత్యంలో కళా రత్న డా .సప్పా దుర్గా ప్రసాద్ గారి వద్ద పదేళ్లు శిష్యరికం చేశారు . శ్రీమతి శ్రీలక్ష్మి చింతలూరు పర్యవేక్షణలో కూచిపూడిలో సర్టీఫి కేట్ , డిప్లమో పూర్తి చేసారు .

ముఖ్యంగా ఆంద్ర నాట్యం ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు. శైవాగమ , వైష్ణవాగమ వంటి ఆగమన పద్దతుల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.రాజమహేంద్రవరంలో తన గురువుగారైన కళారత్న డా.సప్పా దుర్గాప్రసాద్ గారి తర్వాత ఆగమన పద్దతుల్లో పిల్లలకి శిక్షణ ఇస్తూ ఆలయ సంప్రదాయంలో ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు.ప్రదర్శనతో పాటుగా ఆలయ సంప్రదాయ నృత్యం గురించి వీరు వివరణ శైలి  ఎందరో ప్రశంసలను పొందింది.

సహా సంపాదకులు

[మార్చు]

అంతర్జాలంలో నడుస్తున్న తొలి తెలుగు మహిళా పత్రిక "విహంగ "పత్రికకు సహా సంపాదకులుగా పదేళ్లుగా  విహంగ పయనంలో  కీలక భూమిక పోషిస్తున్నారు.

విహంగ మహిళా సాహిత్య పత్రిక. ఈ పత్రిక వ్యవస్థాపకులు డా.హేమలత పుట్ల 2011 -11 -11 న అంతర్జాలంలో ప్రారంభించారు.  ఈ పత్రికలో సుదీర్ఘ కాలంగా సహా సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు అరసిశ్రీ.

అంతర్జాలంలో తొలి మహిళా పత్రిక. ISSN గుర్తింపు పొందిన తొలి అంతర్జాల తెలుగు పత్రిక కావడం విశేషం.[1]

డా.పుట్లహేమలత తర్వాత యువ రచయిత్రి మానస ఎండ్లూరి , డా.అరసిశ్రీ నేతృత్వంలో ప్రస్తుతం విహంగ పత్రిక ప్రతి నెల అంతర్జాలంలో వెలువడుతుంది.

పత్రికలో వీరు రాసిన పుస్తక సమీక్షలు, ముఖాముఖీలు,  సంపాదకీయాలు ఉన్నాయి. ఈ క్రమంలో డా.అరసి శ్రీ “నర్తన కేళి “[2] శీర్షికతో  శాస్త్రీయ నాట్యంలో రాణిస్తున్న ఎందరో నాత్యాచారిణిల  విజయగాధను, వారి అంతరంగ విశేషాలను   తెలియజేసిన ఈ శీర్షిక విశేష ఆదరణ పొందింది.

విహంగ పత్రిక పదేళ్ళ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వెబ్ నార్ లో అరసిశ్రీ మాట్లాడిన ప్రసంగం పదేళ్ళ కి ముందు తర్వాత అంతర్జాలంలో తెలుగు పత్రికలు , వాటి నిర్వహణ ఎంత కష్టంగా ఉండేది, ఇప్పుడు ఎంత సులభతరం అయ్యిందో  తెలియజేసారు.

ప్రతినెల విహంగ లో వస్తున్న సంపాదకీయాలు వాస్తవ సంఘటనలతో పాటు నేటి తరం తెలుసుకోవాల్సిన మహనీయుల గురించి వీరు రాస్తున్న సంపాదకీయాలు ఆలోచించే విధంగా ఉంటాయి.[3]

కాలమిస్ట్

[మార్చు]

కొంత కాలం కాలమిస్ట్ గా విశాఖ సంస్కృతి పత్రికలో “కమనీయమైన కళ “ పేరుతో శీర్షికను నిర్వహించారు. [4] .

అకాడమీ నృత్య శిక్షణ

[మార్చు]

రాజమహేంద్ర వరంలో " శ్రీ నాట్య మయూరీ కళాక్షేత్ర" డాన్స్ అకాడమీ స్థాపించి ఎందరో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. తన శిష్యులకు ఆలయ సంప్రదాయంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.  వీరి శిష్యుల్ కేవలం ఆలయ సంప్రదాయంలో ఆలయాల్లో మాత్రమే నర్తించడం వీరి ప్రత్యేకత. తూర్పు గోదావరి జిల్లాలోని ఆంధ్య నాట్యంలోని ఆలయ సంప్రదాయ నాట్య గురువులలో వీరు ఒకరు.

నాట్య ప్రదర్శనలు

[మార్చు]

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు యిచ్చారు . రాజమండ్రి , హైదరాబాద్ , కాకినాడ , విజయవాడ , ఏలూరు , విశాఖ పట్నం ,సత్తుపల్లి ,అన్నవరం , తణుకు , కొత్తగూడెం , ద్వారకా తిరుమల , నెల్లూరు, వంటి చేయట్లా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు .[5]

బిరుదులు

[మార్చు]

అభినయ నాట్య చూడామణి , శివ నంది పురస్కారం , నాట్య యువ కిశోరం ,విద్య కళారత్న , విహంగ సాహిత్య పురస్కారం , నాట్య చంద్రిక ,నాట్య చూడామణి, నర్తన విపంచి , వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.[6]

పరిశోధన

[మార్చు]

కళారత్న డా .సప్పా దుర్గాప్రసాద్ రచించిన "ప్రేమాంజలి చారిత్రిక కథ మీద ఏం ఫీల్ పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2013 లో ఏం ఫీల్ పట్టా అందుకున్నారు .

కూచిపూడి , ఆంద్ర నాట్య కళాకారుల సాహిత్య సేవ అనే అంశం పై పరిశోధన చేసి పి .హెచ్ డి పరిశోధన గ్రంధాన్ని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2017 లో డాక్టరేట్ అందుకున్నారు .

2016-17 సంవత్సరానికి CCRTఅందించే జూనియర్ ఫెలోషిప్ కి అర్హత సాధించి ... 2017-19 లో తెలుగు నాటకం , నాటిక రచయితలుగా కూచిపూడి నర్తకులు అనే అంశం పై పరిశోధన పూర్తి చేసారు.


విహంగ పత్రిక లింక్ ....http://vihanga.com/

పదేళ్ల విహంగ ప్రయాణం పై వచ్చిన సంపాదకీయ వ్యాసం .....అలుపెరగని విహంగం (సంపాదకీయం )- అరసి శ్రీ......http://vihanga.com/?p=29875

నర్తనకేళి ముఖాముఖీ మొదటి భాగం  ఇక్కడ  చూడవచ్చు http://vihanga.com/?p=5450

విహంగలో  అన్ని ఆర్టికల్స్ యిక్కడ చూడవచ్చు http://vihanga.com/?s=%E0%B0%85%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF+

E Tv  ఆంద్ర ప్రదేశ్ చానల్ లో  వీరి ప్రతిభను తెలియజేస్తూ   వచ్చిన కథనం ఈ లింక్ లో చూడవచ్చు.https://www.youtube.com/watch?v=UIU2LcvFxTA

అందరికి నమస్కారం ,

నేను మీ అరసి శ్రీ ... ఇక నుండి శ్రీ మయూరీ చానల్ ద్వారా వినోదం మరియు విలువైన సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను . మా వీక్షకులకి మన చానల్ ద్వారా ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించగలమని తెలియజేస్తున్నాము . మీ అందరి ఆదరాభిమానాలతో మన చానల్ మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాము . ఇట్లు ,

శ్రీ మయూరీ చానల్ బృందం.

www.youtube.com/@srimayurhub

మూలాలు

[మార్చు]
  1. "| Telugu Women Magazine". vihanga.com. Retrieved 2022-02-15.
  2. అరసి. "నర్తన కేళి -1 |" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-15.
  3. "సంపాదకీయం |" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-15.
  4. విశాఖ సంస్కృతి మే 2014(Visakha Samskruthi May 2014) By sirela sanyasi rao - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-02-15. Retrieved 2022-02-15.
  5. Madhura nagarilo|| Javali||Dr.arasisri, retrieved 2022-02-15
  6. DR.arasi sri ...sathulala chudare..., retrieved 2022-02-15

7.https://www.youtube.com/watch?v=UIU2LcvFxTA

8. www.youtube.com/@srimayurhub

"https://te.wikipedia.org/w/index.php?title=అరసిశ్రీ&oldid=4104535" నుండి వెలికితీశారు