సహాయం:నిర్వహణ మూసలను తీసెయ్యడం

వికీపీడియా నుండి
(సహాయం:Maintenance template removal నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కొన్ని వికీపీడియా వ్యాసాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ నిర్వహణ మూసలు ఉంటూంటాయి. ఆ మూసల్లో "ఈ మూసను ఎప్పుడు తీసెయ్యవచ్చో తెలుసుకోండి " అనే లింకును నొక్కితే ఇక్కడికి చేరుకుటారు. బహుశా మీరు కూడా అలాగే వచ్చి ఉంటారు.

నిర్వహణ మూసలను వాడుకరులు చేరుస్తారు. వాడుకరులే తీసేస్తారు. ఆ మూసలను ఏ సందర్భాల్లో తీసెయ్యవచ్చో, ఎప్పుడు తీసెయ్యకూడదో ఈ సహాయం పేజీ తెలుపుతుంది.

ఎప్పుడు తీసెయ్యవచ్చు[మార్చు]

నివహణ మూసలు వ్యాసాల్లో ఉండాల్సినవి కావు. వ్యతిరేకమైన ఆసక్తులు లేని వాడుకరి ఎవరైనా కింది సందర్భాల్లో వాటిని తొలగించవచ్చు:

 1. సమస్యను తగినంతగా పరిష్కరించి ఉంటే;
 2. సమస్యను పరిష్కరించినట్లుగా (బహుశా వేరెవరైనా) నిర్ధారించుకుని ఉంటే ;
 3. మూసను అక్కడ పొరపాటున ఉంచారని, దాన్ని అక్కడ ఉంచాల్సిన అవసరం లేదని తగు కారణాలతో భావిస్తే. ముందుగా ఆ మూసను పేజీలో పెట్టిన వాడుకరితో చర్చించండి (ఆ వాడుకరి వికీపీడియాలో చురుగ్గా లేకపోతే తప్ప). సమస్య వివాదాస్పదం అయ్యేలా ఉందనిపిస్తే చర్చాపేజీలో చర్చించి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించండి.
 4. సమస్యను ఎలా పరిష్కరించాలో చర్చాపేజీలో (లేదా మరెక్కడైనా) ఏకాభిప్రాయం వచ్చినపుడు. (మూస తొలగించే దిద్దుబాటు యొక్క సారాంశంలో ఆ చర్చను ఉదహరించండి, లింకు కూడా ఇస్తే మరీ మంచిది);
 5. సంబంధిత పాఠ్యానికి కాలదోషం పట్టడంతో, మూస అక్కడ అసంగతమని భావిస్తే;
 6. సదరు మూసకు తగినంత మద్దతు ఉండాల్సిన ఆవశ్యకత ఉండి, తగినంత మద్దతు అక్కడ లేకపోతే. ఉదాహరణకు: తటస్థత గురించిన {{COI}} (associated with the conflict of interest guideline) గానీ, {{POV}} (associated with the neutral point of view policy) గానీ పెట్టినపుడు సదరు వాడుకరి వ్యాసపు చర్చా పేజీలో తన చర్యకు మద్దతుగా చర్చను ప్రారంభించాలి. అలా చెయ్యకపోయినా, లేదా చర్చ ముందుకు సాగకపోయినా, - ఆ మూసకు వేరేవిధమైన మద్దతు ఏమీ లేనపుడు - దాన్ని తొలగించవచ్చు;

ఎప్పుడు తీసెయ్య కూడదు[మార్చు]

కింది వాటిలో ఏ ఒక్కదానితో సరిపోయినా నిర్వహణ మూసను తీసెయ్యకూడదు:

 1. మూస ఎత్తి చూపిన సమస్యలు మీకు అర్థం కాకపోతే;
 2. సమస్య ఇంకా పరిష్కారం కాకపోతే;
 3. సమస్య గురించి చర్చ లేదా పని జరుగుతూంటే (పాక్షిక దృక్కోణం (POV) గురించిన మూసలు దీనికి మినహాయింపు);
 4. వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల ప్రకారం మూస ఎత్తి చూపిన సమస్య వ్యాసంలో ఉండకూడనిది అయితే;
 5. మీరు ఆ వ్యాసంలో దిద్దుబాట్లు చేసేందుకు డబ్బు తీసుకుని ఉన్నా, లేదా మీకు పరస్పర వ్యతిరేక అసక్తులున్నా (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్)