ఏలూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?ఏలూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
మారుపేరు: ఎల్లొర్
హేలాపురి
ఏలూరు
అక్షాంశరేఖాంశాలు: 16°42′N 81°06′E / 16.7°N 81.1°E / 16.7; 81.1Coordinates: 16°42′N 81°06′E / 16.7°N 81.1°E / 16.7; 81.1
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 14.50 కి.మీ² (6 చ.మై)[1]
జిల్లా(లు) పశ్చిమ గోదావరి జిల్లా
జనాభా
జనసాంద్రత
2,17,876[2] (2011 నాటికి)
• 15,026/కి.మీ² (38,917/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం ఏలూరు నగర పాలక సంస్థ
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 532 001
• ++91-866
వెబ్‌సైటు: http://eluru.cdma.ap.gov.in/en/municipality-profile


ఏలూరు (Eluru, Ellore), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణము.[3] పిన్ కోడ్ నం. 534 00*., ఎస్.టి.డి.కోడ్ = 08812.

ఏలూరు (ఒకప్పుడు హేలాపురిగా వ్యవహరించబడేది) 1866 లో మునిసిపాలిటిగా ఏర్పడింది. (దేశంలో రెండవ మోడల్ మునిసిపాలిటి) 2005 లో మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తించబడింది.

మద్రాసు - కలకత్తా జాతీయ రహదారి (NH5) పై ఏలూరు నగరం విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు నగరాల మధ్య ఉంది. జిల్లా కేంద్రమైనందున ప్రభుత్వ కార్యాలయాల కేంద్రంగాను మరియు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల వ్యాపార, వైద్య, విద్య, రవాణా అవసరాల కేంద్రంగా ఉంటున్నది. వరి, కూరగాయలు, పొగాకు వర్తకం, చేపల ఎగుమతి, రా పెద్ద నిమ్మకాయల సి.ఆర్.రెడ్డి కాలేజి, అంబికా దర్బార్ బత్తి, జూట్ మిల్లు, తమ్మిలేరు, కృష్ణ కాలువ, సమీపంలో కొల్లేరు సరస్సు - ఇవి ఏలూరు గురించి చెప్పేటప్పుడు ప్రధానంగా ప్రస్తావించ దగిన అంశాలు.

 • ఏలూరు ప్రస్తుతం ఒక స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కార్పొరేషన్, మండల కేంద్రం, జిల్లా కేంద్రం, శాసనసభ నియోజక వర్గం, పార్లమెంట్ నియోజక వర్గం కూడాను.[ఉల్లేఖన అవసరం]

పట్టణం స్వరూపం, జనాభా[మార్చు]

2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 217, 876.[1]

ఏలూరు నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది.

మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర రెండుగా చీలుతుంది (అశోక్ నగర్ వద్ద) . ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు ప్రధాన పట్టణం వుంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్ కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది.[ఉల్లేఖన అవసరం]

కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది.కలిసి కొల్ గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, కృష్ణ కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వద్ద కోలేరులో కలవడానికి సాగుతాయి. ఈ కాలువల సంగమం గురించి వేమూరి వెంకటేశ్వరరావు "ఈమాట" అంతర్జాల పత్రికలో "మరపురాని స్మృతులు" అనే వ్యాసంలో ఇలా వ్రాశాడు -

మా ఊరికి చుట్టూ మూడు పెద్ద ఏరులున్నాయి. అందుకనే మా ఊరిని ఏలూరు అని అంటారు. ... తరువాత పండితులెవరో హేలాపురి అని సంస్కృతీకరించారు కూడాను. కృష్ణ, గోదావరీ నదుల సంగమం మా ఊరి కాలవ. తూర్పు లాకుల దాకా గోదావరి నీళ్ళు, పడమటి లాకుల దాకా కృష్ణ నీళ్ళూ. కృష్ణ ఎత్తు, గోదావరి పల్లం. ఆ రెండునదులూ కాలవలో సమతలంగా కలపడానికి తూర్పు లాకులు, పడమటి లాకులు ఉండేవి. ఆ లాకులు ముయ్యడం, తియ్యడం, పడవలని జాగ్రత్తగా కాలవలోకి పంపించడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. చైత్ర వైశాఖ మాసాల్లో లాకులు కట్టేసి కాలవ మూసేసే వాళ్ళు. అప్పుడు కాలవ ఎండి పోయేది. మళ్ళీ మృగశిర కార్తె రాంగానే, కాలవ వదిలే వాళ్ళు. మళ్ళీ ఇంచక్కా కొబ్బరికాయలు, అరిటిపళ్ళ పడవలూ తూర్పునించి పడమరకీ, పడమటినుంచి తూర్పు వేపుకీ వెళ్ళేవి. ఆ కాలవ నీళ్ళే పంపుల చెరువుల్లోకి పట్టి ఉంచేవాళ్ళు, ఎండా కాలంలో మంచినీటి కరువు రాకండా! ఇప్పుడు ఆ గొడవే లేదు. కాలవలో సమృద్ధిగా నీళ్ళు ఎప్పుడూ ఉండవు. కాలవలో పడవలు లేవు. పంపుల చెరువులు పూడి పోతున్నాయి.[4]

తమ్మిలేరు అనే యేరు ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలవుతుంది. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జల్లాలలో సుమారు 120 మైళ్ళు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. ఏలూరులో FCI గోడౌనుల దగ్గర రెండుగా చీలుతుంది. ఆ చీలికలు మొండికోడు, పెదయడ్లగాడి అనే రెండు స్థలాల వద్ద కొల్లేరులో కలుస్తాయి.[ఉల్లేఖన అవసరం]

1901లో పట్ణ జనాభా 33, 521 మాత్రమే ఉండేది. 1991 నాటికి ఇది 2, 12, 866 కు చేరుకొంది. 1991 లెక్కల ప్రకారం అక్షరాస్యత 72%. 1981-91 మధ్యకాలంలో 26.63% అక్షరాస్యతా వృద్ధి నమోదయ్యింది. 2001లో జనాభా 2, 15, 642.

భౌగోళికంగా ఏలూరు అక్షాంశ రేఖాంశాలు 16.7° N 81.1° E[5]. సముద్ర తలం నుండి ఎత్తు 22 మీటర్లు. (72 అడుగులు) . బంగాళాఖాతం తీరం నుండి ఏలూరు 40 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతం. ఏప్రిల్, మే, జూన్ నెలలు బాగా వేడిగా ఉంటాయి. ఏలూరులో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 51.7 డిగ్రీలు సెంటీగ్రేడ్ మరియు అత్యల్ప ఉష్ణోగ్రత 12.9 0 డిగ్రీలు సెంటీగ్రేడ్.

ఏలూరు పెద్దబజారు
ఓవర్ బ్రిడ్జి పైనుండి దృశ్యం
ఫైర్ స్టేషను సెంటర్
రమామహల్ సెంటర్

చరిత్ర[మార్చు]

హేలాపురి (ఏలూరు) పాత కాలంనుండి వేంగి అను రాజ్యములో భాగముగా ఉంది. తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 700 నుండి 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఏలూరు (హేలపురి) అప్పటి చాళుక్య సామ్రాజ్యములో ఒక ప్రాంతముగా ఉండేది. 1471లో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యములో భాగముగా ఉంది. ఆ తరువాత గజపతుల చేతుల్లోకి వచ్చి వారి పరిపాలనలో ఉంది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొన్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగి మరియు గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం]

బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరచినపుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది. పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్‌లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయి. ఆ విధంగా నగర జనాభా 3, 50, 000కు చేరుకొంది.[ఉల్లేఖన అవసరం]

పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఏల అన్న చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించడంతో ఏలూరు అన్న పేరు ఏర్పడివుంటుందని బూదరాజు రాధాకృష్ణ వంటి పరిశోధకులు భావిస్తున్నారు.[6]

ప్రముఖులు[ఉల్లేఖన అవసరం][మార్చు]

ముఖ్య ప్రాంతాలు[మార్చు]

ఏలూరు నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణం మధ్యగా తమ్మిలేరు కాలువ ప్రవహిస్తుంది. స్థూలంగా పట్టణాన్ని I టౌన్ (తమిళేరు కాలువకి ఆవల వున్న ప్రాంతం) మరియు II టౌన్ (తమిళేరు కాలువకి ఇవతల వున్న ప్రాంతం) గా విభజించవచ్చు. అయితే పోస్టల్ వారి ప్రకారం ఏలూరు-1 (తమిళేరు కాలువ నుండి తూర్పు వైపు వున్న ప్రాంతం), ఏలూరు-2 ( పవర్ పేట, ఆర్ ఆర్ పేట తదితర ప్రాంతాలు), ఏలూరు-3 (శనివారపు పేట), ఏలూరు-3 (చాటపర్రు ప్రాంతం), ఏలూరు-5 (రైల్వే స్టేషన్, ఆదివారపు పేట ప్రాంతాలు, తంగెళ్ళమూడి), ఏలూరు-6 (నరసింహారావు పేట, అమీనా పేట, అశోక్ నగర్ ప్రాంతాలు), ఏలూరు-7 (వట్లూరు, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు ప్రాంతాలు) లుగా విభజించబడింది. ప్రధాన విభాగాలు[ఉల్లేఖన అవసరం]

 • వ్యాపార కేంద్రాలు: మెయిన్ బజారు, ఆర్.ఆర్. పేట, బిర్లా భవన్ సెంటర్, చాటపర్రు రోడ్ సెంటర్, ఘడియారపు స్తంభం, నరసింహా రావు పేట, పత్తేబాద, జి యన్ టి రోడ్.
 • ప్రయాణ కేంద్రాలు: పెద్ద రైల్వే స్టేషను, పవర్ పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషన్, క్రొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, ఆశ్రం హాస్పిటల్.
 • వైద్య కేంద్రాలు: రామ చంద్రరావు పేట, వెంకట్రావు పేట, పెద్దాసుపత్రి, ఆశ్రం హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీ
 • కూడళ్ళు: I టౌన్ : గడియారపు స్తంభం సెంటర్, పెద్ద వంతెన సెంటర్, కర్ర వంతెన సెంటర్, వసంత మహల్ సెంటరు, బిర్లా భవన్ సెంటర్, కొత్త రోడ్డూ, వంగాయగూడెం సెంటర్ చౌరాస్తా, జ్యూట్ మిల్ జంక్షన్
 • II టౌన్ కూడళ్ళు : పాత బస్ స్టాండు సెంటర్, పవర్ పేట సెంటర్, ప్రెస్ గేటు సెంటర్, రమామహల్ సెంటరు, మధులత సెంటర్, విజయవిహర్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటరు
 • ప్రధాన నివాస కేంద్రాలు: పవర్ పేట, గాంధీ నగరం, కొత్త పేట, నరసింహారావు పేట, రామచంద్రరావు పేట, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు, ఖాదర్ జండా, ఖతీబ్ వీధి, ఆదివారపు పేట, పెన్షన్ మొహాల్ల, అమీన పేట, అశోక్ నగర్, ఇస్రేల్ పేత, పత్తేబాద, గవరవరం, తంగెళ్ళమూడి.
 • విద్యా కేంద్రాలు: సత్రంపాడు (డిగ్రీ, పి.జి., బి.యిడి, పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ తదితర సి.ఆర్.ఆర్ కాలేజీలు మరియు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ) ఆర్ ఆర్ పేట, విద్యానగర్, గవరవరం (సెయింట్ దెరిసాస్ కాలేజీలు, సెయింట్ జేవియర్ స్కూల్స్) దుగ్గిరాల (డెంటల్ కాలేజీ), మల్కాపురం (ఆశ్రం హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీ)
 • నగరంలో కలిసిపోయిన పరిసర గ్రామాలు: తంగెళ్ళమూడి, సత్రంపాడు, గవరవరం, శనివారపుపేట, చోదిమెళ్ళ, చాటపర్రు.
 • మెహర్ బాబా సెంటర్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు

రవాణా మరియు కమ్యూనికేషన్[మార్చు]

Eluru New Bus Stand Departure Block

ఏలూరు నగరం, రోడ్డు, రైలు మరియు జలమార్గాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు చాలా బాగా అనుసంధానించబడి ఉంది.

రోడ్డు మార్గాలు[మార్చు]

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 43, జాతీయ రహదారి 44 లతో ఈ నగరం అనుసంధానమై ఉంది.[7][8] జిల్లా కేంద్రంగా కూడా ఏలూరునుండి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రోడ్డు ప్రయాణ సదుపాయం ఉంది. బస్సు, ఆటో, రైల్వే రవాణా సేవలు ప్రధానమైనవి. ఏలూరు పాత బస్సు స్టేషన్ మరియు ఏలూరు కొత్త బస్సు స్టేషన్ల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సు నడుపుతోంది.[9][10]

రైలు మార్గాలు[మార్చు]

ఏలూరు రైల్వే స్టేషన్

ఏలూరు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజన్లొని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక రైల్వే స్టేషను.[11] పవర్‌పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషను నగరానికి చెందిన శాటిలైట్ స్టేషన్లు. ఈ స్టేషన్లు హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉన్నాయి.

వాయు మార్గం[మార్చు]

గన్నవరం (విజయవాడ) ఏలూరుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం (35 కి.మీ) . ఇక్కడి (విజయవాడ) నుండి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, అహ్మదబాద్, పూనే, జైపూర్, రాజమండ్రి, విశాఖపట్నం, కోల్ కత్తా, ఢిల్లీలకు ప్రతిరోజూ విమానాలు ఉన్నాయి (ఎయిర్ కోస్త, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్ మరియు ఏయిరిండియా సంస్థల ద్వారా) . ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా విమానయానం అందుబాటులో ఉంది.

వాటర్వేస్[మార్చు]

జాతీయ జలమార్గం 4 గా ప్రకటించబడిన జలమార్గం తీర ప్రాంతం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హాం కాలువ ద్వారా వెళ్తుంది.[12]

కమ్యూనికేషన్[మార్చు]

చాలా కాలంనుండి టెలిఫోన్, టేలి ఫ్యాక్స్ లు అందుబాటులోఉన్నాయి. ఇంటర్నెట్ వంటి సదుపాయాలు, కేబుల్ టెలివిజన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి.

పౌర పరిపాలనన[మార్చు]

ఏలూరు పురపాలక సంఘాన్ని 1866 లో స్థాపించారు. నగర అధికార పరిధి 12.02 kమీ2 (4.64 sq mi)తో 50 వార్డులు కలిగి ఉంది[13]. వై.సాయి శ్రీకాంత్ ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు షేక్ నూర్ జహాన్ నగర మేయర్గా ఉన్నారు.[14] 9 April 2005 న నగరపాలక నంస్థగా అభివృద్ధి చెందింది.

ఏలూరులో శాంతిభద్రతల కొరకు ఎనిమిది పోలీసు స్టేషన్లు నిర్వహించబడుతున్నవి. వీటిలో, ఒక మహిళా పోలీసు స్టేషను, ఒక ట్రాఫిక్ పోలీసు స్టేషనూ ఉన్నాయి. ఇవి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పరిధిలోకే ఉన్నాయి.[15]

విద్యా సదుపాయాలు[మార్చు]

ఇండియన్ ఇంస్టిట్యుట్ అఫ్ అయిల్ పాం రీసర్చ్

ఏలూరులోని విద్యా సంస్థలు ఏలూరు పట్టణము, మరియు పరిసర ప్రాంతాల యొక్క విద్యావసరాలకు ప్రధాన వనరులు[ఉల్లేఖన అవసరం]. వాటిలో కొన్ని:

 • "శ్రీమతి ఈదర సుబ్బమ్మ దేవి మునిసిపల్ ఉన్నత పాఠశాల" చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల. పాఠశాలలు తక్కువగా ఉన్నప్పటి కాలం నుండి పట్టణంలో చాలా మందికి ఇక్కడ చదువుకొనే అవకాశం లభించింది.
 • "శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఉన్నత పాఠశాల" కూడా చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల.
సర్ సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి, వట్లూరు, ఏలూరు వద్ద
 • "సర్ సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థలు" - ఏలూరు పట్టణంలోను, పరిసర ప్రాంతాలలోను ఉన్న విద్యార్థుల ఉన్నత విద్యావసరాలకు చాలాకాలంగా సర్.సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థల యాజమాన్యంలో నడుస్తున్న సంస్థలు ఉపయోగకరంగా ఉంటున్నవి. సర్ సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థలు స్వర్గీయ సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి పేరు మేద నిర్మించబడ్డాయి. 1930 దశకంలో ప్రాంభమైన ఈ కాలేజి నుండి అనేకులకు మంచి ప్రమాణాలతో ఉన్నత విద్య లభించింది. ప్రస్తుతం జాతీయ విద్యా ప్రమాణాల అంచనా మరియు ప్రామాణిక నిర్ధీకరణ మండలి (NAAC) వారిచే ఇది 'A' గ్రేడ్ విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయం సమాన హోదా (deemed university) సాధించాలనే కృషి జరుగుతున్నది. ఈ సంస్థలచే నిర్వహింపబడుతున్న విద్యాలయాలు: పబ్లిక్ స్కూలు, మోడల్ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీకాలేజి, పి.జి. కాలేజి, లా కాలేజి, బి.ఎడ్. కాలేజి. వీరి మహిళల కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి ఏలూరు పరిసర గ్రామమైన వట్లూరులో ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం]
 • "సెయింట్ థెరిసా విద్యా సంస్థలు" - సెయంట్ థెరిసా విద్యా సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుపిల్లల విద్యాభివృద్ధికి ఎంతో చేయూతనిచ్చాయి. వీటిలో బాలికల పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, పి.జి. కాలేజి ఉన్నాయి.
 • "ఆశ్రం మెడికల్ కాలేజి" - (మల్కా పురమ్ వద్ద) దీనికి దగ్గరలో ఆటో నగర్ నిర్మించ బడుతోంది.
 • "సి.ఎస్.ఐ. విద్యా సంస్థలు" - వీరి ద్వారా ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉన్నత పాఠశాల నడుపబడుతున్నాయి.
 • "దివ్య జ్ఞాన సమితి వారి విద్యా సంస్థలు" ద్వారా K.P.D.T. ఉన్నత పాఠశాల, S.P.D.B.T. జూనియర్ కాలేజి నడుపబడుత్ున్నాయి.
 • "సెయింట్ జేవియర్స్ వారి విద్యా సంస్థలు" - పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ముందుకాలం నుండి ఉన్న విద్యా సంస్థలలో ఒకటి. వీరి ద్వారా రెండు ప్రాథమిక పాఠశాలలు, రెండు ఉన్నత పాఠశాల, ఒక ఐ.టి.ఐ. నడుపబడుతున్నాయి.
 • ప్రభుత్వ జూనియర్ కాలేజి, డీగ్రీ కాలేజి.
 • ఇతర విద్యా సంస్థలు - సెయింట్ జాన్స్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్, వేగేస్న సూర్యనారాయణరాజు కంప్యూటర్ విద్య అకాడమీ (పాలగూడెం) .
 • శ్రీ శ్రీ విద్యా సంస్థలు
 • రాష్ట్రమంతటిలాగానే ఇటీవల ప్రైవేటు విద్యా సంస్థలు బహుళంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా ఇంటర్మీడియట్ స్థాయి బోధన వీటిలో జరుగుతున్నది. చైతన్య, సిద్ధార్ధ, నారాయణ, హేలాపురి, శ్రీశ్రీ - ఇవి కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు. అలాగే ప్రైవేటు రంగంలో కంప్యూటర్ విద్యనందించే సంస్థలు కూడా చాలా ఉన్నాయి.

వైద్య సదుపాయాలు[ఉల్లేఖన అవసరం][మార్చు]

 • ప్రభుత్వ ఆసుపత్రి - జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (పెద్దాసుపత్రి) 350 పడకలతో అన్ని సదుపాయాలతో సమీప ప్రాంతాల వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నది.
 • ఆశ్రం వైద్య కళాశాల ఆసుపత్రి - మెడికల్ కాలీజికి అనుబంధంగా ఉంది. 780 పడకలతో ముఖ్యమైన అన్ని సదుపాయాలతో నిర్మింపబడింది. ఈ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పధకము ఉంది. ఈ ఆసుపత్రిలో ప్రభుత్వోద్యోగులకు మెడికల్ రీఎంబర్స్ మెంట్ సదుపాయం కూడా ఉంది. ఈ ఆసుపత్రిలో నిపుణులయిన వైద్యులచే అత్యంత ఆదునిక పరికరాలతో వైద్యం అందించబదుతుంది.
 • డీ పాల్ దంత వైద్య శాల/ దంత వైద్య కలాశాల - ఇది దుగ్గిరాల సమీపంలో వుంది, ఇది రాష్ట్రం లోనే పెద్ద దంత వైద్య కలాశాల.
 • పెదవేగి చర్మ వైద్య శాల - ఇక్కడ అన్ని రకాల చర్మ వ్యాధులు నివారించ బడతాయి, కుష్టు వ్యాధికి మందు కూడా ఉచితముగా ఇస్తారు.
 • ప్రైవేట్ హాస్పిటళ్ళు - అన్ని రంగాలలోనూ వైద్య సదుపాయాలు కలిగించే ప్రైవేటు హాస్పిటళ్ళు, డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఎక్కువ హాస్పిటళ్ళు రామచంద్రరావు పేట, రమా మహల్ సెంటర్ ప్రాంతంలో ఉన్నాయి. ఇటీవల కొన్ని హాస్పిటళ్ళు సదుపాయాలను విస్తృతపరచి కార్పొరేట్ మెడిసిన్ స్థాయికి ఎగబ్రాకుతున్నాయి.

ఆర్ ఆర్ పేట[మార్చు]

ఇది నగరంలో వైద్యానికి ఒక కేంద్ర బిందువు, ఇక్కడ అన్ని రకాల ఆసుపత్రులు ఉన్నాయి.

వ్యాపారం, పరిశ్రమలు[ఉల్లేఖన అవసరం][మార్చు]

ఆర్.ఆర్ పేటలోని సెంట్రల్ ప్లాజ

పారిశ్రామికంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించలేదనే అనవచ్చును. ఎంతో కాలంగా నడుస్తున్న జూట్ మిల్లు తప్పించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ఏలూరు నుండి ప్రసిద్ధమైన బ్రాండ్ ఉత్పత్తి. పారిశ్రామిక వాడలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు ఇంకా కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాయిలోనే ఉన్నాయి. కనుక ఏలూరులో వ్యాపారం అధికంగా రెండు రంగాలలో కేంద్రీకృతమయ్యింది - (1) చుట్టుప్రక్కల లభించే వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం - ధాన్యం, కూరగాయలు, పుగాకు, చేపలు, వంట నూనెలు వంటివి (2) పట్టణంలోను, చుట్టుప్రక్కల గ్రామాలలోను ఉన్న ప్రజల వినియోగవసరాలు తీర్చే వ్యాపారాలు - పచారి సరుకులు, బట్టలు, నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, గృహనిర్మాణావసరాలు, ఆభరణాలు, ఆర్థిక సేవలు (బ్యాంకులు, తాకట్టు వ్యాపారం, ఫైనాన్సింగ్) వంటివి. ఇటీవల విద్య, వైద్య సదుపాయాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, పెట్రోలు వంటివి కూడా ఈ వ్యాపారాలలో చేరాయని చెప్పవచ్చును.

 • చేపలు, రొయ్యలు ప్రధానంగ ఎగుమతి అవుతున్నాయి, దీనికి కారణం కొల్లేరు మరియు దాని చుట్టుతా ఉన్న చేపల చెరువులు, రొయ్యల చెరువులు. కొల్లేరువైశాల్యం రోజు, రోజుకి తరిగి పోతూ వస్తోంది, రాజకీయ నాయకులు దీన్ని ప్రధానంగ ఆక్రమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
 • పత్తేబాదలో వస్త్రాలు నేస్తారు, ముఖ్యంగా చీరలు నేస్తారు.
 • ఏలూరు తివాచీ, చేనేత పరిశ్రమలు - ఏలూరులో తివాచీలు అధికంగా మహమ్మదీయులచే నేయబడుతున్నాయి. ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్నాయి.
 • తెలుగుకళ్యాణం.కాం కూడా ఏలూరులోనున్న సంస్థ.
 • శ్రీకృష్ణ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏలూరు.
 • అంబికా గ్రూప్ - 60 యేళ్ళపైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే "అంబికా దర్బార్ బత్తి", మరి కొన్ని అగర్‌బత్తిలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధిపతులు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్ళు వంటి మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. సుమారుగా 5000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
 • పూర్ణిమా కెమికల్ ఇండస్ట్రీస్ . ఈ సంస్థ ద్వారా ఉపాధి లభిస్తున్నది.
 • జూట్ మిల్లు - ఈస్టిండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్ద పరిశ్రమ. సుమారు 5000 మంది కార్మికులు ఉపాధి కలిగిస్తుంది. గోనె సంచులు, మరియు ఇతర జనప నార ఉత్పత్తులు వీరి ఉత్పాదనలు.
 • గుప్తా గ్రూప్ - ప్రధానంగా ఎగుమతి వాణిజ్యం నిర్వహిస్తున్నారు. వెంట్రుకలు, తివాచీలు, ఇతర వ్యవసాయోత్పత్తులు.
 • రైస్ మిల్స్ (వరి మర ఆడించు) పరిశ్రమలు ఉన్నాయి.
 • ఇతరాలు - మిరప పొడి, పొగాకు, జీడిమామిడి, దినుసులు, ఉల్లి, పచ్చళ్ళు, మామిడికాయలు, బియ్యం వంటి వాటికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే లేక విక్రయించే సంస్థలున్నాయి.
 • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏలూరులో భూ వ్యాపారం (రియల్ ఎస్టేట్) వృద్ధి చెందుతున్నది.
 • ఏలూరులో వ్యాపారం ప్రధానంగా పెద్దబజారులోను, సమీప ప్రాంతాల్లొనే కేంద్రీకృతమై ఉంది. రమామహల్ సెంటర్ ( అర్ అర్ పేట) రెండవ వాణిజ్య కేంద్రం అని చెప్పవచ్చును.
 • సోమవరపుపాడు వద్ద రిలయన్స్ ఉంది.
 • వట్లూరు వద్ద సూర్య మినరల్ వాటర్ ప్లాంటు ఉంది.

ఆటో నగర్[మార్చు]

ఏలూరుకి ఆటో నగర్ నిర్మించాలని ఎప్పటి నుంచొ ప్రతిపాదన ఉన్నాయి. ఈ మద్య కాలంలోనే అది రూపుదిద్దుకుంది, ప్రస్తుతానికి కొన్ని చిన్న చిన్న వర్క్ షాప్ లు ఉన్నాయి. ఇది ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఆటో నగర్, ఆశ్రం ఆసుపత్రికి వెళ్లేదారిలో పెద్ద రైల్వే స్టేషనుకి చేరువలో ఉంది.

ఆలయాలు[మార్చు]

శనివరపుపేటలోని శివాలయ గాలిగోపురం

ఏలూరు పట్టణానికి వేయి సంవ్సరాలకు పైబడి చరిత్రవుంది. అలానే ఇక్కడి ఆలయాల్లో కొన్నిటికి సహస్రాబ్దికి పైబడిన వయస్సువుంది. వెయ్యి సంవత్సరాలకు పైబడి చరిత్రవున్న ఆలయాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం, జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జనార్దన కన్యకాపరమేశ్వరీదేవి గుడి, మార్కండేయాలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి.[6]

 • జ్వలాపహరేశ్వర స్వామి వారి ఆలయం, దక్షిణపు వీధి (ఇది అత్యంత ప్రాఛీన ఆలయం)
 • శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పడమరవీధి (ప్రాచీన ఆలయం స్థాపితం : క్రీ.శ.1104) .
 • శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, రామచంద్రరావు పేట
 • పాత శివాలయం, అగ్రహారం
 • సాయిబాబా గుడి, తూర్పు వీధి (ఇది అతి ప్రాచీన సాయిబాబా గుడి)
 • సాయిబాబా గుడి, విద్యా నగర్
 • శ్రీ నం దత్త క్షేత్రం, దొండపాడు (దత్త ఆశ్రమం) .
 • శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మ వారి ఆలయం, పడమరవీధి
 • వెంకటేశ్వర దేవస్థానం, వెంకట్రావుపేట
 • హజ్రత్‌ సయ్యద్‌ బాయజీద్‌ మహాత్ముల వారి దర్గా, అగ్రహారం, కోటదిబ్బ.
 • నూకాలమ్మ గుడి, ఆదివారపు పేట.
 • శ్రీ మార్కండేయ స్వామి గుడి, దక్షిణపు వీధి
 • శ్రీ కోదండ రామాలయం (బొమ్మల గుడి) మరియు పట్టాభి రామాలయం (కణ్ణణ్ విలాస్), పడమరవీధి.
 • శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం.
 • శ్రీ అంబికాదేవి ఆలయం. 60 సం.క్రితం ఆలపాటి రామచంద్రరావు అనేభక్తుడు నిర్మించారు.
 • ఏలూరు దర్గ, కోట దిబ్బ మసీదు.
 • ఏలూరు సి.యస్.ఐ చర్చి.
 • ఏలూరు రొమన్ కాతలిక్ చర్చి, గ్జేవియర్ నగర్ (ఇది పురాతన మైనది) .
 • హోరేబు ప్రార్థనా మందిరం చర్చి (పవరు పేట) .
 • మన్నా చర్చి (శాంతి నగర్) .
 • మేరి మాత టవరు (వట్లూరు)
 • మేరి మాత టవరు, విద్యా నగర్
 • అవతార్ మెహెర్ బాబా సెంటర్, కట్టా సుబ్బారావు తోట

పరిసర ప్రాంతాలు, ఉత్సవాలు[ఉల్లేఖన అవసరం][మార్చు]

 • ఏలూరు దర్గా ఉరుసు ఉత్సవాన్ని బాగా జరుపుతారు.
 • ఏలూరులో బుద్ధ విగ్రహం, గజ్జెలవారి చెరువు చూడముచ్చటగా ఉంటాయి.
 • ఏలూరు పండగ ప్రతి 10 సంవత్సరాలకోకసారి జరుపుతారు.
 • కొల్లేరు జాతర బాగా జరుగుతుంది.
ఏలూరు పరిసరాలలో ప్రాముఖ్యత కలిగిన లేదా చూడ దగిన విశేషాలు. వివరాలకు ఆయా వ్యాసాలను చూడండి.
ఉత్సవాలు

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

వనరులు, మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Eluru Municipal Corporation Details". Eluru Municipal Corporation. Retrieved 20 August 2015.
 2. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. మూలం (PDF) నుండి 7 February 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 10 February 2016.
 3. "District Census Handbook – West Godavari" (PDF). Census of India. pp. 22–23, 54. Retrieved 18 January 2015.
 4. "ఈ మాట" అంతర్జాల పత్రికలో వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం. ఈ రచయిత వికీ సభ్యులు కూడాను.
 5. Falling Rain Genomics, Inc - Eluru
 6. 6.0 6.1 బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.
 7. "National Highways in A.P". AP Online Portal. Retrieved 4 August 2014. Cite web requires |website= (help)
 8. "Brief of Roads". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Retrieved 22 February 2016.
 9. "జిల్లాలోని బస్ స్టేషన్లు". Cite web requires |website= (help)
 10. "http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/eluru-bus-stand-in-bad-shape/article3138332.ece". 2016 మే 26. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help); External link in |title= (help)
 11. "Divisional info" (PDF). Indian Railways. Retrieved 10 February 2016. Cite web requires |website= (help)
 12. "Speed up Aquisation for Inland waterways". Cite web requires |website= (help)
 13. "Statistical Information of ULBs and UDAs" (PDF). Cite web requires |website= (help)
 14. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. మూలం (PDF) నుండి 28 January 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 29 January 2016.
 15. "Territorial Jurisdiction of Criminal Courts". Official Website of District Court of India. Retrieved 12 January 2016.

చిత్రమాలిక[మార్చు]

మూసలు, వర్గాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=ఏలూరు&oldid=2693625" నుండి వెలికితీశారు