అమలాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమలాపురం నుంచి గోదావరి నది

అమలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 533201. ఎస్.టి.డి. కోడ్ = 08856. గోదావరి నదీ జలముల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సుందర కోనసీమలో ముఖ్యమైన ప్రదేశము ఈ అమలాపురం.అమలాపురం తూర్పు గోదావరి జిల్లాకాకినాడకు 65 కి.మి దూరంలో ఉంది.

అమలాపురం పట్టణ చరిత్ర[మార్చు]

అమలాపురంలోని ప్రదేశం

అమలాపురం పూర్వనామం అమృతపురి అనీ, కాలక్రమేణా అమ్లీపురిగా, అమ్లీపురి కాలానుగతంగా అమలాపురంగా మారిందని చెప్తారు. అమలాపురంలో ఉన్న అమలేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల వల్ల ఈ ఊరు పంచలింగాపురంగా కూడా పిలవబడేది. కోనసీమలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ అమలాపురంలోని SKBR కాలేజ్. ఇది సుమారు 60 ఏళ్ళ చరిత్ర కలిగిన కాలేజ్.

పేరు వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అదేమంటే పూర్వకాలంలో` అంటే` రాజరాజనరేంద్రుడు రాజ్యం చేసే కాలంలో అమల అనే రాజనర్తకి ఈ ప్రాంతంలోనే ఉండేదట! ఆమె గురించి రాజుగారి వార్తాహరులు తరచుగా వస్తూండటం, ఆమె రక్షణ కోసం రాజభటులు ఆమె ఇంటి దగ్గర మరియు ఊళ్ళోనూ పెద్ద ఎత్తున కావలి కాస్తూండటం జరిగేది. దాంతో ఈ ప్రాంతాన్ని అమలూరు అని పిలచేవారట! కాలక్రమంలో అమలూరు అమలాపురిగా, ప్రస్తుతం అమలాపురంగా వ్యవహరిస్తున్నారు.

రాజకీయాలు[మార్చు]

అమలాపురంలోని ఏకలవ్యుడి విగ్రహం

ప్రముఖులు[మార్చు]

అమలాపురంలో పార్లమెంటు ఆకృతిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయం

సౌకర్యాలు[మార్చు]

  • కోనసీమ మెడికల్ కళాశాల
  • కోనసీమలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ అమలాపురంలోని SKBR కాలేజ్.

శ్రీ కోనసీమ భనోజీ రమర్స్ కళాశాల 1951 లో స్థాపించబడింది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో కోటిపల్లి స్టేషను ఉంది 12కి.మీ. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధానపట్టణాలైన విజయవాడ, హైదరాబాదు,విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర పట్టణాలకు బస్సు శౌకర్యం ఉంది.

వివిధ నగరాలకు దూరం: హైదరాబాదు - 493 కి.మీ విజయవాడ - 198 కి.మీ విశాఖపట్నం - 238 కి.మీ దగ్గరలోని రైల్వే స్టేషను :రాజమహేంద్రవరం 70కి.మీ, కాకినాడ55కి.మీ.పాలకొల్లు45కి.మీ

ప్రసిద్ధ దేవాలయాలు[మార్చు]

  • అమలేశ్వర స్వామి దేవాలయం,
  • వేంకటేశ్వరస్వామి దేవాలయం,
  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం,
  • చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం
  • షిర్దీ సాయి స్వర్ణమందిరం
  • అయ్యప్పస్వామి దేవాలయం

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

ఆర్థిక స్థితి[మార్చు]

అమలాపురం ప్రాంతంలో ఎండబెట్టిన కొబ్బరి చిప్పలు; అమలాపురం కేంద్రంగా నెలకొన్న కోనసీమ ప్రాంతం కొబ్బరి తోటలకు ప్రఖ్యాతి చెందింది

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,41,693 - పురుషులు 71,098 - స్త్రీలు 70,595

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అమలాపురం&oldid=2532152" నుండి వెలికితీశారు