నగరి
పట్టణం | |
Coordinates: 13°20′N 79°35′E / 13.33°N 79.58°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు జిల్లా |
మండలం | నగరి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 35.45 కి.మీ2 (13.69 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 62,253 |
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 985 |
ప్రాంతపు కోడ్ | +91 ( 91-8577 ) |
పిన్(PIN) | 517590 |
Website |
నగరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిచిత్తూరు జిల్లాలో పట్టణం, అదే మండలానికి కేంద్రం. నగరిలో కరియ మాణిక్యస్వామి దేవాలయం ఉంది. మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం ఇక్కడ జరిగిందని శ్రీ మహా విష్ణువు ఇక్కడే గజరాజుని మకరం బారి నుండి రక్షించాడనీ చెబుతారు. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా జరిగే ఉత్సవాలు కంచి గరుడ సేవ, కనుమ, రథ సప్తమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.
చరిత్ర
[మార్చు]1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. వీరాస్వామయ్య తాను విడిది చేసిన బుగ్గగుడి క్షేత్రం, పుత్తూరు పట్టణాలకు మధ్య ఈ నగరి మీదుగా ప్రయాణించారు. ఆ ప్రయాణంలో నగరి వద్దనే కొండ కనుమ దాటాలని అతను వ్రాశారు. నగరి పేట స్థలం (పట్టణం అని అర్థం) అని వర్ణించారు. ఆ పట్టణంలో 1830 నాటికే బాటసారులకు అవసరమైన అన్ని సామాన్లు కొనదొరికేవని తెలిపారు. అతను ప్రయాణం చేసే సమయంలో వెంకటేశ నాయుడి కుమారుడు గొప్ప సత్రం కట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.[2]
భౌగోళికం
[మార్చు]నగరి సమీప నగరమైన తిరుపతికి 51 కి.మి దూరంలో ఉంది
జనగణన విషయాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం నగరి పట్టణ పరిధిలో మొత్తం 14,271 కుటుంబాలు నివసిస్తున్నాయి. నగరి మొత్తం జనాభా 62,253, అందులో 31,363 మంది పురుషులు, 30,890 మంది స్త్రీలు ఉన్నారు. నగరి పట్టణ సగటు లింగ నిష్పత్తి 985. నగరి పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6842, ఇది మొత్తం జనాభాలో 11%. 0-6 సంవత్సరాల మధ్య 3571 మంది మగ పిల్లలు, 3271 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరిలో పిల్లల లింగ నిష్పత్తి 916, ఇది సగటు లింగ నిష్పత్తి (985) కంటే తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం, నగరి అక్షరాస్యత రేటు 77.8%. ఆ విధంగా చిత్తూరు జిల్లాలో 71.5% అక్షరాస్యతతో పోలిస్తే నగరి అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. నగరిలో పురుషుల అక్షరాస్యత రేటు 86.49%, స్త్రీల అక్షరాస్యత రేటు 69.15%.[3]
పరిపాలన
[మార్చు]నగరి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- కరియ మాణిక్యస్వామి దేవాలయం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ "Nagari Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-03-11.[permanent dead link]
బయటి లింకులు
[మార్చు]- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- చిత్తూరు జిల్లా మండల కేంద్రాలు
- రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
- చిత్తూరు జిల్లా పట్టణాలు
- Pages using the Kartographer extension