బంగారుపాలెం
బంగారుపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 13°11′46″N 78°54′48″E / 13.19611°N 78.91333°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | బంగారుపాలెం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
బంగారుపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. బంగారుపాళ్యం జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో మద్రాసు - బెంగుళూరు, జాతీయ రహదారి 4 పై ఉంది. బంగారుపాలెం మామిడి పళ్లకు ప్రసిద్ధి. చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది రైతులు మామిడి తోటలను నిర్వహిస్తున్నారు.
మామిడి గుజ్జును తయారుచేసి, ఎగుమతి చేసే అనేక చిన్న పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. వాటితో పాటు గోమతి స్పిన్నర్స్ అనే దారాలు ఉత్పత్తి చేసే కర్మాగారం స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది. మండలంలోని మొగిలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన పురాతన మొగిలీశ్వరాలయం ఉంది. ప్రస్తుతం బంగారుపాలెం పట్టణంలో ఐదు ప్రైవేటు పాఠశాలలు, ఒక ప్రభుత్వోన్నత పాఠశాల ఉన్నాయి.
బంగారుపాలెం స్వాతంత్ర్యానికి పూర్వం జమిందారీ జాగీరు. శతాబ్దాలుగా జమీందారీ పాలనలో ఉంది. ఈ జమీందారులు మొగిలీశ్వరాలయంతో పాటు అనేక ఆలయాలను కట్టించి, నిర్వహించారు. ఇప్పటికీ ఈ జమీందారు కుటుంబీకులే వంశపారంపర్యంగా ఆలయధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.[1] బంగారుపాలెం జమీందారు ముద్దు బంగారు శేషాచలపతి నాయుడు 1895లో చిత్తూరులో ఒక ఉన్నత పాఠశాలను ప్రారంభించాడు.
బంగారుపాలెం జమిందారీ 1911కు పూర్వం ఉత్తర ఆర్కాటు జిల్లాలో భాగంగా ఉంది. 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడినప్పుడు, అందులో భాగమైంది. 1960లో చిత్తూరు తాలూకాలో ఉన్న 145 గ్రామాలతో బంగారుపాలెం ఫిర్కాను ఏర్పరచారు.[2] ఆ తర్వాత 1985లో మండలాలేర్పడినప్పుడు బంగారుపాలెం ఫిర్కా, బంగారుపాలెం మండలంగా మారింది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-07. Retrieved 2010-09-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-13. Retrieved 2010-09-16.