కుప్పం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుప్పం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]. పిన్ కోడ్: 517425.

గ్రామ స్వరూపం, జనాభా[మార్చు]

కుప్పం ప్రాంత రాష్ట్రంలో రాయలసీమలో ఉంది. పశ్చిమాన, ఉత్తరాన కర్ణాటక రాష్ట్రపు కోలార్ జిల్లా, దక్షిణాన తమిళనాడుకు చెందిన కృష్ణగిరి జిల్లా ఉన్నాయి. "కుప్పం" అంటే కలసే స్థలం.[2] ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు - మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ఉన్నందున కుప్పంలో వివిధ సంస్కృతుల, భాషల ప్రభావం కనిపిస్తుంది.

కుప్పం గ్రామం 12′ 45″ ఉత్తరం, 78′ 20″ తూర్పు అక్షాంశరేఖాంశాలవద్ద ఉంది. సమీపంలోని మొత్తం 5 మండలాలలో జనాభా సుమారు 612 జనావాసాలు, 62,400 ఇళ్ళు, 3 లక్షల మంది జనాభా ఉన్నారు.

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో పాలారు నది ప్రవహిస్తున్నది. ఇక్కడి సగటు వర్షపాతం 840 మి.మీ. మొత్తం నియోజక వర్గంలో 63,000 హెక్టేరులు సాగుభూమి (50.4%), 41,987 హెక్టేరులు అడవి భూమి (33.7%) ఉంది.

పరిశ్రమలు[మార్చు]

కుప్పం పరిసర ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలు ఎక్కవగా ఉన్నాయి. ఒక విధమైన గ్రానైట్‌ను "కుప్పం గ్రీన్" అని వ్యవహరిస్తారు. ఇక్కడినుండి మొదటి నల్ల గ్రానైట్ రాయి 1925లో యు.కె.కు ఒక సమాధిరాయి నిమిత్తం 1925లో ఎగుమతి అయ్యింది.[2]

ప్రార్ధనా స్థలాలు[మార్చు]

 • లక్ష్మీపురం ఆలయం
 • కనమనెపల్లి ఆలయం
 • గుడివంక
 • బేతరాయస్వామి ఆలయం
 • వేణుగోపాలస్వామి ఆలయం
 • కంగుంది కోట శివాలయం
 • గుండసాగర్ అగ్నిమారెమ్మ ఆలయం
 • దండికుప్పం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం
 • కనమలదొడ్డి శ్రీ ఆనందూర్ మరియామ్మన్ ఆలయం

సౌకర్యాలు[మార్చు]

రవాణా

కుప్పం నియోజక వర్గం మూడు రాష్రాల కూడలి, అనగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులు ఇచ్ఛట కలుస్తాయి. ఇక్కడినుండి బెంగళూరుకు 105 కి.మీ., చెన్నైకు 250 కి.మీ.

విద్య

నియోజక వర్గంలో 455 పాఠశాలలు, 1 విశ్వవిద్ద్యలయం (ద్రావిడ విశ్వవిద్ద్యలయం, Dravidian University), 1 ఇంజినీరింగ్ కాలేజి, ఒక మెడికల్ కాలేజి, 1 పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. అక్షరాస్యత 61% ఉంది.

చాలా కాలంగా వెనకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గం గత పది సంవత్సరాలలో దాదాపుగా అన్ని గ్రామాలలో పాఠశాలలు నెలకొల్పబడి అబివృధి ఛెందుతొంది. ఈ నియోజకవర్గంలో చెవిటి, మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ వారి ఆధ్వర్యంలో నడపబడుచూ, నియోజకవర్గం లోని వికలాంగుల సంక్షేమంలో పాలుపంచుకుంటున్నది.

వైద్యం

నియోజక వర్గంలో 50 ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇక్కడి కొన్ని ఆసుపత్రులు

 • PESIMR హాస్పిటల్
 • ప్రభుత్వ హాస్పిటల్
 • ఎమ్మాస్ స్విస్ లెప్రసీ కన్ను హాస్పిటల్
 • పైల్స్ క్లినిక్

^ govt urben health care in PES (it is opend by sree chandra babu naidu in 19 august 2012 ) ^ govt hospatil gudupalli

సినిమా హాళ్ళు
 • లక్ష్మీ
 • మహా లక్ష్మీ
 • శ్రీ రామచంద్రా మహల్
 • మురుగన్
 • శివ శక్తి
 • శ్రీ వెంకటేశ్వర
హోటళ్ళు
 • పున్నమి - రావ్ట్ర పర్యాటకం సంస్థ వారిది
 • హోటల్ లక్ష్మీనారాయణ రెస్టారెంట్
 • హోటల్ రామవిలాస్ (ఇప్పుడు మూసేశారు)
 • ఎస్.వి.ధాబా (హైవే మీద)
 • హోటల్ దక్షిణి - బైపాస్ రోడ్ పైన

^hotal kanda swamy old pet

సేవా సంస్థలు[మార్చు]

కుప్పంలోను, పరిసర ప్రాంతాలలోను పలు స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి.[3]

 • విక్టరి ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ (Victory India Charitable Tent of Rescue Yacht, ),
  శెట్టిపల్లె, కుప్పం రోడ్డు, గుడుపల్లె మండలం
  విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్
 • జన అభ్యుదయ సేవా సమితి - JASS - పైపాల్యం, వసనాడు
 • ధన్ ఫౌండేషన్, బైపాస్ రోడ్
 • మార్గదర్శి - జయప్రకాశ్ రోడ్
 • రూట్స్ - లక్ష్మీటాకీస్ రోడ్
 • కోర్ (Collective Order for Reconstruction Education) - ఓం శక్తి లేఅవుట్
 • పిపిఇడెస్ - Poor People Education and Development Society - రాజీవ్ నగర్ కాలనీ

చూడదగిన స్థలాలు[మార్చు]

సమీపంలో చూడదగినవి

 • కైగల్ (బైరెడ్డిపల్లి మండలం)
 • బొగ్గులరేవు - అడివిబుడుగూరు వద్ద
 • కన్గుండి - నాయనూర్ రోడ్ - నెమళ్ళు కనిపిస్తాయి.
 • కరిది దొన్న - నానియల్ వద్ద - ఏనుగులు కనిపిస్తాయి
 • బైర్నెగుట్ట - ఎస్.గొల్లపల్లి వద్ద - ఏనుగులు కనిపిస్తాయి
 • జోకువంక - నాయికనేరి వద్ద - ఏనుగులు కనిపిస్తాయి
 • అబ్బనకుంట - అర్మానిపేట వద్ద - ఏనుగులు కనిపిస్తాయి
 • ద్వీపాల కనుమ - పెద్దూరు వద్ద - ఏనుగులు కనిపిస్తాయి

^palaru River in Santi puram ^agastya in gudupalli (it is a scientific lab) ^

చరిత్ర[మార్చు]

సా.శ. 1066 నుండి కుప్పం చరిత్రకు సంబంధించిన కొన్ని వివరాలు లభిస్తున్నాయి. "Feudal history of Kuppam (AD. 1066 to 1947)" అనే పుస్తకాన్ని సాధు సుబ్రహ్మణ్యం అనే రచయిత ఎస్.వేణుగోపాలన్ సహకారంతో రచించాడు. ఇది Indian Rural Reconstruction Movement (IRMM), బెంగళూరు వారిచే ప్రచురించబడింది.[3]

కుప్పం చరిత్ర అధ్యయనకారులకు ఆసక్తి కలిగించే విషయాలు

 • బేతరాయస్వామి ఆలయం, అంగనమల
 • కృష్ణగిరి, బేతమంగళం, తాయిలూరు
 • చిన్నకంగుడి (హైదర్ అలీ జన్మస్థలం - బుధికోట)
 • కనమనపల్లె (శ్రీనివాసపురం) మందిరం
 • కుప్పం పన్నగశయన ప్రాసాదం, సిల్వర్ జుబిలీ పార్కు
 • లక్ష్మీపురం మందిరం
 • తుమిసి కోట
 • కృష్ణస్వామి, విరూపాక్ష ఆలయాలు
 • కంగుంది కోట
 • రంగమ్మ బావి, ఫిరంగి
 • పాలెగాండ్ర శ్మశానవాటికలు
 • భట్టువారిపల్లె సిల్వర్ జూబిలీ అసోసియేషన్
 • జమీందారుల వంశ చరిత్ర - 1912 (1943లో వెలువడిన స్మారక సంచిక)
 • శ్రీవేణుగోపాల స్వామి శతకం (1980)

ఇతర విశేషాలు[మార్చు]

Diana Bell releasing the Telugu book on Kuppam HP i-community

గ్రామీణ ప్రాంతాలవారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఉపయోగపడాలనే లక్ష్యంతో "హ్యూలెట్ ప్యాకర్డ్" (HP) సంస్థవారు ఇక్కడ i-community initiative ఆరంభించారు. 2002 ఫిబ్రవరిలో మొదలైన ఈ ప్రయోగాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే మొదటిది. తరువాత మూడు సంవత్సరాలలో ఇక్కడి 3 లక్షలమంది సామాన్య జనులకు సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడం వలన సామాజిక, ఆర్థిక ప్రగతికి అది సాధనమయ్యింది.[2] ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఆయారంగాలలోని నిపుణులు తమ సహకారాన్ని అందించారు.

కుప్పం నియోజకవర్గం[మార్చు]

కుప్పం నియోజకవర్గంలోని మండలాలు

1999 ఎన్నికలలో ఈ నియోజక వర్గంలో 1,61,872 మంది రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఈ నియోజక వర్గం నుండి ఎన్నికైన శాసన సభ్యులు: [4]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-08-20.
 2. 2.0 2.1 2.2 కుప్పం ఐ-కమ్యూనిటీ
 3. 3.0 3.1 "కుప్పం వికీలోని సమాచారం". Archived from the original on 3 నవంబర్ 2009. Retrieved 26 జూన్ 2008. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
 4. "Election Commission of India.APAssembly results.1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-06-26.
"https://te.wikipedia.org/w/index.php?title=కుప్పం&oldid=3496361" నుండి వెలికితీశారు