కుప్పం శాసనసభ నియోజకవర్గం
కుప్పం | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు | నారా చంద్రబాబు నాయుడు |
కుప్పం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉంది.
చరిత్ర
[మార్చు]తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు కలిగిన కుప్పం నియోజకవర్గం మూడు సార్లు ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ నియోజకవర్గానికి ఉన్న మరో ప్రత్యేకత రాష్ట్రంలోనే చిట్టచివరి శాసనసభ నియోజకవర్గపు సంఖ్యను కలిగి ఉండటం. 294 నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రంలో ఈ నియోజకవర్గపు సంఖ్య 294. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ శాసనసభ నియోజకవర్గం మరో 6 శాసనసభ నియోజకవర్గాలతో పాటు చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,61,872 మంది నమోదుచేసుకున్న ఓటర్లు ఉన్నారు. 2004 నాటికి ఈ సంఖ్య 1,85,813 కు పెరిగింది.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గపు జనాభా
[మార్చు]2001 జనాభా లెక్కల ప్రకారము కుప్పం నియోజకవర్గం జనాభా 3,18,172. ఇందులో మహిళలు 1,60,824 కాగా పురుషులు 1,57,348.
- మండలాల వారీగా జనాభా
క్రమ సంఖ్య మండలపు పేరు మొత్తం జనాభా మహిళలు పురుషులు ఓటర్ల సంఖ్య [1] 1 కుప్పం 102947 52209 50738 75902 2 శాంతిపురం 50952 25604 25348 36354 3 గుడిపల్లె 38480 19207 19273 26283 4 రామకుప్పం 50874 26035 24839 35702 5 వెంకటగిరి కోట 74919 37769 37150 మొత్తము 3,18,172 1,60,824 1,57,348
కుప్పం నియోజకవర్గం చరిత్ర
[మార్చు]కుప్పం జియోజకవర్గం 1955లో ఏర్పడింది.[1] ఆ ఎన్నికలలో డి.రామబ్రహ్మం విజయం సాధించాడు. ఆ తరువాత 1962లో సి.పి.ఐకు చెందిన వజ్రవేలు శెట్టి గెలుపొందగా, 1967, 1972లలో వరసగా రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థి డి.వెంకటేశం గెలిచాడు. 1978లో మళ్ళీ కాంగ్రెస్ గెలుపొందింది. తెలుగుదేశం ఆవిర్బావం అనంతరం ఆ పార్టీయే విజయం సాధిస్తోంది. 1983, 85లలో రంగస్వామి నాయుడు గెలువగా, 1989 నుండి నారా చంద్రబాబు నాయుడు విజం సాధిస్తున్నాడు.
వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు
[మార్చు]1955లో ఏర్పడిన కుప్పం శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) పార్టీలు కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచాయి.[2] గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడైన డి.రామబ్రహ్మం కుప్పం తొలి శాసనసభా సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సి.పి.ఎంకు చెందిన వజ్రవేలు చెట్టి ఎన్నికయ్యాడు. 1967 ఎన్నికలలో కుప్పం ప్రజలు రాజకీయాలలోకి కొత్తగా ప్రవేశించిన ఒక స్వతంత్ర అభ్యర్థి అయిన డి.వెంకటేశాన్ని గెలిపించారు. రాజకీయ అతిరథులైన డి.రామబ్రహ్మం, వజ్రవేలు చెట్టి వంటి వారిని ఓడించి ఈయన సాధించిన అనూహ్య విజయం అందరినీ ఆశ్చర్యపరచింది. డి.వెంకటేశం 1972లో తిరిగి కుప్పం నుండి రెండవ పర్యాయము శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తరువాత ఎన్నికలలో దేశమంతటా జనతా పార్టీ ప్రభంజనం వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇందిరాగాంధీ పక్షాన నిలచింది. కుప్పం కూడా అందుకు అతీతం కాక ఇందిరా కాంగ్రేసుకు చెందిన బి.ఆర్.దొరస్వామి నాయున్ని శాసనసభకు ఎన్నుకున్నది. అయితే 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో కుప్పంలో కాంగ్రేసు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదాక ఈ నియోజకవర్గము నుండి సి.పి.ఐ, స్వతంత్ర అభ్యర్థులు మూడు పర్యాయాలు గెలుపొందారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ నియోజకవర్గంలో రాజకీయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ బలమైన రాజకీయ పక్షంగా అవతరించింది. 1985 తరువాత జరిగిన ఎన్నికలలో 75% ఓట్లతో సత్తాచాటింది. దీనితో 1983 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబునాయుడి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. 1989 నుంచి చంద్రబాబు వరుసగా ఘనవిజయం సాధిస్తున్నాడు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిపి దాదాపు 95% ఓట్లు రాబట్టడం చూస్తే ఈ నియోజకవర్గంలో మూడవ పార్టీ ఉనికి అస్సలు లేదనిచెప్పవచ్చు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన అభ్యర్థి ఉండుటకూడా మూడవ పార్టీకి అవకాశం లభించుటలేదు.
ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసన సభ్యులు
[మార్చు]సంవత్సరం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు చెల్లిన ఓట్లు ఎన్నికైన అభ్యర్థి పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్లు 1955 62,467 25,757 డి.రామబ్రహ్మం కాంగ్రెస్ పార్టీ 14,212 ఎ.పి.వజ్రవేలు చెట్టి సి.పి.ఐ 11,545 1962 69,732 40,045 37,988 ఎ.పి.వజ్రవేలు చెట్టి సి.పి.ఐ 22,534 ఆర్.నాయుడు కాంగ్రెస్ పార్టీ 13,866 1967 69,361 42,189 38,707 డి.వెంకటేశం స్వతంత్ర అభ్యర్థి 13,542 డి.రామబ్రహ్మం కాంగ్రెస్ పార్టీ 12,945 1972 84,436 48,796 47,001 డి.వెంకటేశం స్వతంత్ర అభ్యర్థి 25,915 వి.రామస్వామి కాంగ్రెస్ పార్టీ 16,916 1978 93,102 61,713 59,596 బి.ఆర్.దొరస్వామి నాయుడు [3] కాంగ్రెస్ (ఐ) 24,664 డి.వెంకటాచలం జనతా పార్టీ 14,222 1983 98,715 65,821 64,212 ఎన్.రంగస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ 38,543 బి.ఆర్.దొరస్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ 24,550 1985 1,10,080 62,726 61,385 ఎన్.రంగస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ 46,548 ఎస్.కృష్ణ కాంగ్రెస్ పార్టీ 9,584 1989 1,33,954 99,605 95,157 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 50,098 బి.ఆర్.దొరస్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ 43,180 1994 1,44,513 1,10,309 1,07,582 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 81,210 ఆర్.గోపీనాథ్ కాంగ్రెస్ పార్టీ 24,622 1999 1,61,905 1,29,512 1,25,390 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 93,288 ఎం.సుబ్రమణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ 27,601 2004 1,85,813 1,40,297 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 98,123 ఎం.సుబ్రమణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ 38,538 2009 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 89920 ఎం.సుబ్రమణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ 43855 2014 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 102952 కె.చంద్రమౌళి YSRCP 55831
1999 ఎన్నికలు
[మార్చు]1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరుసగా మూడవ సారి ఘనవిజయం సాధించాడు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎం.సుబ్రమణ్యం రెడ్డిపై 65,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చంద్రబాబు నాయుడుకు 93,288 ఓట్లు రాగా, సుబ్రమణ్యం రెడ్డికి 27,601 ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న మూడవ అభ్యర్థి అన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాజీ శాసనసభ్యుడు బి.ఆర్.దొరస్వామి నాయుడు కేవలం 4,468ోట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయాడు.
- 1999 ఎన్నికల గణాంకాలు [4]
- మొత్తం ఓటర్లు : 1,61,872.
- పోలైన ఓట్లు : 1,29,479.
- చెల్లిన ఓట్లు : 1,25,357.
- పోలింగ్ శాతం : 79.9%.
- పోటీలో ఉన్నఅభ్యర్థుల సంఖ్య : 3.
2004 ఎన్నికలు
[మార్చు]2004 శాసనసభ ఎన్నికలలో కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్ర బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సమీప ప్రత్యర్థి ఎం. సుబ్రమణ్యం రెడ్డిని 59588 ఓట్ల తేడాతో ఓడించాడు.[5] చంద్రబాబు నాయుడుకి 98123 ఓట్లు రాగా, సుబ్రమణ్యం రెడ్డికి 38535 ఓట్లు లభించాయి. త్రిముఖ పోటీ జరిగిన ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన మరో అభ్యర్థి నాగన్న. ఇండిపెండెంట్ గా పోటీచేసిన ఇతడు డిపాజిట్ కోల్పోయాడు.
- 2004 ఎన్నికల గణాంకాలు [6]
- మొత్తం ఓటర్లు : 1,85,813.
- చెల్లిన ఓట్లు : 1,40,297.
- పోలింగ్ శాతం : 75.5%.
- పోటీలో ఉన్నఅభ్యర్థుల సంఖ్య : 3.
- పోలింగ్ కేంద్రంల సంఖ్య : 187.
2009 ఎన్నికలు
[మార్చు]2009 శాసనసభ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మళ్ళీ పోటీచేసి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, శాంతిపురం జడ్పీటీసి సభ్యుడు అయిన సుబ్రహ్మణ్యం రెడ్డిపై 46వేలకు పైగా మెజారిటీతో నెగ్గి[7] ఈ నియోజకవర్గంలో 5వ వరస విజయం నమోదుచేశాడు. చంద్రబాబు సమీప ప్రత్యర్థి సుబ్రహ్మణ్యం కావడం ఇది వరసగా మూడవసారి కావడం విశేషం.
నియోజకవర్గ ప్రముఖులు
[మార్చు]- 1999 , 2004 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసిన నియోజకవర్గపు ప్రముఖ కాంగ్రెస్ నేత సుబ్రమణ్యం సర్పంచు పదవి నుంచి పైకి ఎదిగిన నాయకుడు. గత రెండు ఎన్నికలలో చంద్రబాబు నాయుడుపై పోటీచేసి ఓడిపోయిననూ దాదాపు 25% ఓట్లు సాధించాడు. 2006 జూలైలో జరిగిన జిల్లాపరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గపు(ZPTC) ఎన్నికలలో శాంతిపురం నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు.[8]
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఈనాడు దినపత్రిక పాంచజన్య (ఎన్నికల ప్రత్యేక పేజీలు) తేది 19-03-2009
- ↑ తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్, పేజీ.145
- ↑ (ఆంగ్లము) భారతీయ ఎలక్షన్ కమిషన్, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.1978-2004 Archived 2007-09-30 at the Wayback Machine
- ↑ http://archive.eci.gov.in/se99/pollupd/ac/states/S01/Aconst142.htm[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-04. Retrieved 2008-07-09.
- ↑ http://archive.eci.gov.in/March2004/pollupd/ac/states/s01/aconst142.htm[permanent dead link]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-04-28. Retrieved 2008-07-09.