తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడేపల్లిగూడెం
—  శాసనసభ నియోజకవర్గం  —
Tadepalligudem assembly constituency.svg
తాడేపల్లిగూడెం is located in Andhra Pradesh
తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా లో గలదు. ఇది నరసాపురం లోకసభ నియోజకవర్గంలో భాగం.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 181 తాడేపల్లిగూడెం జనరల్ కొట్టు సత్యనారాయణ పు వైఎస్సార్సీపీ 70741 ఈలి వెంకట మధుసూధనరావు (ఈలి నాని) M టీడీపీ 54275
2014 181 Tadepalligudem GEN పైడికొండల మాణిక్యాలరావు M BJP 73339 టీపీ గోపాల సత్యనారాయణ M YSRC 59266
2009 181 Tadepalligudem GEN ఈలి వెంకట మధుసూధనరావు (ఈలి నాని) M PRAP 48747 కొట్టు సత్యనారాయణ M INC 45727
2004 67 Tadepalligudem GEN కొట్టు సత్యనారాయణ M INC 72477 Kanaka Sundara Rao Pasala M తె.దే.పా 47544
1999 67 Tadepalligudem GEN Yarra Narayanaswamy M తె.దే.పా 60666 కొట్టు సత్యనారాయణ M INC 50175
1994 67 Tadepalligudem GEN Kanaka Sundararao Pasala M తె.దే.పా 57994 Satyanarayana Kottu M INC 50061
1989 67 Tadepalligudem GEN Kanaka Sundara Rao Pasala M తె.దే.పా 54938 Eli Varalaxmi F INC 53342
1987 By Polls Tadepalligudem GEN E.Varalakshmi (W) M INC 42062 K.S.R.Pasala (Bojji) M తె.దే.పా 42031
1985 67 Tadepalligudem GEN Yerra Narayana Swamy (Benarji) యర్రా నారాయణస్వామి M తె.దే.పా 49900 Eli Veralakshmi F IND 29025
1983 67 Tadepalligudem GEN ఈలి ఆంజనేయులు M IND 61310 Mylavarapu Rajabhaskararao M INC 18616
1978 67 Tadepalligudem GEN Chintalapati Seeta Rama Chandra Vara Prasada Murty Raju M INC (I) 39128 ఈలి ఆంజనేయులు M INC 31455
1972 67 Tadepalligudem GEN ఈలి ఆంజనేయులు M IND 36604 Kosuri Kanakalakshmi M INC 32404
1967 67 Tadepalligudem GEN A. Krishnarao M INC 24129 Y. Anjaneyulu M IND 20529
1962 74 Tadepalligudem GEN Alliuri Krishna Row M INC 16847 Gada Raghunayakulu M IND 14712
1955 57 Tadepalligudem GEN Namburi Srinivasarao M INC 43157 Srimat Kilambi Venkata Krishnavataram M INC 40412

1955 ఎన్నికలు[మార్చు]

1955లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నంబూరి శ్రీనివాసరావు తన సమీప అభ్యర్థి శ్రీమత్‌ కిళాంబి వెంకట కృష్ణావతారంపై 2745 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నంబూరి శ్రీనివాసరావు 43157 ఓట్లు సాధించగా వెంకటకృష్ణావతారం 40412 ఓట్లు పొందారు.

1962 ఎన్నికలు[మార్చు]

1962 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గాదె రఘునాయకులుపై 2135 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అల్లూరి కృష్ణారావు 16,847 ఓట్లు, గాదె రఘునాయకులు 14712 ఓట్లు పొందారు.

1967 ఎన్నికలు[మార్చు]

1967లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఈలి ఆంజనేయులుపై 3600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కృష్ణారావుకు 24129 ఓట్లు, ఈలి ఆంజనేయులుకు 20529 ఓట్లు నమోదయ్యాయి.

1972 ఎన్నికల్లో[మార్చు]

1972లో నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఈలి ఆంజనేయులు తన సమీప ప్రత్యర్థి అభ్యర్థిని కోసూరి కనకలక్ష్మిపై 4200 ఓట్ల మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఎన్నికలో ఈలి ఆంజనేయులు 36604 ఓట్లు, కోసూరి కనకలక్ష్మి 32404 ఓట్లు సాధించారు.

1978 ఎన్నికలు[మార్చు]

1978 ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థిగా పోటీచేసిన చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు తన సమీప ప్రత్యర్థియైన కాంగ్రెస్ అభ్యర్థి ఈలి ఆంజనేయులు 7673 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు (కాంగ్రెస్ (ఐ) కు 39,128 ఓట్లు, ఈలి ఆంజనేయులు (కాంగ్రెస్) కు 31455 ఓట్లు నమోదయ్యాయి.

1983 ఎన్నికలు[మార్చు]

1985 ఎన్నికలు[మార్చు]

1985 శాసనసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి యర్రా నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ఈలి వరలక్ష్మిపై 20వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

1987 ఉప ఎన్నికలు[మార్చు]

1987లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీచేసిన ఈలి వరలక్ష్మి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పసల కనకసుందరరావుపై 31 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1985లో గెలుపొంది శాసనసభ్యునిగా కొనసాగుతూ ఉన్న యర్రా నారాయణస్వామి (తెదేపా) 1987లో తన పదవికి రాజీనామా చేసి జిల్లాపరిషత్ ఎన్నికల్లో పోటీచేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించిన ఎన్నికలో నారాయణస్వామి గెలుపొంది జిల్లాపరిషత్ అధ్యక్ష పదవి చేపట్టారు. సాధారణంగా జిల్లాపరిషత్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో జిల్లా చైర్మన్‌ని ఎన్నుకుంటారు. ప్రత్యక్ష పద్ధతిలో పశ్చిమగోదావరిజిల్లాకు ఎన్నికైన ఏకైక జిల్లా పరిషత్ చైర్మన్‌గా యర్రా నారాయణస్వామి నిలిచారు.

1989 ఎన్నికలు[మార్చు]

1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పసల కనకసుందరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈలి వరలక్ష్మిపై గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

1994 ఎన్నికలు[మార్చు]

1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన పసల కనకసుందరరావు తన సమీప ప్రత్యర్థి ఐన కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొందారు.

1999 ఎన్నికలు[మార్చు]

1999 శాసనసభ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి యర్రా నారాయణస్వామి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొంది ఎన్నికయ్యారు. యర్రా నారాయణస్వామి ఈ విజయంతో రెండవసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనక సుందరరావుపై 24933 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. సత్యనారాయణకు 72477 ఓట్లు లభించగా, సుందరరావు 47544 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన యీలి వెంకట మధుసూదనరావు (నాని) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముళ్ళపూడి బాపిరాజు, భారతీయ జనతా పార్టీ తరఫున కైరం అప్పారావు, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా కె.ఎస్.రామచంద్రారావు పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థి యీలి వెంకట మధుసూదనరావు (నాని) తన ప్రత్యర్థి కె.సత్యనారాయణ పై విజయం సాధించారు.

మూలాలు[మార్చు]

  1. .in, elections. "TADEPALLIGUDEM ASSEMBLY CONSTITUENCY, ANDHRA PRADESH". Compare Infobase Limited. Archived from the original on 2014-04-16. Retrieved 2014-04-15.
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009