కొట్టు సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొట్టు సత్యనారాయణ

ఉప ముఖ్యమంత్రి
దేవాదాయ శాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు పైడికొండల మాణిక్యాలరావు
నియోజకవర్గం తాడేపల్లిగూడెం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి సౌధాని కుమారి
నివాసం తాడేపల్లిగూడెం

కొట్టు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితుడై, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కొట్టు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో 1955లో జన్మించాడు. ఆయన పెంటపాడు లోని డి. ఆర్. జి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కొట్టు సత్యనారాయణ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పసల కనకసుందరం రావు పై 24933 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన పీసీసీ సభ్యునిగా, మెంబర్‌ ఆఫ్‌ ఎస్యూరెన్స్‌ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్‌ ఆఫ్‌ హౌస్‌ కమిటీ ఇరిగ్యులారిటీస్‌ ఆఫ్‌ మిల్క్‌డైరీస్‌ సభ్యునిగా పని చేశాడు. సత్యనారాయణ 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[3] కొట్టు సత్యనారాయణ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఈలి వెంకట మధుసూధనరావు (ఈలి నాని) పై 16466 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయన 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "Tadepalligudem Constituency Winner List in AP Elections 2019". www.sakshi.com. Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  2. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  3. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  4. Sakshi (2019). "తాడేపల్లిగూడెం నియోజకవర్గం విజేత 2019 ఎన్నికలు". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  5. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)