తెలుగుదేశం పార్టీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తెలుగుదేశం పార్టీ
నాయకుడు చంద్రబాబు నాయుడు
వ్యవస్తాపకుడు నందమూరి తారక రామారావు
పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి
లోక్‌సభలో పార్టీ నేత తోట నరసింహం
రాజ్యసభలో పార్టీ నేత టి.దేవేందర్ గౌడ్
స్థాపన మార్చి 29, 1982
ప్రధాన కార్యాలయం రోడ్డు నంబరు.2, బంజారా హిల్స్, హైదరాబాదు-500033
రంగు పసుపు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
102 / 175
తెలంగ
15 / 119
లోక్ సభ
16 / 545
రాజ్య సభ
6 / 245
ఓటు గుర్తు
తె.దే.పా party symbol
వెబ్ సిటు
http://www.telugudesamparty.org/
జెండా

తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు.[1] అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.

13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు
నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు శకం[మార్చు]

నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రేసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.

వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం NTRకు మాత్రమే చెల్లింది.

1988లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.

1988 మరియు 1994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి మరియు రాజకీయ చరిత్ర విద్యార్థి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు.

1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు రెండవసారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి revenue మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావుకు తాను స్థాపించిన పార్టీ మీదనే అధికారం కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు ఎన్నికల సంఘం కూడా పార్టీ పేరును ఎన్.టీ రామారావు తరపు వారికి కాకుండా చంద్రబాబు తరపు వారికే కట్టబెట్టింది.

చంద్రబాబు నాయుడి శకం[మార్చు]

ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు

1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం" (4 సం" రామారావు గారిని ప్రజలు ఎన్నుకున్నది + 5 సం" చంద్రబాబుని ప్రజలు ఎన్నుకున్నది ) చరిత్ర సృష్టించాడు.1996లో రామారావు మరణమునకు పిదప ఆయన భార్య లక్ష్మీ పార్వతి అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్థులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మఱల చీల్చింది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలంచెందినది. కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకొంది.

చంద్రబాబు నాయుడు హైదరాబాదును మరియు రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.

ఎన్నికల చరిత్ర[మార్చు]

శాసన సభ ఎన్నికలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్[మార్చు]

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతము ఫలితం
1983 7వ శాసనసభ
202 / 294
54.03% విజేత
1985 8వ శాసనసభ
202 / 294
46.21% విజేత
1989 9వ శాసనసభ
74 / 294
36.54% ఓటమి
1994 10వ శాసనసభ
216 / 294
44.14% విజేత
1999 11వ శాసనసభ
180 / 294
61.22% విజేత
2004 12వ శాసనసభ
47 / 294
37.59% ఓటమి
2009 13వ శాసనసభ
92 / 294
28.12% ఓటమి
2014 14వ శాసనసభ
102 / 175
45% విజేత

తెలంగాణా[మార్చు]

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతము ఫలితం గమనిక
2014 1వ శాసనసభ
20 / 119
21.77 ఓటమి బిజెపితొ పొత్తు (తె.దా.పా 15 సీట్లు, బిజెపి 5 సీట్లు)

లోక్ సభ ఎన్నికలు[మార్చు]

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు
1984 8వ లోక్ సభ 30
1989 9వ లోక్ సభ 2
1991 10వ లోక్ సభ 13
1996 11వ లోక్ సభ 16
1998 12వ లోక్ సభ 12
1999 13వ లోక్ సభ 29
2004 14వ లోక్ సభ 5
2009 15వ లోక్ సభ 6
2014 16వ లోక్ సభ 16

తెలుగు యువత[మార్చు]

తెలుగు యువత అనగా తెలుగుదేశం పార్టీ యొక్క యువజన విభాగం. ఈ విభాగం తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తుంది. పార్టీ తరపున జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యమయి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. పార్టీకి నామినేటేడ్ పదవులు ఉన్నట్లుగానే తెలుగు యువతకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధి, సభ్యులనే నామినేటేడ్ పదవులు ఉంటాయి. తెలంగాణకు ఒప్పుకోలేక సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండలేక తెలంగాణలో పార్టీ ఖాలీ అయ్యింది.

ప్రచురణలు[మార్చు]

పుస్తకాలు[మార్చు]

వీడియోలు[మార్చు]

యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్లో [2] తెలుగు దేశం నాయకుల ప్రసంగాలు దృశ్యశ్రవణ మాధ్యమంగా లభిస్తున్నాయి.

మూలాలు, వనరులు[మార్చు]

  1. తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [1] వివరాలు జులై 19, 2008న సేకరించబడినది.
  2. యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]