1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

← 1978
1985 →
 
Party తెలుగుదేశం పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Percentage 46.30% 33.64%

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

కోట్ల విజయభాస్కర రెడ్డి
భారత జాతీయ కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

ఎన్.టి. రామారావు
తెలుగుదేశం పార్టీ

1983 నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాలలో 1983 జనవరిలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తదుపరి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. కొత్తగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ 202 స్థానాల్లో గెలిచి, భారీ మెజారిటీ సాధించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెసు పార్టీ 60 సీట్లు మాత్రమే సాధించింది. షెడ్యూల్ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉండగా, జనవరి లోనే ఎన్నికలు జరిగాయి. 1983 జనవరి 9 న పది మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు డిప్యూటీ మంత్రులతో ఎన్టీరామారావు రాష్ట్రానికి 10వ ముఖ్యమంత్రిగా, మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

ఎన్నికల విశేషాలు[మార్చు]

రాష్ట్రంలో మొత్తం 3,18,46,694 మంది వోటర్లు ఉండగా, అందులో 2,15,60,642 (67.7%) మంది వోటుహక్కును వినియోగించుకున్నారు. పోలైన వోట్లలో 2.06% వోట్లు చెల్లలేదు.

ఎన్నికలకు 9 నెలల ముందు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం 1,720 మంది పోటీ చెయ్యగా, వారిలో 1056 మంది ధరావతులు (డిపాజిట్లు) కోల్పోయారు. [1]

ఫలితాలు[మార్చు]

రాష్ట్రంలో 294 శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో 39 ని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, 15 నియోజక వర్గాలను షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకూ రిజర్వు చేసారు.

శాసనసభ నియోజకవర్గాలు, విజేతల జాబితా [1][మార్చు]

1983 ఎన్నికల తరువాత శాసనసభలో వివిధ పార్టీల బలాలు

s.No పార్టీ జెండా పోటీ చేసిన సీట్లు గెలుచుకున్న సీట్లు సీట్లులో మార్పు ఓట్ల వాటా స్వింగ్
1 తెలుగుదేశం పార్టీ Telugu_Desam_Party_Flag 289 201 Increase 201 46.30% Increase 46.30%
2 భారత జాతీయ కాంగ్రెస్ INC_Flag_Official 294 60 Decrease 115 33.64% Decrease 5.67%
3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) CPI_Flag 28 5 Decrease 3 2.01% Decrease 0.70%
4 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా CPI-flag 48 6 Increase 3 2.79% Increase 0.30%
5 భారతీయ జనతా పార్టీ BJP_flag 81 3 Increase 3 2.76% Increase 2.76%
6 జనతా పార్టీ 44 1 Decrease 59 0.96% Decrease 27.89%
7 ఇతరులు 1100 20 Increase 5 5.00% Decrease 4.20%

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "స్టాటిస్టికల్ రిపోర్ట్" (PDF). CEO, Telangana (ELECTION COMMISSION OF INDIA). Archived from the original (PDF) on 2022-12-15. Retrieved 2022-12-15.

వెలుపలి లంకెలు[మార్చు]