భారత సార్వత్రిక ఎన్నికల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశ వయోజన పౌరులందరు, వారివారి నియోజకవర్గాలలో నిలబడిన అభ్యర్థుల సమితి నుండి ఓటు వేయడం ద్వారా లోక్‌సభకు (హౌస్ ఆఫ్ ది పీపుల్) లేదాదిగువ సభ భారత పార్లమెంటుకు సభ్యులు ఎన్నుకుంటారు. ప్రతి వయోజన పౌరుడు వారి నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేయగలరు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను 'పార్లమెంటు సభ్యుడు' అని పిలుస్తారు. ప్రధానమంత్రి నేతృత్వం లోని కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి పార్లమెంటును రద్దు చేసే వరకు ఐదేళ్ల పాటు వారిస్థానాల్లో కొనసాగుతారు. లోక్‌సభ సభ్యులు న్యూఢిల్లీ లోని సంసద్ భవన్‌లో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన చర్చించి, మెజారిటీ సభ్యుల ఆమోదం ద్వారా కొత్త చట్టాలను రూపొందించడం, భారతదేశ పౌరులందరిపై ప్రభావం చూపే ప్రస్తుత చట్టాలను తొలగించడం లేదా సవరించి మెరుగు పరచడం వంటి విషయాలపై సభ సమావేశమవుతుంది. లోక్‌సభకు సభ్యులను ఎన్నుకునేందుకు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.[1] లోక్‌సభకు మొదటి ఎన్నికలు 1951-52 మధ్యకాలంలో జరిగాయి.[2][3][4]

లోక్‌సభ సాధారణ ఎన్నికల జాబితా

[మార్చు]
ఎన్నికల సంవత్సరం లోక్‌సభ మొత్తం స్థానాలు పోలింగ్ శాతం అతిపెద్ద ఏకైక పార్టీ ప్రభుత్వ స్థానాలు మెజారిటీ పార్లమెంటులో శాతం నాయకుడు
1951–52 1వ లోక్‌సభ 489 45.70% Indian National Congress 364 119 74.48% జవహర్‌లాల్ నెహ్రూ
1957 2వ లోక్‌సభ 494 55.42% Indian National Congress 371 123 75.10% జవహర్‌లాల్ నెహ్రూ
1962 3వ లోక్‌సభ 55.42% Indian National Congress 361 113 73.08% జవహర్‌లాల్ నెహ్రూ (1964లో మరణించాడు.) తరువాత లాల్ బహదూర్ శాస్త్రి (1964 - 1966)
1967 4వ లోక్‌సభ 520 61.04% Indian National Congress 283 22 54.42% ఇందిరా గాంధీ
1971 5వ లోక్‌సభ 518 55.27% Indian National Congress 352 92 67.95% ఇందిరా గాంధీ
1977 6వ లోక్‌సభ 542 60.49% Janata Party 295 23 54.98% మొరార్జీ దేశాయ్

చరణ్ సింగ్

1980 7వ లోక్‌సభ 529 56.92% Indian National Congress 353 88 64.76% ఇందిరా గాంధీ
1984 8వ లోక్‌సభ 541 64.01% Indian National Congress 414 143 76.52% రాజీవ్ గాంధీ
1989 9వ లోక్‌సభ 529 61.95% Janata Dal 197 –68 36.86% వి. పి. సింగ్

చంద్రశేఖర్

1991 10వ లోక్‌సభ 521 55.88% Indian National Congress 244 –17 46.83% పి. వి. నరసింహారావు
1996 11వ లోక్‌సభ 543 57.94% Bharatiya Janata Party 161 –111 29.65% అటల్ బిహారీ వాజ్‌పేయి (13 రోజులు) దేవెగౌడ, ఐకె గుజ్రాల్
1998 12వ లోక్‌సభ 543 61.97% Bharatiya Janata Party 182 –90 33.39% అటల్ బిహారీ వాజ్‌పేయి
1999 13వ లోక్‌సభ 59.99% Bharatiya Janata Party 182 –90 33.39% అటల్ బిహారీ వాజ్‌పేయి
2004 14వ లోక్‌సభ 543 58.07% Indian National Congress 145 –127 26.70% మన్మోహన్ సింగ్
2009 15వ లోక్‌సభ 543 58.21% Indian National Congress 206 –66 37.80% మన్మోహన్ సింగ్
2014 16వ లోక్‌సభ 66.44% Bharatiya Janata Party 282 10 51.74% నరేంద్ర మోదీ
2019 17వ లోక్‌సభ 543 67.40% Bharatiya Janata Party 303 31 55.80% నరేంద్ర మోదీ
2024 18వ లోక్‌సభ[5] 543 66.33% Bharatiya Janata Party 240 -32 44.19% నరేంద్ర మోదీ

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Terms of the Houses". Election Commission of India. Retrieved 19 February 2020.
  2. "Lok Sabha Results 1951-52". Election Commission of India. Retrieved 23 November 2014.
  3. "Statistical Report on Lok Sabha Elections 1951-52" (PDF). Election Commission of India. Retrieved 23 November 2014.
  4. "Lok Sabha Elections Stats Summary 1951-52" (PDF). Election Commission of India. Retrieved 23 November 2014.
  5. https://www.india.gov.in/spotlight/general-election-results-2024

వెలుపలి లంకెలు

[మార్చు]