ఐ.కె.గుజ్రాల్
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఇందర్ కుమార్ గుజ్రాల్ | |
![]()
| |
పదవిలో ఏప్రిల్ 21 1997 – మార్చి 19 1998 | |
మునుపు | హెచ్.డి.దేవెగౌడ |
తరువాత | అటల్ బిహారీ వాజపేయి |
జననం | జీలం, పంజాబ్, బ్రిటీషు ఇండియా | 4 డిసెంబరు 1919
మరణం | నవంబరు 30, 2012 |
రాజకీయ పార్టీ | జనతా దళ్ |
భార్య/భర్త | షీలా గుజ్రాల్ |
ఇందర్ కుమార్ గుజ్రాల్ (హిందీ: इन्द्र कुमार गुजराल) (డిసెంబర్ 4, 1919 - నవంబరు 30, 2012) 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త.
అవిభాజిత పంజాబ్ లోని జీలం (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది) లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ (వర్తక కులం) కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళాడు.
భారత రాజకీయాలలో సంచలనాత్మక సమయమైన జూన్ 1975లో గుజ్రాల్ ఇందిరా గాంధీ మంత్రివర్గములో సమాచార, ప్రసరణ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1975 జూన్ 12న అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1971 ఎన్నికలలో ఇందిరాగాంధీ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని నిర్ణయించి ఆమె ఎన్నికను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇందిరాగాంధీకి మద్దతుగా ఆమె కుమారుడు సంజయ్ గాంధీ పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము నుండి ప్రజలను లారీలలో రాజధానికి తరలించి, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు. ఈ నిరసన ప్రదర్శనలకు ప్రభుత్వాధీనములో ఉన్న రేడియో, టీవీలలో చూపించాలని గుజ్రాల్ ను సంజయ్ గాంధీ ఆజ్ఞాపించినట్టు వెల్లడైంది. అయితే రాజ్యంగబద్ధ అధికారమేదీ లేని సంజయ్ ఆజ్ఞను గుజ్రాల్ అంగీకరించలేదు. ఆ వెనువెంటనే సమాచార శాఖా మంత్రిగా గుజ్రాల్‌ను తొలగించి విద్యాచరణ్ శుక్లాను నియమించడం వెనుక ఇదే కారణమని పలువులు భావిస్తున్నారు.
ఆ తరువాత, గుజ్రాల్ రష్యాలో భారతీయ రాయబారిగా నియమితుడయ్యాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారము చేపట్టేసరికి, మాస్కోలో భారతీయ దౌత్యవేత్తగా గుజ్రాల్, 1979లో సోవియట్ సమాఖ్య యొక్క ఆఫ్ఘానిస్తాన్ దురాక్రమణను ఖండించేందుకు ఆమెను ఒప్పించాడు. అప్పటివరకు హంగేరీ, చెకోస్లవేకియాలలో సోవియట్ యొక్క సైనికచర్యలను సమర్ధించిన భారతదేశానికి ఇది మునుపటి దౌత్య వైఖరి కంటే భిన్నమైనది. దీని పర్వవసానముగానే ఇందిరాగాంధీ ఏకాంత సమావేశములో సోవియట్ నాయకుడైన లియొనిడ్ బ్రెజ్నేవ్‌కు ఆఫ్ఘానిస్తాన్ విషయంలో మాస్కో పొరపాటు చేసిందని తెలియజేసింది. భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. వూపిరితిత్తుల సంబంధిత వ్యాధితో గుర్గావ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1919 డిసెంబర్ 4న జన్మించిన ఇందర్ కుమార్ గుజ్రాల్ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1980లో కాంగ్రెస్ పార్టీని వీడారు. 1989లో జలంధర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవెగౌడ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గుజ్రాల్ సతీమణి షీలా గుజ్రాల్ పంజాబీ, హిందీ, ఆంగ్ల... తదితరభాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్ సోదరుడు సతీశ్ గుజ్రాల్ ప్రముఖ చిత్రకారుడు.
1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రిగా ఉన్నారు. అనంతరం కొంతకాలం సోవియట్యూనియన్లో భారత రాయబారిగా పదవీబాధ్యతలు నిర్వహించారు.వీపీసింగ్ నేతృత్వంలోని జనతాదళ్‌లో చేరిన పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. 1989లో వీపీ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. 1996లో దేవెగౌడ సారథ్యంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ సర్కారులోనూ విదేశాంగమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడం విశేషం. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు గుజ్రాల్ సిద్దాంతం అనే నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు.
మూలాలు[మార్చు]
ఇంతకు ముందు ఉన్నవారు: దేవెగౌడ |
భారత ప్రధానమంత్రి ఏప్రిల్ 21, 1997—మార్చి 19, 1998 |
తరువాత వచ్చినవారు: అటల్ బిహారీ వాజపేయి |