చిత్రలేఖనం

వికీపీడియా నుండి
(చిత్రకారుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజా రవివర్మ తైల వర్ణ చిత్రం

ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం [1]. దృశ్యపరమైన భాషలో కొలవదగిన ఒక ఉపరితలం పై కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ, భావాలను ఆలోచనలను వ్యక్తపరచటమే చిత్రలేఖనం[2]. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు (knives), స్పాంజీ (sponge), రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ (airbrush) లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, చిత్రకారులు అంటారు.

దృశ్యకళ (Visual Arts) లో చిత్రలేఖనానికి తగు ప్రాముఖ్యత ఉన్నది. చిత్రపటాన్ని గీయటం, కూర్పు లే కాకుండా, సంజ్ఞ, కథనం మరియు నైరూప్యం చిత్రలేఖనం లో కీలక పాత్రలు పోషిస్తాయి. సహజత్వం, ప్రాతినిధ్యం, ఛాయాచిత్రం, నైరూప్యం, కథనం, ప్రతీకాత్మకం, భావోద్రిక్తం లేదా రాజకీయం: చిత్రలేఖనం లో ప్రధాన వర్గాలు.

చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం (painting) ఒక వైపు అయితే కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించగలిగే చిత్రలేఖనం, మానవుని అభివృద్ధిలో కీలకమైన కళ.చిత్రలేఖన చరిత్రలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక భావాలే నడిపించాయని చెప్పవచ్చును. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ ప్రార్థనాలయాల పైకప్పులు క్రీస్తు జీవిత చరిత్రలోని ఘట్టాలతోను, తూర్పు దేశాలలో అనేక చిత్రలేఖనాలు బుద్ధుని చిత్రపటాలతోను చిత్రీకరించారు.

చరిత్ర[మార్చు]


2018 నాటికి అతి పురాతనమైన చిత్రలేఖనాలు ఫ్రాన్స్ కి చెందిన గ్రట్ షావే ప్రాంతంలో 32,000 సంవత్సరాల క్రితానివి [3]. గుర్రాలు, ఖడ్గమృగాలు, సింహాలు, బర్రె, ఏనుగు, మనుషులు మరియు ఇతర నైరుప్య చిత్రాలను ఈ చిత్రపటంలో చిత్రీకరించారు. ఇండోనేషియా లోని లుబాంగ్ జేర్జి సాలెహ్ గుహలలో 40,000 సంవత్సరాల క్రితం గీయబడిన కేవ్ పెయింటింగ్స్ కనుగొనబడ్డాయి [4] . 2021 నాటికి 45,500 సంవత్సరాల క్రితం వేయబడ్డ చిత్రలేఖనం కూడా ఇండొనేషియా లోనే కనుగొనబడింది. [5]

సిద్ధాంతం[మార్చు]

18/19వ శతాబ్దానికి చెందిన తత్వవేత్తలు ఇమ్యానువల్ క్యాంట్ మరియు హెగెల్, చిత్రలేఖనంలో సౌందర్యాని పై స్పందించవలసిన, చిత్రలేఖనానికి సిద్ధాంతాలు ఆపాదించవలసిన అవసరం వచ్చింది. ప్లేటో మరియు అరిస్టాటిల్ లు కూడా చిత్రకళ పై సిద్ధాంతాలు తీశారు. చిత్రలేఖనం (మరియు శిల్పకళ) సత్యాన్ని సాక్షాత్కరించలేవని, సత్యం యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే అవిష్కరించగలవని; కావున ఈ రెండు రంగాలు కళల కంటే (పాదరక్షల తయారీ, లేదా ఇనుప పనిముట్ల తయారీ వలె, కేవలం) నైపుణ్యం గానే పరిగణించబడగలవని ప్లాటో తెలిపాడు [6]. కానీ లియొనార్డో డా విన్సీ కాలానికి పురాతన గ్రీసు చిత్రకళకు భిన్నంగా చిత్రకళ వాస్తవానికి దగ్గరగా వచ్చింది. లియొనార్డో ప్రకారం, చిత్రకళ: ఒక మానసిక స్థితి (Painting is a thing of mind).[7]

చిత్రకళ సౌందర్యానికి సార్వత్రికత తేలేకపోవటం ఈ కళ యొక్క లోపంగా హెగెల్ ఎత్తి చూపాడు. కవిత్వం మరియు సంగీతం రంగాలు ప్రతీకాత్మకంగా, మేధస్సును ఉపయోగించేవి కావున చిత్రకళ కూడా వీటి వలె ఒక రొమాంటిక కళగా గుర్తించాడు [8] [9].

మాధ్యమాలు[మార్చు]

రంగు పెన్సిళ్ళు[మార్చు]

పేస్టెల్[మార్చు]

కొవ్వొత్తిలా ఉండే పేస్టెళ్ళ లో రంగు పొడి మరియు బైండరు ఉంటాయి.

సిరా[మార్చు]

కలం, బ్రష్ లేదా ఈకను సిరాలో ముంచి చిత్రలేఖనం చేస్తారు.

జలవర్ణ చిత్రలేఖనం (వాటర్ కలర్ పెయింటింగ్)[మార్చు]

కావలసినంత రంగును నీటిలో కరిగించి, దానిని కాగితం, వస్త్రం పై అద్దటంతో చిత్రలేఖనం చేయబడుతుంది. చైనా, జపాన్, కొరియా దేశాలలో ఇదే ప్రధాన మాధ్యమం. చేతి వ్రేళ్ళను కూడా సాధనాలుగా చేసుకొని చిత్రలేఖనం చేయవచ్చు.

ఆక్రిలిక్ పెయింటింగ్[మార్చు]

తైలవర్ణ చిత్రలేఖనం[మార్చు]

త్వరగా ఆరిపోయే గుణం ఉండే తైలాలో రంగులను కలిపి చిత్రలేఖనం లో వాడుతారు.

డిజిటల్ పెయింటింగ్[మార్చు]

చిత్రలేఖనం లో ప్రధానాంశాలు[మార్చు]

వర్ణం మరియు లక్షణం[మార్చు]

స్వరం, తీవ్రత మరియు లయ ఎలా అయితే సంగీతం లో ప్రధానాంశాలు అవుతాయో; రంగు, సంతృప్తత, మరియు విలువ రంగుని నిర్ధారిస్తాయి. వర్ణం ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక రకమైన అనుభూతి కలిగించినను, మానసికంగా ఖచ్చితమైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి పాశ్చాత్య దేశాలలో నలుపు దు:ఖాన్ని సూచించగా, తూర్పు దేశాలలో తెలుపు దు:ఖాన్ని సూచిస్తుంది. జొహాన్నె వుల్ఫ్ గ్యాంగ్ గొయ్థె, వస్సిలి క్యాండిన్స్కీ, మరియు న్యూటన్ వంటి కొందరు చిత్రకారులు, సిద్ధాంతకర్తలు, రచయితలు, శాస్త్రవేత్తలు, వారి వారి వర్ణ సిద్ధాంతాలని ప్రతిపాదించారు.

భాష వర్ణానికి కొంత మేరకే భాష్యాన్ని చెప్పగలుగుతుంది. ఉదాహరణకి "ఎరుపు"అనే పదం కంటికి కనిపించే కాంతిలో ఆ రంగు యొక్క విస్తృత శ్రేణి వైవిధ్యాలను మనకి స్ఫురింప జేయగలదు. ఒక చిత్రకారునికి వర్ణం కేవలం ప్రాథమికమో లేక ఉత్పన్నమో లేక పరిపూరకమో కాకపోవచ్చును.

సాంప్రదాయేతర అంశాలు[మార్చు]

లయ[మార్చు]

తీవ్రత[మార్చు]

వ్యంగ్య చిత్రం

చిత్రీకరించవలసినదాన్ని అవగతం చేసుకొనటం, దాని తీవ్రతకి ప్రాతినిధ్యం వహించటం చిత్రలేఖనాన్ని సశక్తపరుస్తాయి. విశ్వంలో ప్రతి బిందువుకి ఒక తీవ్రత ఉంటుంది. ఈ తీవ్రతని నలుపుగా గానీ, తెలుపుగా గానీ, ఈ రెంటి మధ్య వివిధ స్థాయిలలో ఉన్నా బూడిద రంగులలో వ్యక్తీకరించవచ్చును. సాధనలో చిత్రకారులు ఆకారాలని వ్యక్తీకరించటానికి వివిధ తీవ్రతలలో గల ఉపరితలాలని ఒకదాని ప్రక్కన మరొకటి చేరుస్తారు. అనగా చిత్రలేఖనం భావజాలం యొక్క మూలాల (జ్యామితీయా ఆకారాల, వివిధ దృక్కోణాల, చిహ్నాల వంటి వాటి) కి అతీతమైనది. ఉధాహరణకి, ఒక తెల్లని గోడ, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వస్తువులని బట్టి ఒక్కో బిందువు వద్ద వివిధ తీవ్రతలు ఉన్నట్లుగా ఒక చిత్రకారుడు గమనించగలుగుతాడు, కానీ సైద్ధాంతికంగా తెల్లని గోడ ఎక్కడైనా తెల్లగానే ఉంటుంది. సాంకేతిక పరంగా చూచినట్లయితే గీత యొక్క మందం కూడా గమనార్హం.

శైలి[మార్చు]

చిత్ర కళలో రకాలు[మార్చు]

చిత్రలేఖనం పలు రకాలు. ఎవరైనా వేయగలిగే డూడుల్స్ ఒక రకం అయితే, చేయి తిరిగిన వారు మాత్రమే వేయగలిగే తైలవర్ణ చిత్రలేఖనం మరొక రకం. నవ్వు పుట్టించే వ్యంగ్య చిత్రాలు కొన్ని అయితే ఆలోచింప జేసే చిత్రలేఖనాలు మరి కొన్ని. కొన్ని కాగితం పై వేసేవి అయితే మరి కొన్ని కాన్వాస్ పై వేసేవి. అడోబీ ఇల్లస్ట్రేటర్, ఇంక్‌స్కేప్ వంటి సాఫ్టువేరు లతో కంప్యూటర్ లను ఉపయోగించి డిజిటల్ పెయింటింగ్ లను సృష్టించవచ్చు.

డూడుల్స్[మార్చు]

డూడుల్ ఉదాహరణ. డూడుల్ కార్టూను కావలసిన అవసరం లేదు
డూడుల్స్ చిత్రాలే కావలసిన అవసరం లేదు

డూడుల్ (ఆంగ్లం: Doodle) అనగా అన్యథా ఇతర ముఖ్య కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నా, వేరే వాటి/దాని గురించి ఆలోచిస్తూ, లక్ష్యం లేకుండా, కాలక్షేపం కోసం, సరదాగా వేసిన ఒక బొమ్మ. [10] [11] [12] [13] డూడుల్ కేవలం బొమ్మలకే పరిమితం కాదు. ఫ్యాన్సీగా రాయబడే అక్షరాలు, సంతకాలు, కార్టూనులు, రేఖాగణిత అంశాలు లేక మరే పిచ్చిగీతలైన కావచ్చు. [14] [15] డూడుల్స్ కోసం ప్రత్యేకంగా పెద్ద సరంజామా అవసరం లేదు. కేవలం కలం-కాగితం లతో ఎక్కడైనా, ఎప్పుడైనా డూడుల్స్ మొదలుపెట్టవచ్చు. సరైన కాగితం లేకపోతే ప్రత్యామ్నాయాలు గ పేపరు న్యాప్కిన్, టిష్యూ పేపరు, నోటు పుస్తకం లో మార్జిన్ కు అటువైపు లేక వేరే ఏ చిత్తు కాగితమైనా ఉపయోగించవచ్చు.

వ్యంగ్య చిత్రాలు[మార్చు]

స్కెచ్[మార్చు]

రేఖాచిత్రం (డ్రాయింగ్)[మార్చు]

వాటర్ కలర్ పెయింటింగ్[మార్చు]

ఆయిల్ పెయింటింగ్[మార్చు]

డిజిటల్ పెయింటింగ్[మార్చు]

సమగ్ర చిత్రలేఖనం[మార్చు]

ప్రధాన వ్యాసం సమగ్ర చిత్రలేఖనం

Raevsky Battery at Borodino, a fragment of Roubaud's panoramic painting.

చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు. సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు.

ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ శతాబ్దం నుండి ఐరోపా, అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి, ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.

చిత్ర రచన[మార్చు]

ప్రధాన వ్యాసం చిత్ర రచన

శ్రీనివాసుని చిత్రాన్ని శ్రీ అక్షర రూపంలో అక్షర శైలిలో కొద్దిగా మార్పు చేస్తూ చిత్రించిన చిత్రం. ఒక్క అక్షరంతోనే కొంత సమాచారం ఇవ్వగల చిత్రం ఇది.

ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది.

చిత్రాలను చిత్రించే వ్యక్తిని చిత్రకారుడు అంటారు. ఇతను రకరకాల రంగులను ఉపయోగించి తన కళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తాడు. చిత్రకారుడు చిత్రాన్ని చూసి లేదా ఊహించి తన ప్రతిభతో చిత్రాన్ని రూపొందిస్తాడు. చిత్రకారుడు చిత్రకళపై ఉన్న అభిలాషతో లేదా సంపదపై మక్కువతో ఈ కళను ఎంచుకుంటాడు. తాను చిత్రించిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టి ప్రదర్శకులను సమ్మోహితులను చేయటం తద్వారా వాటికి ఆకర్షితులైన చిత్రకళా ప్రియుల నుండి మంచి విలువను పొందుతాడు. చిత్రకారుల వలన నాటి సంస్కృతిని, దుస్తులను, ఆచార వ్యవహారాలను, జీవన శైలిని చిత్రాల రూపంలో నేటి మానవుడు తెలుసుకోనగలుగుతున్నాడు.

స్టాంపుల పై చిత్రలేఖనం[మార్చు]

స్టాంపుల పై ప్రముఖుల, ప్రముఖప్రదేశాల చిత్రాలను ముద్రించటం ఆనవాయితీగా వస్తోంది. పలు విదేశీ/స్వదేశీ స్టాంపులపై చిత్రలేఖనానికి సంబంధించిన బొమ్మలు ముద్రించబడతాయి.

విదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం[మార్చు]

విదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం

స్వదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం[మార్చు]

స్వదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం

ప్రఖ్యాత చిత్ర కారులు[మార్చు]

Panorama of a half section of Night Revels of Han Xizai, 12th century Song Dynasty painting.

మూలాలు[మార్చు]

 1. మెరియం వెబ్స్టర్ డిక్షనరీ లో పెయింటింగ్ కు నిర్వచనం
 2. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లో పెయింటింగ్ పరిచయ వాక్యం
 3. యునెస్కీ వెబ్ సైటులో షావే చిత్రలేఖనం గురించి
 4. లుబాంగ్ జఏర్జి సాలెహ్ గుహలలో పెయింటింగ్ గురించి BBC
 5. 45,500 సంవత్సరాల క్రితం చేయబడ్డ చిత్రలేఖనం ఇండోనేషియా లో లభ్యం
 6. కళ గురించి ప్లాటో సిద్ధాంతం
 7. Rollason, C., & Mittapalli, R. (2002). Modern criticism. New Delhi: Atlantic Publishers and Distributors. p. 196. ISBN 81-269-0187-X
 8. Routledge_Encyclopedia_of_Philosophy Pg 276
 9. హెగిలిజం - ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 1911 (3.3.1 - Philosophy of Fine Art)
 10. మెర్రియం-వెబ్స్టర్ డిక్షనరీ లో డూడుల్ కు నిర్వచనం
 11. ఫ్రీ డిక్షనరీ లో డూడుల్ కు నిర్వచనం
 12. కేంబ్రిడ్జి డిక్షనరీలో డూడుల్ కు నిర్వచనం
 13. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో డూడుల్ కు నిర్వచనం
 14. "5 Big Benefits Of Being A Doodler". 5 Big Benefits Of Being A Doodler. huffpost.com. 17 June 2015. Retrieved 25 June 2021.
 15. డూడుల్స్ గా రేఖాగణిత అంశాలు

బయటి లింకులు[మార్చు]