Jump to content

క్యూబిజం

వికీపీడియా నుండి

క్యూబిజం (ఆంగ్లం: Cubism) పారిస్ లో పాబ్లో పికాసో, జార్జెస్ బ్రేక్ చే కనుగొనబడ్డ ఒక కళా ఉద్యమం.[1] 1907 నుండి 1914 వరకు ఈ ఇరువురు కళాకారులు క్యూబిజం పై కృషి చేసారు. దృక్కోణం (perspective), మాడలింగ్ (ఒక మాడల్ ను చూస్తూ చిత్రీకరించటం), ఎత్తు-లోతుల చిత్రీకరణ (foreshortening), వెలుగు-నీడల చిత్రీకరణ (Chiaroscuro) వంటి సాంఫ్రదాయ చిత్రలేఖన సాంకేతిక అంశాలను, కళ ప్రకృతిని ప్రతిబింబింపజేయాలనే పురాతన వాదనను ధిక్కరించి, చదునైన టూ డైమెన్షనల్ చిత్రపట ఉపరితలానికి క్యూబిజం ప్రాముఖ్యతను ఇచ్చింది. క్యూబిస్టు పెయింటర్లు యథాతథంగా చిత్రీకరణ చేయకుండా, తమ చిత్రలేఖనం లోని అంశాలను చిత్రపటాలలో విచ్చలవిడిగా విభజించేవారు.

వ్యుత్పత్తి

[మార్చు]

1908 లో బ్రేక్ చేసిన Houses at L’Estaque అనే చిత్రలేఖనాన్ని చూసి లుయీస్ వాక్సల్లెస్ అనే విమర్శకుడు ఎగతాళిగా "క్యూబ్స్ ను పేర్చినట్లు ఉంది" అనటంతో ఈ ఉద్యమానికి క్యూబిజం అనే పేరు వచ్చింది.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Cubism". Britannica. 2000-01-12. Retrieved 2024-09-18.{{cite web}}: CS1 maint: url-status (link)
"https://te.wikipedia.org/w/index.php?title=క్యూబిజం&oldid=4340717" నుండి వెలికితీశారు