కాంగ్రా శైలి చిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాంగ్రా శైలి చిత్రకళ (ఆంగ్లం: Kangra painting) హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో 1780 లో ఉద్భవించిన ఒక చిత్రకళా శైలి.[1]

చరిత్ర

[మార్చు]

1751 నుండి 1774 వరకు కాంగ్రా ను పరిపాలించిన రాజా ఘమండ్ చంద్ కళాప్రేమికుడు కాదు. అయితే అతని మనుమడు రాజా సంసార్ చంద్ (1775-1823) కు రాచకార్యాలతో బాటు, కళలపై కూడా మక్కువ ఉండటంతో కాంగ్రా శైలి 1780 లో ఉద్భవించింది. [2] సంసార్ చంద్ పాలనలో కాంగ్రా శైలి చిత్రకారులు భాగవత పురాణం లోని దృశ్యాలను చిత్రీకరించటం తో ఈ శైలి ప్రాచుర్యం లోకి వచ్చింది.[2]

శైలి

[మార్చు]

కాంగ్రా శైలి ముఘల్ శైలి, హిందువుల ఆకాంక్షల అపూర్వ సంగమం. [1] పాశ్చాత్య శైలుల ప్రభావం నేరుగా కాకపోయినా, వాటి ఛాయలు అక్కడక్కడా తొణికిసలాడుతుంటాయి. లయబద్ధమైన గీతలు, అధికమైన సహజత్వ పాళ్ళు, స్త్రీ స్వభావం గల ఆకారాలు, అమాయకత్వం లోనే ఒలికే శృంగార రసం కాంగ్రా శైలి ప్రత్యేకతలు.

పతనం

[మార్చు]

దాదాపు 25 ఏళ్ళ వరకు ఒక వెలుగు వెలిగిన కాంగ్రా శైలి చిత్రకళ 1806 లో నేపాల్ నుండి వచ్చిన గుర్ఖాలు ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకోవటంతో కనుమరుగు అయ్యింది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Archer 1956, p. 2.
  2. 2.0 2.1 Archer 1956, p. 4.
  3. Archer 1956, p. 5.
  • Archer, William George. (1956). The Faber Gallery of Oriental Art Kangra Painting. Faber and Faber Ltd.