హిమాచల్ ప్రదేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిమాచల్ ప్రదేశ్
Map of India with the location of హిమాచల్ ప్రదేశ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
షిమ్లా
 - 30.06° ఉ 77.11° తూ
పెద్ద నగరం షిమ్లా
జనాభా (2001)
 - జనసాంద్రత
6,077,248 (20th)
 - 109/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
55,673 చ.కి.మీ (17th)
 - 12
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[హిమాచల్ ప్రదేశ్ |గవర్నరు
 - [[హిమాచల్ ప్రదేశ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1971-01-25
 - ఆచార్య దేవ్ వ్రత్
 - వీరభద్ర సింగ్
 - Unicameral (68)
అధికార బాష (లు) హిందీ, పహాడీ
పొడిపదం (ISO) IN-HP
వెబ్‌సైటు: himachal.nic.in

హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश) వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన, వాయువ్యమున జమ్మూ కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఆగ్నేయమున ఉత్తరాఖండ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు), 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించింది.

రాష్ట్ర రాజధాని షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ, మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్ నది జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది), బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.

జిల్లాలు[మార్చు]

దస్త్రం:Himachal Pradesh map.jpg
హిమాచల్ ప్రదేశ్

సంస్కృతి[మార్చు]

కాంగ్రి, పహారీ, పంజాబీ, హిందీ, మండియాలీ రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భాషలు. హిందూ మతము, బౌద్ధ మతము, సిక్కు మతము రాష్ట్రములోని ప్రధాన మతములు. రాష్ట్రములోని పశ్చిమ భాగములోని ధర్మశాల, దలైలామా, అనేక టిబెట్ శరణార్ధులకు ఆవాసము.

రాజకీయాలు[మార్చు]

2003 రాష్ట్ర శాసనసభలో భారత జాతీయ కాంగ్రేసు అధికారములోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షము.

రవాణా, సమాచార ప్రసరణ[మార్చు]

రోడ్లు ప్రధాన రవాణా మార్గములు. రోడ్లు కురుచగా మెలికలు తిర్గుతూ తరచూ ఊచకోతలు, భూమి జారడాల మధ్య ఉండటము వలన ప్రయాణము మెళ్లిగా సాగుతుంది. ఋతుపవనాల కాలములో పరిస్థితి మరింత భయానకము అవుతుంది. ప్రభుత్వము యాజమాన్యములో నడుస్తున్న హిమాచల్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ రాష్ట్రమంతటా బస్సులు నడుపుతుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు టెలిఫోన్, మొబైల్ ఫోన్ సౌకర్యములు ఉన్నాయి.

పర్యాటక ప్రాంతములు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలములు[మార్చు]

  • వర్మ, వి. 1996. గద్దీస్ ఆఫ్ ధౌళాధర్: ఏ ట్రాన్స్ హ్యూమన్ ట్రైబ్ ఆఫ్ ద హిమాలయాస్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ.
  • హందా, ఓ. సీ. 1987. బుద్ధిష్ట్ మొనాస్టరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ. ISBN 81-85182-03-5.

బయటి లింకులు[మార్చు]