సోలన్ జిల్లా
సోలన్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | సోలన్ |
మండలాలు | 1. సోలన్, 2. కసౌలి, 3. నాలాగఢ్, 4. అర్కి 5. కందాఘాట్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 5 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,936 కి.మీ2 (747 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 5,76,670 |
• జనసాంద్రత | 300/కి.మీ2 (770/చ. మై.) |
• Urban | 18.22% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 85.02% |
• లింగ నిష్పత్తి | 852 |
సగటు వార్షిక వర్షపాతం | 1253 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో సోలన్ జిల్లా ఒకటి. సోలన్ పట్టణం జిల్లాకేంద్రగా ఉంది. జిల్లా వైశాల్యం 1,936 చ.కి.మీ.
చరిత్ర
[మార్చు]ప్రస్తుత సోలన్ జిల్లా ప్రాంతంలో ఒకప్పుడు భోపాల్, భగత్, కునిహార్, కుతార్, మంగల్, బేజా, మహ్‌లాగ్,నలగర్, కియోతల్, కోథి, పర్వతమయ ప్రాంతాలు కలిసి పంజాబ్ ప్రోవిన్స్‌లో భాగంగా ఉంటూ వచ్చాయి. తరువాత 1966 నవంబరు 1 న ఇవి హిమాచల్ ప్రదేశ్ లో కలిసాయి. 1972 సెప్టెంబరు 1 న సోలన్ జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా మునుపటి మహాసు జిల్లా నుండి సోలన్, అర్కి తహసీళ్ళు, మునుపటి సిమ్లా జిల్లా నుండి కందఘాట్, నలఘర్ తహసీళ్ళనూ కలిపి ఏర్పాటు చేసారు.ఈ జిల్లాలో ఉన్న షూలిని దేవి పేరిట ఈ జిల్లాకు నామకరణం చేసారు. షూలిని మాత సోలన్ ప్రాంతాన్ని వినాశనం నుండి రక్షించిందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.
విభాగాలు
[మార్చు]సోలన్ జిల్లా 4 ఉపవిభాగాలుగా (సోలన్,నలగర్, అర్కి, కందఘాట్) గా విభజించబడి ఉంది. సోలన్ ఉప విభాగంలో సోలన్, కసౌలి తెహసీళ్ళు ఉన్నాయి. నలఘర్ అర్కి అర్కి, కందఘాట్‌లు ప్రత్యేక తెహ్సిల్స్‌గా ఉన్నాయి. జిల్లాలో 5 విధానసభ నియోజకవర్గాలు (అర్కి,సోలన్,డూన్, సోలన్, కసౌలి) ఉన్నాయి. ఇవి అన్నీ సిమ్లా పార్లమెటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]సోలన్ జిల్లాలో అందార్ బజార్ వద్ద మాతా షూలిని దేవి ఆలయం, రాజ్ఘర్ రోడ్డు వద్ద జతోలీ మందిర్, మాల్ రోడ్డు వద్ద చిల్డ్రెన్ పార్క్, శిఖరం మీద జవహర్ పార్క్, భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన " మోహన్ మీకిన్ బ్రివెరీస్ ఉన్నాయి. కల్క-సిమ్లా మార్గంలో నడుపబడుతున్న టాయ్ ట్రైన్ సోలన్ జిల్లా గుండా ప్రయాణిస్తుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 576,670,[1] |
ఇది దాదాపు | సోలోమన్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో | 532 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత | 298 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 15.21%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 824:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అల్పం |
అక్షరాస్యత శాతం | 85.02%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Archived from the original on 2012-05-05. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Wyoming 563,626
==భౌగోళిక స్థానం ==