హమీర్‌పూర్ జిల్లా (హిమాచల్ ప్రదేశ్)
హమీర్‌పూర్ జిల్లా
हमीरपुर जिला ہمیرپور ضلع | |
---|---|
![]() హిమాచల్ ప్రదేశ్ పటంలో హమీర్‌పూర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | హమీర్‌పూర్ |
మండలాలు | 5 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,118 కి.మీ2 (432 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 3,69,128 |
• సాంద్రత | 330/కి.మీ2 (860/చ. మై.) |
Website | అధికారిక జాలస్థలి |
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో హమీర్‌పూర్ జిల్లా ఒకటి. హమీర్‌పూర్ పట్టణం ఈ జిల్లాకు ప్రధానకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 1,118 చ.కి.మీ. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇది అతి చిన్న జిల్లా. దీనిని వీరభూమి (మార్టిర్ లాండ్) అని అంటారు. భారతదేశంలో అధికంగా రహదారి మార్గాలున్న జిల్లాగా, రాష్ట్రంలో అత్యధికంగా అక్షరాస్యత కలిగిన జిల్లాగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
చరిత్ర
[మార్చు]1972లో కాంగ్రా జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు కటోచ్ సామ్రాజ్యంలో ఉండేది. అంతేకాక జలంధర్- త్రిగర్త సామ్రాజ్యంలోనూ ఇది భాగంగా ఉండేది. పానిన్ ఈ ప్రదేశాన్ని గొప్ప యుద్ధపఠిమ, వీరభూమిగా వర్ణించాడు. ప్రస్తుతం కూడా సైనికరంగం హమీర్‌పూర్ ప్రజలకు అత్యధికంగా జీవనోపాధి కలిగిస్తుంది. డోగ్రా, గ్రానడియర్స్, జాక్రిఫ్ నుండి పెద్ద మొత్తంలో పారామిలటరీ ఉద్యోగులుగా అస్సాం రైఫిల్స్‌లో పనిచేస్తున్నారు. వృత్తి సైనికులుగా ధైర్యవంతులుగా వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరు శ్రమజీవులు. అలాగే పర్వతప్రాంతాలను చక్కగా అవగాహన చేసుకున్న వారుగా కూడా గుర్తింపు పొందారు. అందుకే ఇది వీరభూమిగా గుర్తింపు పొందింది. మిగిలిన హిమాచల్ ప్రదేశ్ దేవభూమిగా పిలువబడుతుంది. రాజా హమీర్ చంద్ కాలంలో, 1700-1740 మద్య, కటోచ్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. హమీర్‌పూర్ వద్ద హమీర్ చంద్ ఒక కోటను నిర్మించాడు. రాజా హమీర్ పేరు మీదుగానే ఈ ప్రాంతం హమీర్‌పూర్ అయింది.
భౌగోళికం
[మార్చు]హమీర్‌పూర్ జిల్లా 31°25′ఉత్తర, 31°52 ఉత్తర డిగ్రీల అక్షాంశం, 76°18′తూర్పు, 76°44′తూర్పు డిగ్రీల రేఖాంశం వద్ద ఉంది.ఈ జిల్లా సముద్రమట్టానికి 785 మీ ఎత్తున ఉంది. హమీర్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
వాతావరణం
[మార్చు]హమీర్‌పూర్ జిల్లా అచ్చమైన పర్వతప్రాంత వాతావరణం కలిగి ఉంది. ఇది మైదానాలకు సమీపంలో ఉంది. శీతాకాలంలో చలి అధికంగా ఉన్నా భరించగలిగిన విధంగానూ ఆహ్లాదకరంగానూ ఉంటుంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.
విభాగాలు
[మార్చు]హమీర్‌పూర్ జిల్లాలో హమీర్‌పూర్, బర్సర్, నాదౌన్, భోరంజ్ అనే 4 ఉపవిభాగాలున్నాయి.. హమీర్‌పూర్ ఉపవిభాగంలో హమీర్‌పూర్, సుజంపూర్ అనే 2 తహసీళ్ళున్నాయి. బర్సర్, నాదౌన్, భోరంజ్ ఉపవిభాగాల్లో అవే పేర్లతో ఒక్కొక్క తహసీలుంది. జిల్లాలో భోరంజ్, సుజంపూర్, హమీర్‌పూర్, నాదౌన్, బర్సర్ అనే 5 శాసనసభ నియోజక వర్గాలున్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 4,54,293,[1] |
ఇది దాదాపు | మాల్టా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
640 భారతదేశ జిల్లాలలో స్థానం | 550.[1] |
జనసాంద్రత (/చ.కి.మీ) | 406 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 10.08%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 1096:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 89.01%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Malta 408,333 July 2011 est.