Jump to content

1700

వికీపీడియా నుండి

1700 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1697 1698 1699 - 1700 - 1701 1702 1703
దశాబ్దాలు: 1680లు 1690లు - 1700లు - 1710లు 1720లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
ఛత్రపతి శివాజీ మహారాజ్
  • జనవరి 26: రాత్రి సుమారు 9 గంటలకు, కాస్కాడియా భూకంపం సంభవించింది. 8.7–9.2. తీవ్రతతో ఉన్న పెను భూకంపం వలన కాస్కాడియా సబ్డక్షన్ జోన్ 1000 కిలోమీటర్ల మేర చీలిపోయి సునామికి కారణమవుతుంది, ఇది సుమారు 10 గంటల తరువాత జపాన్ తీరాన్ని తాకింది.
  • మార్చి 3: శివాజీ II తన తండ్రి రాజారాం I మరణం తరువాత 4 వ ఛత్రపతిగా మరాఠా సామ్రాజ్య సింహాసనాన్ని పొందాడు.
  • మార్చి: విలియం కాంగ్రేవ్ కామెడీ ది వే ఆఫ్ ది వరల్డ్ మొదటిసారి లండన్‌లో ప్రదర్శించబడింది.[1][2]
  • మార్చి 25: ఫ్రాన్స్, ఇంగ్లాండ్, హాలండ్ మధ్య లండన్ ఒప్పందం కుదిరింది.[3]
  • మే 5: జాన్ డ్రైడెన్ మరణించిన కొద్ది రోజుల్లోనే ( మే 1 OS), అతని చివరి వ్రాతపూర్వక రచన ( ది సెక్యులర్ మాస్క్ ) వాన్‌బ్రగ్ యొక్క ది పిల్గ్రిమ్ వెర్షన్‌లో భాగంగా ప్రదర్శించబడింది.
  • జూలై 11: ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్థాపించబడింది, గాట్ఫ్రైడ్ లీబ్నిజ్ అధ్యక్షుడయ్యాడు.[4]
  • నవంబర్ 15: లూయిస్ XIV తన మనవడు అంజౌకు చెందిన ఫిలిప్ తరపున స్పానిష్ కిరీటాన్ని అంగీకరించాడు. తద్వారా స్పానిష్ వారసత్వ యుద్ధానికి ( 1701 - 1714 ) కారకుడయ్యాడు.
  • సుమారు సమయం: లిబియాలో సింహాలు అంతరించిపోయాయి.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
  • కమలాకరుడు, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. (జ. 1616)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. p. 289. ISBN 0-304-35730-8.
  2. Hochman, Stanley. McGraw-Hill Encyclopedia of World Drama. Vol. 4. p. 542.
  3. "The House Laws of the German Habsburgs".
  4. "Berlin Academy of Science". MacTutor History of Mathematics. August 2004. Retrieved 21 November 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=1700&oldid=3846749" నుండి వెలికితీశారు