1656
స్వరూపం
1656 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1653 1654 1655 - 1656 - 1657 1658 1659 |
దశాబ్దాలు: | 1630లు 1640లు - 1650లు - 1660లు 1670లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 17: కొనిగ్స్‌బర్గ్ ఒప్పందం కుదిరింది, స్వీడన్‌కు చెందిన చార్లెస్ X గుస్తావ్, బ్రాండెన్‌బర్గ్ కు చెందిన ఫ్రెడరిక్ విలియం మధ్య పొత్తు ఏర్పడింది.
- జనవరి 24: అమెరికాలోని పదమూడు కాలనీలలో మొదటి యూదు వైద్యుడు జాకబ్ లుంబ్రోజో మేరీల్యాండ్‌కు వచ్చారు .
- ఏప్రిల్ 2: బ్రస్సెల్స్ ఒప్పందం కుదిరింది. స్పెయిన్కు చెందిన ఫిలిప్ IV కూ, చార్లెస్ II నేతృత్వంలోని బ్రిటిష్ ద్వీపాలకు బహిష్కరించబడిన రాయలిస్టులకూ పొత్తు ఏర్పడింది.
- మే 12: శ్రీలంకలోని కొలంబో నగరాన్ని డచ్ స్వాధీనం చేసుకుంది. డచ్ సిలోన్ మొదలవడానికి ఇది గుర్తు.
- జూలై 28 - 30: వార్సా యుద్ధం : స్వీడన్ రాజు చార్లెస్ X గుస్తావ్ నేతృత్వంలోని స్వీడిష్ సామ్రాజ్యపు సైన్యాలు, బ్రాండెన్‌బర్గ్ మార్గ్రేవిట్ వార్సా సమీపంలో ఉన్న పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ దళాలను ఓడించాయి.
- సెప్టెంబర్ 15: కోప్రెలే మెహమెద్ పాషా ఒట్టోమన్ సామ్రాజ్యపు మహామంత్రి అయ్యాడు .
- డిసెంబర్: క్రిస్టియన్ హైగెన్స్ లోలకం గడియారాన్ని కనుగొన్నాడు.
- డిసెంబర్ 20: స్వీడన్‌కు చెందిన చార్లెస్ X గుస్తావ్, బ్రాండెన్‌బర్గ్ కు చెందిన ఫ్రెడరిక్ విలియం మధ్య లాబియా ఒప్పందం కుదిరింది .
- నోట్లను జారీ చేసిన మొట్టమొదటి బ్యాంకు, స్టాక్హోమ్ బాంకో స్వీడన్లోని స్టాక్హోమ్లో స్థాపించబడింది.
జననాలు
[మార్చు]- ఆగస్టు 3: కాకునూరి అప్పకవి తెలుగు లాక్షణిక కవి.
- నవంబర్ 8: ఎడ్మండ్ హేలీ ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. (మ.1742)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 16 : రాబర్ట్ డి నోబిలీ 17వ శతాబ్దికి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రబోధకుడు, సన్యాసి. (జ.1577)