1616

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1616 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1613 1614 1615 - 1616 - 1617 1618 1619
దశాబ్దాలు: 1590 1600లు - 1610లు - 1620లు 1630లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం
విలియం షేక్‌స్పియర్

సంఘటనలు[మార్చు]

  • జనవరి 10: ఇంగ్లీషు దౌత్యవేత్త సర్ థామస్ రో అజ్మీర్‌ కోటలో మొఘల్ చక్రవర్తి జహంగీర్‌ను దర్శించాడు.
  • ఫిబ్రవరి 19: ఫిలిప్పైన్స్‌లోని మేయాన్ అగ్నిపర్వతం విస్ఫోటనాన్ని మొదటిసారి రికార్డు చేశారు.
  • మార్చి 11: గెలీలియో గెలీలి పోప్ పాల్-Vను కలిసి కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచి సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించాడు.
  • మే 3: లాడన్ ఒడంబడికపై సంతకాలు జరిగాయి. ఫ్రాన్సులో వరుస తిరుగుబాట్లు నిలిచిపోయాయి.
  • సెప్టెంబర్ 15: ఇటలీలోని ఫ్రాస్కాటీ నగరంలో ఐరోపాఖండం‌లోనే మొట్టమొదటి ఉచిత పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది.
  • డిసెంబర్ 22: ఒక భారతీయ యువకుడు లండన్ నగరంలోని సెయింట్ డయోనిస్ బ్యాక్ చర్చిలో బాప్తిస్మము తీసుకుని పీటర్‌గా తన పేరును మార్చుకున్నాడు. ఆ విధంగా పీటర్ ఆంగ్లికన్ చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించిన మొదటి భారతీయుడైనాడు.

తేదీవివరాలు తెలియనివి[మార్చు]

  • నూర్‌హాచి తనను తాను చైనా చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తరువాతి కాలంలో ఇతడు జిన్ సామ్రాజ్యాన్ని ఆరంభించాడు.

జననాలు[మార్చు]

  • జనవరి 5:అలెక్జాండర్ వొన్ బోర్నాన్‌విల్లె, ఫ్లెమిష్ సైన్యాధ్యక్షుడు. (మ.1690)
  • ఫిబ్రవరి 2:సెబాస్టియన్ బౌర్డాన్, ఫ్రెంచి పెయింటర్. (మ.1671)
  • మార్చి 16:థామస్ జెర్వోయిస్, ఆంగ్ల రాజకీయవేత్త. (మ.1693)
  • ఏప్రిల్ 8: ప్రిన్స్ గుర్షాస్పు మీర్జా, ఖుస్రౌ మిర్జా కుమారుడు.
  • మే 23: సర్ ఎడ్వర్డ్ బాగట్, ఇంగ్లీష్ రాజకీయవేత్త. (మ.1673)
  • జూన్ 23: షా షుజా, షాజహాన్ రెండవ కుమారుడు. (మ.1661)
  • జూలై 10: ఆంటానియో డెల్ క్యాస్టిరో వై సావెడ్రా, స్పానిష్ కళాకారుడు. (మ.1668)
  • ఆగష్టు 18: జాన్ హెర్వే, ఇంగ్లీష్ రాజకీయవేత్త. (మ.1680)
  • సెప్టెంబర్ 9: నికొలాస్ డి విలాసిస్, స్పానిష్ పెయింటర్. (మ.1694)
  • నవంబర్ 23: జాన్ వాలిస్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1703)
  • డిసెంబర్ 13: ఎడ్వర్డ్ ఛాంబర్లేన్, ఇంగ్లీష్ రచయిత. (మ.1703)

తేదీ వివరాలు తెలియనివి[మార్చు]

  • కమలాకరుడు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. (మ.1700)

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=1616&oldid=3904653" నుండి వెలికితీశారు