1714

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1714 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1711 1712 1713 - 1714 - 1715 1716 1717
దశాబ్దాలు: 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు[మార్చు]

All Souls Memorial Church
  • మార్చి 7: ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ల మధ్య రాస్తాట్ ఒప్పందం కుదిరింది. వారి మధ్య జరుగుతున్న స్పానిష్ వారసత్వ యుద్ధం ముగిసింది.
  • జూలై: రేఖాంశ బహుమతి : గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ " రేఖాంశాన్ని కనుగొనే వ్యక్తికి లేదా వ్యక్తులకు బహుమతిని ఇవ్వడానికి" ఓటు వేసింది (ఓడ ఉన్న రేఖాంశాన్ని 1 డిగ్రీ లోపల నిర్ణయించగల ఏ పద్ధతికైనా £ 10,000; 40 నిమిషాల్లోపు నిర్ధారించగలిగితే £ 15,000,, అర డిగ్రీ లోపలైతే £ 20,000).
  • జూలై 27: గంగట్ యుద్ధంలో స్వీడిష్ నావికాదళానికి వ్యతిరేకంగా ఇంపీరియల్ రష్యన్ నావికాదళం తన మొదటి ముఖ్యమైన విజయాన్ని సాధించింది.
  • ఆగష్టు 1: క్వీన్ అన్నే మరణం తరువాత హానోవర్ కు చెందిన జార్జ్, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్ల రాజు జార్జ్ I అయ్యాడు,
  • సెప్టెంబర్ 11: స్పానిష్ వారసత్వ యుద్ధం : బార్సిలోనాను సుదీర్ఘ ముట్టడి తరువాత వశపరచుకున్నారు. కాటలోనియా స్పానిష్, ఫ్రెంచ్ బౌర్బన్ సైన్యాలకు లొంగిపోయింది.
  • డిసెంబర్ 9: ఒట్టోమన్-వెనీషియన్ యుద్ధం (1714–1718) : ఒట్టోమన్ సామ్రాజ్యం రిపబ్లిక్ ఆఫ్ వెనిస్‌పై యుద్ధం ప్రకటించింది.
  • తేదీ తెలియదు: ప్రపంచంలోని మొట్టమొదటి మిశ్రమ లింగ పాఠశాల ఆర్చ్ బిషప్ టెనిసన్ స్కూల్, కాంటర్బరీ యొక్క ఆర్చ్ బిషప్ థామస్ టెనిసన్, ఇంగ్లాండ్లోని లండన్కు దక్షిణాన క్రోయిడాన్లో స్థాపించారు .
  • తేదీ తెలియదు: ఫరుక్కా‌బాద్ నగరాన్ని నవాబ్ మొహమ్మద్ ఖాన్ బంగాష్ స్థాపించాడు.
  • తేదీ తెలియదు: విజయనగర సంస్థానం కోటను నిర్మించారు
  • తేదీ తెలియదు: కాండర్ నది (స్విట్జర్లాండ్) ని థున్ సరస్సులోకి మళ్ళించారు
  • తేదీ తెలియదు: ఈస్టిండియా కంపెనీ రికార్డులలో "హౌరా" అనే పేరు మొట్టమొదటిసారి కనిపించింది.
  • తేదీ తెలియదు: పెద్దాపుర సంస్థాన పాలకుడు వత్సవాయి జగపతి రాజు మరణించడంతో ఆయన భార్య రాగమ్మ 1734 వరకు పరిపాలించి కుమారుడైన తిమ్మ గజపతికి రాజ్యమప్పగించింది..

జననాలు[మార్చు]

  • అక్టోబరు 16: గియోవన్నీ అర్డునో, ఇటాలియన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త. (మ. 1795)
  • నవంబర్ 1: జోహన్ జోచిమ్ స్పాల్డింగ్, జర్మన్ వేదాంతవేత్త (మ .1804 )

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=1714&oldid=3844297" నుండి వెలికితీశారు