పెద్దాపుర సంస్థానం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


పెద్దాపురం పట్టణం పెదపాత్రుడు మహారాజుచే నిర్మించబడింది. క్షత్రియ కులస్థులైన వత్సవాయి కుటుంబంచే మూడువందల సంవత్సరములు పరిపాలించబడింది. ఈ కుటుంబ పరంపర రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి బహదూర్ తో ప్రారంభమైంది. 1555 నుంచి 1607 వరకు లో ఇతను పరిపాలించాడు. పెద్దాపురం కోట ఇతని హయాంలోనే నిర్మించబడింది. ఇతని తరువాత, ఇతని కుమారుడు రాయ జగపతి, తరువాత ఇతని కుమారులు తిమ్మ జగపతి మరియు బలభద్ర జగపతి పరిపాలించారు.1785 కి పెద్దాపురం రాజ్యము అటు తోటపల్లి నుంచి ఇటు నగరం వరకు మొత్తం 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లింది. 1791 నుంచి 1804 వరకు వత్సవాయి రాయ జగపతి పరిపాలించెను. రాయ జగపతి మరణాంతరం, ఆయన ముగ్గురు భార్యలు అయిన లక్ష్మీ నరసయమ్మ, బుచ్చి సీతయమ్మ మరియు బుచ్చి బంగారయమ్మలు పెద్దాపురం సంస్థానమును ఒకరి తరువాత ఒకరు పరిపాలించిరి. రాయ జగపతి రెండవ భార్య అయిన బుచ్చి సీతయమ్మ 1828 నుంచి 1835 వరకు పాలించెను. ఈవిడ రెండు ధర్మ సంస్థలు( ట్రస్టులు), ఒకటి పెద్దాపురంలోను, మరియొకటి కత్తిపూడిలోను ప్రారంభించెను. ఈ రోజుకి కూడా అక్కడ పేదవారికి రెండు పూటలా అన్నదానం చేయబడుతున్నది.

వత్సవాయి మహారాజు యొక్క ఆస్థానంలో ఏనుగు లక్ష్మణకవి మరియు వేదుల సత్యనారాయణశాస్త్రి పోషించబడ్డారు. తరువాత వారసులు లేకపోవటం చేత, 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించే వరకు, సూర్యనారాయణ జగపతి బహదూర్ ఏలిక సాగించెను. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురం ను రెవిన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు మరియు లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురం నిర్మించారు.

పాలనా క్రమము[మార్చు]

సాహిత్యంలో పెద్దాపురం[మార్చు]

పెద్దాపుర సంస్థానం ను నేపథ్యం గా తీసికొని, వడ్లగింజలు పేరుతో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఒక చక్కని నవల (లేదా పెద్ద కథ) వ్రాశాడు. చదరంగం ఆటలో పెద్దాపుర సంస్థానాధిపతి ఉద్దండుడనీ, తనతో ఆడి గెలిచిన వారిని సన్మానిస్తాననీ, ఓడిన వారి తల తీయిస్తాననీ ప్రకటిస్తాడు. ఒక పేద భ్రాహ్మణుడు రాజుతో ఆటకు అనుమతి కోసమే రకరకాల గమనాలు చేసి, ఆటలో రాజును ఓడించి, అందులోనూ విన్యాసాలు చూపించి, చివరకు ఘనసన్మానం పొందడం ఇందులోని కథ.

పెద్దాపురం మహరాజు దర్శనం కోసం శంకరప్ప కోటకు చేరుకుంటాడు. పేద బ్రాహ్మడయిన శంకరప్పకి కోటలోకి ప్రవేశం లభించదు. ఠానేదారు, దీవాంజీలు శంకరప్పకి కోటలోకి అనుమతి లభించకుండా అడ్డుపడి వీధిలోకి గెంటేస్తారు. దిగులుతో సత్రానికి చేరుకున్న శంకరప్పని చూసి పేదరాసి పెద్దమ్మ ఓదారుస్తుంది. మహరాజు దర్శనం సంపాదించడానికి ఉపాయం చెప్తుంది. ముందు పట్టణంలో పేరు తెచ్చుకుని తద్వారా మహరాజు దర్శనం సంపాదించమని హితబోధ చేస్తుంది. శంకరప్పకి జ్ఞానోదయం కలిగి ఊరి మీద పడతాడు.

అంచెలంచలుగా పెద్దాపురంలోని చదరంగ ప్రావీణ్యులనందరినీ ఓడించి, తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఊరిలో శంకరప్ప పేరు మారు మ్రోగుతుంది. ఈ వార్త చివరికి మహరాజుని చేరి, శంకరప్ప గురించి వాకబు చేస్తాడు. శంకరప్ప చదరంగ ప్రావీణ్యం గురించి తెలుసుకుని తనతో ఆడవలసిందిగా కబురు పంపుతాడు.పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని శంకరప్ప పల్లకీలో కోటకు వెళ్ళి మహరాజుతో చదరంగం ఆడడానికి సిద్ధపడుతాడు. ఆటలో తను గెలిస్తే చదరంగంలో మొదటి గడిలో ఒక వడ్ల గింజ, రెండో గడిలో రెండు వడ్ల గింజలు, మూడో గడిలో నాలుగు వడ్ల గింజలు ఇలా చదరంగంలోని అన్ని గడులలో గింజలు రెట్టింపు చేసుకుంటూ ఇవ్వాలని కోరుతాడు.

చదరంగం ఆటలో మహరాజు శంకరప్పని ఓడించాడా? లేక శంకరప్ప గెలిచి తను కోరుకున్న వడ్లగింజలని రాజు దగ్గర నుండి అందుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే

వెంకట సింహాద్రి రాజు గారికి అంకితం ఇవ్వబడిన కువలయామోదం అనే అలంకారిక గ్రంథం నందు పెద్దాపురం ప్రభువుల పండితపోషణ ఈవిధంగా వర్ణించబడినది.

'శ్రీ రత్నాకర మేఖలావలయిత భ్రాజన్మహీమండలీ
నానా స్థాన సరోరు నాయక మహా రత్నం సముల్లాషితం
శ్రీ పెద్దాపుర భావ్యనామక మహాసంస్థాన మాసిర్భుధై
శ్లాఘ్యం సత్కవి మండలైర్విలసితమ్ సంసేవితమ్ రాజభిఁ'

పెద్దాపురాధీశుల కవి పండితపోషణ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర 12వ సంపుటం పేజీ.214

బయటి లింకులు[మార్చు]