Jump to content

ఈశాన్యం

వికీపీడియా నుండి
ఎనిమిది దిక్కుల సూచిక.

ఈశాన్యం (Northeast) తూర్పుకి, ఉత్తరానికి మధ్యన ఉన్న ఒక దిక్కు.

నానార్థాలు

[మార్చు]

అపరాజిత, ఉత్తరపూర్వ, కడకడ, దేవమూల, నీరాళ్లగొంది, పూర్వోత్తర, ప్రాగుదీచి, శార్వి, శాలాక్ష, శిశుమారశిరస్సు. అనే అర్థాలున్నాయి.[1]

వాస్తు శాస్త్రం

[మార్చు]

గృహనిర్మాణంలో ఈశాన్య మూలకు విశేష ప్రాముఖ్యం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని.. ఈ మూల పెరిగడం ద్వారా శుభఫలితాలుంటాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ఈశాన్యం పెరిగిన స్థలంలో నివసించే వారికి సకలసంపదలు, విద్య, వినోద పాండిత్యాలు చేకూరుతాయి. ఈశాన్య మూల స్థలం తగ్గితే అరిష్టం. ఈశాన్యం దిశ పవిత్రమైన దిశగా వాస్తు పేర్కొంటోంది. అందుకే ప్రధాన గృహానికి ఈశాన్య భాగంలో పూజగదిని నిర్మించడం సంప్రదాయం. ఈశాన్య మూలను పూర్తిగా మూసివేసినట్టు గదులుగాని, శాలలు గానీ ఏవిధమైన కట్టడాలు నిర్మించకూడదు. ఈశాన్యంలో మరుగుదొడ్ల ఏర్పాటు అసలు కూడదు. అంతేగాకుండా చెట్లు, పూలమొక్కలు గానీ ఈశాన్యదిశలో వేయకూడదు.[2] ‘ఈశాన్యం భాగం ఈక బరువును కూడా మోయ కూడదు’ అంటారు. అంటే అంత తక్కువ బరువు కూడా ఆ దిశలో వుంచకూడదని అర్థం.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
  2. SELVI.M. ""ఈశాన్యం" ఎంత పెరిగితే అంత మంచిది". telugu.webdunia.com. Retrieved 2020-07-05.
  3. chj. "'ఈశాన్యం భాగం ఈక బరువును కూడా మోయకూడదు'... మరి మొక్కలెక్కడ పెట్టాలి?". telugu.webdunia.com. Retrieved 2020-07-05.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈశాన్యం&oldid=3050449" నుండి వెలికితీశారు