బిక్కవోలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బిక్కవోలు
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో బిక్కవోలు మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో బిక్కవోలు మండలం యొక్క స్థానము
బిక్కవోలు is located in ఆంధ్ర ప్రదేశ్
బిక్కవోలు
బిక్కవోలు
ఆంధ్రప్రదేశ్ పటములో బిక్కవోలు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°57′00″N 82°03′00″E / 16.9500°N 82.0500°E / 16.9500; 82.0500
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము బిక్కవోలు
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,277
 - పురుషులు 34,695
 - స్త్రీలు 35,582
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.15%
 - పురుషులు 68.66%
 - స్త్రీలు 57.73%
పిన్ కోడ్ 533343
బిక్కవోలు
—  రెవిన్యూ గ్రామం  —
బిక్కవోలు వద్ద పొలాలలో ఉన్న పురాతన శివాలయం
బిక్కవోలు వద్ద పొలాలలో ఉన్న పురాతన శివాలయం
బిక్కవోలు is located in ఆంధ్ర ప్రదేశ్
బిక్కవోలు
బిక్కవోలు
అక్షాంశరేఖాంశాలు: 16°57′00″N 82°03′00″E / 16.9500°N 82.0500°E / 16.9500; 82.0500
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం బిక్కవోలు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 14,095
 - పురుషుల సంఖ్య 6,928
 - స్త్రీల సంఖ్య 7,167
 - గృహాల సంఖ్య 3,432
పిన్ కోడ్ 533 343
ఎస్.టి.డి కోడ్

బిక్కవోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము. పిన్ కోడ్: 533 343.

ఇది సమీప పట్టణమైన సామర్లకోట నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4133 ఇళ్లతో, 14278 జనాభాతో 1966 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6999, ఆడవారి సంఖ్య 7279. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2202 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 308. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587530[2].పిన్ కోడ్: 533343.

ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మాద్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ వూరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వరి ఆలయం మరియు శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి. బిరుదాంకితుడనే రాజు పరిపాలించుటవలన ఈ గ్రామాన్ని బిరు దాంకితవోలుగా పిలిచేవారనియూ, కాలక్రమేణా అది బిక్కవోలుగా మార్పు చెందిందని మరియొక కథనం. [1]

విషయ సూచిక

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.

సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అనపర్తిలోను, ఇంజనీరింగ్ కళాశాల కాకినాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కాకినాడలోను, పాలీటెక్నిక్‌ రాజమండ్రిలోను, మేనేజిమెంటు కళాశాల అనపర్తిలోనూ ఉన్నాయి.

సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొమరిపాలెంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కాకినాడలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

బిక్కవోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో0 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.

తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

బిక్కవోలులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి.

లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

బిక్కవోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 432 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1534 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 49 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1485 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

బిక్కవోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 1054 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 200 హెక్టార్లు
 • చెరువులు: 214 హెక్టార్లు
 • ఇతర వనరుల ద్వారా: 16 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

బిక్కవోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

జన విస్తరణ[మార్చు]

జనాభా (2011) - మొత్తం 70,277 - పురుషులు 34,695 - స్త్రీలు 35,582

2001 జనాభా లెక్కల ప్రకారం బిక్కవోలు జనాభా 14,095.[3] ఇందులో మగవారు 49%, ఆడువారు 51%. సగటు అక్షరాస్యత 70%. ఇది దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే మెరుగు. అక్షరాస్యత మగవారిలో 75%, మరియు ఆడువారిలో 66%.పురుషుల సంఖ్య 6,928, మహిళల సంఖ్య 7,167, గ్రామంలో నివాస గృహాలు 3,432 ఉన్నాయి.

వ్యవసాయ వనరులు[మార్చు]

 1. బిక్కవోలు అనపర్తి నియోజకవర్గంలోనికి వస్తుంది. మొత్తం ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి అవి అనపర్తి, బిక్కవోలు,పెదపూడి,రంగంపేట

ఇక్కడ రైతులు వ్యవసాయ రీత్యా నీటికోసం గోదావరి నుండి వస్తున్న కాలువపై ఆధారపడతారు. కానీ వేసవికాలంలో అదికూడా ఎండి పోతే ఊరికి చివర ఉన్న "లింగాలచెరువు"[1] పై ఆధారపడతారు. ఇది వీర్రాజుపేటకు 1కి.మి. దూరంలో ఉంది. దీనిలో నీరు అయిపోయేటప్పటికి జూలై నెల వస్తుంది కాబట్టి నీటి కొరత తగ్గి పంటలు పుష్కలంగా పండుతాయి.

సంస్కృతి[మార్చు]

పురాతనమైన, చారిత్రికమైన జైన శివ ఆలయాలకు, వాటిలోని శిల్పకళా సంపదకు బిక్కవోలును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును.

శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయ గోపురం

శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం[మార్చు]

గోలింగేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో శిలలపై చెక్కబడిన రచనలు ముఖ్యమైనవి. గర్భగుడి ద్వారం jambs పైన 33 లైనుల శాసనం చెక్కబడి ఉంది. ముఖమంటపంలో తూర్పు చాళుక్యులనాటి రెండు చక్కని శిల్పాలు భద్రపరచబడి ఉన్నాయి. వీటిలో ఒకటి "ఆలింగన చంద్రశేఖర మూర్తి"గా శివపార్వతుల శిల్పం. మరొకటి కూర్చొని ఉన్న గణేశ ప్రతిమ. ఇవి రెండూ శిల్పకళానైపుణ్యానికి ప్రతీకలు. (PI.XX and XXI). ఆలయం పైని విమానం ఒడిషా, ఖజురాహోల శైలిని గుర్తు తెస్తుంది.

శ్రీ రాజరాజ ఆలయం[మార్చు]

మూడు ప్రక్కలా ఉన్న గూడు (విగ్రహ మందిరం)లలో ఒక చోట వినాయకుడు, మరొకదాన్లో నెమలిపై ఆసీనుడైన కార్తికేయుడు, మరొక చోట మహిషాసుర మర్దినిగా అమ్మవారు మరియు శ్రీరాజరాజేశ్వరీ సమేతులైన శివలింగాకృతి ఉన్నాయి.

శ్రీ చంద్రశేఖర స్వామి[మార్చు]

శివలింగానికి నాలుగు ప్రక్కలా అందమైన చంద్రశేఖరస్వామి, బాల త్రిపురసుందరి శిల్పాలున్నాయి.

ఏక శిలా గణేశుడు[మార్చు]

11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది. కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి సాతలూరులో లభించిన గుణగ విజయాదిత్యుని ముద్రికపై ఈ విధమైన గణేశమూర్తి, మరోవైపు లక్ష్మీదేని మూర్తి ఉన్నాయి. ఈ ముద్రిక ఇప్పుడుచెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

ఏకశిలా వినాయకుడు

1వ శివాలయం[మార్చు]

గ్రామం శివారులలో ఉన్న శివాలయం మిగిలిన శివాలయాలలాగానే మూడు ప్రక్కల గూడులతో, మకర తోరణాలంకరణతో ఉంది. ఈ శిల్పాలలో ఒక నటరాజమూర్తి చతురభంగిమలో ఉన్నాడు. ఇక్కడ కనిపించే మరొక విశేషం - శివుడు లకులీశునిగా చూపబడడం (లకులీశ, లేదా నకులీశ̲ అనేది పాసుపతత శైవాన్ని బోధించిన గురువు. శివుని ప్రతిరూపంగా వారిచే ఆరాధింపబడ్డాడు. [4] తూర్పు గాంగగుల నాటిదైన ముఖలింగంలో కూడా దక్షిణామూర్తి లకులీశునిగా చూపబడ్డాడు.

2వ శివాలయం[మార్చు]

పంట పొలాలలలో ఉన్న పెద్ద ఆలయం. ద్వారానికిరువైపులా ద్వారపాలకులు, గుమ్మంపైన లక్ష్మీదేవి విగ్రహాలు తప్ప ఈ ఆలయంలో శిల్పాలు లేకుండా సాదాగా ఉంటుంది.ఆలయం విమానం పల్లవుల కాలపు నిర్మాణశైలిని పోలిఉంటుంది.

3వ శివాలయం[మార్చు]

ఈ ఆలయం ద్వారానికిరువైపులా గంగ, యమున నదీదేవతల విగ్రహాలున్నాయి. మందిరం పై భాగంలో మైదునం వంటి పలు భంగిమలు చెక్కబడి ఉన్నాయి. సూర్య, విష్ణు విగ్రహాలు గోలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాలను పోలి ఉన్నాయి.

ఉత్సవాలు[మార్చు]

ప్రయాణ, ఇతర వసతులు[మార్చు]

బిక్కవోలు రైలు సముదాయము
బిక్కవోలుకు విరివిగా బస్సు సౌకర్యము కలదు

బిక్కవోలులో రైల్వే స్టేషను, బస్సు స్టేషను, పోస్టాఫీసు, తి.తి.దే.వారి కళ్యాణ మంటపం, ప్రభుత్వ ఆసుపత్రి, మండల ఆఫీసు, అగ్నిమాపక కార్యాలయం, టెలిఫోను ఆఫీసు, సినిమా హాళ్ళు, బ్యాంకులు, ఆలయాలు, రైసు మిల్లులు, పాఠశాలలు, పెట్రోలు పంపులు వంటి పలు వసతులున్నాయి. బిక్కవోలుకు దగ్గరగా ఉన్న గ్రామాలు ఊలపల్లి, జి.మామిడాడ, అనపర్తి, బలభద్రపురం, పెదపూడి, ద్వారపూడి, సంపర, పెదబ్రహ్మదేవం, కొమరిపాలెం

రాజమండ్రినుండి (39 కి.మీ.), కాకినాడ (31 కి.మీ.) నుండి బిక్కవోలుకు తరచు బస్సు సౌకర్యం ఉంది. బిక్కవోలుకు దగ్గరగా 35కి.మి. దూరంలో మదురపూడి విమానాశ్రయం ఉంది. బిక్కవోలుకు 10కి.మీ. దూరంలో సామర్లకోట రైల్వేజంక్షన్ కలదు ఇక్కడి నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన రైళ్ళు మరియు కాకినాడ వెళ్ళవలసిన రైళ్ళు విడిపోతాయి. ఇది దక్షిణమధ్యరైల్వే క్రిందకు వస్తుంది

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఇతర చారిత్రక విషయములు[మార్చు]

బిక్కవోలు ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు 52 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనీ 1960 లో నిర్మించారు ఇప్పటికీ ఈ పాఠశాలలోని 1960నాటి తరగతులు బీటలువారి కనిపిస్తాయి. కానీ ముందు ముందు రాబోయే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అధికారులు నూతన భవనాలను నిర్మించారు. ఇదే పాఠశాలలో చదువుకొని ఎంతో మంది ఉన్నత పదవులలో ఉన్నారు ఉదాహరణకు డా.టి. పోతరాజు గారు ఈయన బిక్కవోలు గ్రమ ప్రజలకు అందిస్తున్న సేవలు కొనియాడ దగినవి.

మూలాలు, వనరులు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". 
 3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
 4. Keerimalai Nakulisa or Lakulisa was the first preceptor of the Pasupata school of Saivism, which was the earliest among the sects of Saivism. The word pasupata should be pronounced as paa'supatha. Originating from Gujarat, the sect spread across the sub-continent and even beyond in historical times. The sect doesn’t exist today. The priority given to Guru (preceptor and initiator) in the fundamentals of Saiva Siddhanta (Guru, Linga, Sangama) and the idea that a Guru is Siva himself originated from the Pasupata teachings. The iconographic representations of Lukulisa which was synthesized with Buddha in his teaching position in some parts of South Asia, was synthesized into Siva in the form of a teacher (Thadchanaamoorthi ) in South India. The names Nakulisa and Lakulisa have come from the words nakula or lakula, which stood for the staff (the long stick displayed as a symbol of asceticism) of the preceptor.

బయటి లింకులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బిక్కవోలు&oldid=2359452" నుండి వెలికితీశారు