కొవ్వూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ మండలానికి చెందిన ఇదే పేరు గల గ్రామము.[1] కోసం కొవ్వూరు (కాకినాడ గ్రామీణ మండలం) చూడండి.

  ?కొవ్వూరు మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
గోదావరి నది కొవ్వూరు ఒడ్డున
గోదావరి నది కొవ్వూరు ఒడ్డున
పశ్చిమ గోదావరి జిల్లా పటములో కొవ్వూరు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో కొవ్వూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°00′14″N 81°43′32″E / 17.003933°N 81.725579°E / 17.003933; 81.725579
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము కొవ్వూరు
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 15
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
7,293 (2011 నాటికి)
• 3660
• 3629
• 70.81
• 75.0
• 66.63


కొవ్వూరు రైల్వే స్టేషను
కొవ్వూరు బస్ స్టాండ్

కొవ్వూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు చిన్న పట్టణము.

ఇది మండల కేంద్రమైన కాకినాడ (Rural) నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కాకినాడ నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1806 ఇళ్లతో, 7293 జనాభాతో 325 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3664, ఆడవారి సంఖ్య 3629. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1278 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 137. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587501[2].పిన్ కోడ్: 533016.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో కొవ్వూరు ఒకటి. చారిత్రక మరియు సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రి (రాజమండ్రి)కి ఆవల ఒడ్డున ఉన్నదే కొవ్వూరు. భారతదేశంలోని జీవనదులలో ఒకటైన గోదావరి కొవ్వూరు మీదుగా ప్రవహించి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. కొవ్వురు పట్టణం గోదావరి నది తీరాన ఒక సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా. పుష్కర సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి ఇక్కడ నుండే రైలు-రోడ్డు వంతెన మరియు గోదావరి నది పై నిర్మితమైన కొత్త రైలు వంతెన ప్రారంభం అవుతాయి.

పౌరాణికాంశాలు[మార్చు]

నేటి కాలంలో కొవ్వూరుగా ప్రసిధ్దమైన ఈ పుణ్యక్షేత్రం గోవూరు లేక గోష్పాద క్షేత్రంగా పిలువబడేది. గోదావరీ తీరాన ఉన్న 'గోపాదాల రేవు' ఆశేష జన సందోహాన్ని ఆకర్షిస్తుంది.గౌతమ మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్టు పురాణగాధలు వివరించాయి.

పూర్వము ఒకసారి పదిహేను సంవత్సరాలు వర్షాభావంతో కరువు సంభవించింది.చాలామంది ప్రజలకు,మునులకు ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రమే సుభిక్షంగా ఉందని తెలిసింది. గౌతమ మహర్షి గాయత్రీ దేవిని ప్రార్థించగా ఆమె కృపతో ఒక రోజులో ఎంతమందిని అయినా పోషించగల బంగారు పాత్ర పొందగలిగాడు. తన తపో శక్తి మరియు గాయత్రీ మాత అనుగ్రహంతో ఉదయం పొలంలో విత్తనాలు చల్లితే సంధ్యా సమయానికి పంట వచ్చేది. గౌతమ మహర్షి ఆశ్రమం ఒక్కటే కరువు లేకుండా ఉండటం ఒర్వలేని ఇతర మునులు అసూయ చేత ఎ విధముగా అయినా భంగం చేయవలెనని తలచి ఒక మాయా గోవును సృష్టించి గౌతమ మహర్షి పొలం లోకి పంపినారు. మహర్షి ఆ సమయంలో ధ్యానంలో ఉన్నారు. అలికిడికి కళ్ళు తెరిచి చూడగా గోవు పంట తినుచున్నదని గ్రహించి దర్భతో అదిలించారు. మాయాగోవు కావున అది కొంచెం దూరం పారిపోయి వేదన అనుభవించి మృతి చెందెను. గోహత్యాపాతకం పోవాలంటే పవిత్ర గంగానదిని ప్రవహింపచేయాలని అందరు నిశ్చయించారు. గౌతమ మహర్షి తపస్సు చేసి మహా శివుని అనుమతితో గంగను తీసుకొని వచ్చాడు. గంగను విడుచునప్పుడు మహా శివుని షరతు ఏమనగా గౌతముడు వెనుతిరిగి చూడరాదు. అఖండ గోదావరి నాశిక్, త్రయంబకేశ్వరం నుంచి బాసర, ధర్మపురి,భద్రాచలం మీదుగా గోవూరులో ప్రవేశించింది. గౌతముడు నీటి శబ్దం వినిపించుటలేదు అని వెనుతిరిగి చూడగా ఆ ప్రదేశంలో అఖండ గోదావరి పాయలుగా విడిపోయింది.

దేవి పురాణం ప్రకారం, పార్వతి దేవి సవతి పోరుని దూరం చేసుకొనుటకు ఒక మాయా ఆవుని సృష్టించి తపమాచరించుచున్న గౌతమ మహర్షి దగ్గరకి పంపగా తపోభంగం కలిగిన మహర్షి ఆ అవును తన తపశ్శక్థితో ధగ్దం చేశాడు. గోహత్యాపాతకం తనకంటకండా ఉండాలంటె దివి నుండి గంగను తీసుకువచ్చి ఆ గోవు మరణించిన ప్రదేశంలో ప్రవహింపచేయాలని చెప్పిన పార్వతి దేవి ఆనతి మేర గౌతమ ఋషి తపస్సు చేసి గంగమ్మను దివి నుండి భువికి తెప్పించాడు. ఆ హిమగంగ పారిన ప్రదేశమే గోష్పాద క్షెత్రంగా, ఆ గంగే గౌతమి (గోదావరి) గా ప్రసిద్ధి చెందాయి. మరణించిన గోవును గోదావరి నదీ ప్రవాహంతో పునరుజ్జీవితుల్ని చేశారు.[3]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

కొవ్వూరు పేరు బ్రిటిషు వారు భారత దేశాన్ని పాలించడానికి మునుపు గోవురు అది కాల క్రమముగా కొవ్వూరుగా మారింది. గోదావరి నది పుట్టడానికి సంబంధించిన ఇతిహాసం గ్రామానికి సంబంధించిన ఇతిహాసం ఉంది. గోవు సంచరించిన ప్రాంతం గోవూరు అయింది. కాలక్రమంలో కొవ్వురుగా పిలువపడుచున్నది. పశువు వేదన పడిన ప్రదేశం "పశువేదన"గా పేరు, కాలక్రమంలో అది "పశివేదల"గా రూపాంతరం చెందింది. అఖండ గోదావరి పాయలుగా విడిపోయిన ప్రాంతం విగ్నేశ్వరంగా పేరు. కాలక్రమంలో విజ్జేశ్వరంగా పిలువపడుచున్నది.[3]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.

సమీప బాలబడి కాకినాడలో ఉంది.

సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కాకినాడలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కాకినాడలో ఉన్నాయి.

సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కొవ్వూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కొవ్వూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.

ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి  గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కొవ్వూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 87 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 238 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 238 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కొవ్వూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 238 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

కొవ్వూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

మండల గణాంకాలు[మార్చు]

ముఖ్య పట్టణము కొవ్వూరు
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 15
జనాభా

• మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ 7,293 (2011) • 3660 • 3629 • 70.81 • 75.0 • 66.63

మండల గణాంకాలు[మార్చు]

ప్రముఖులు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

అంతేకాకుండా కొవ్వూరులోనే చాలా పురాతనమైన విద్యాపీఠము ఆంధ్రగీర్వాణవిద్యాపీఠము. ఇది 1902లో నిర్మింపబడింది. ఈ ఆంధ్రగీర్వాణవిద్యాపీఠమునందు శ్రీ వాడ్రేవుజోగమ్మవేదసంస్కృతకళాశాల మఱియు శ్రీమావులేటిసోమరాజుసంస్కృతోన్నతపాఠశాలలు ఇప్పటికి నడుపబడుచున్నవి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

కొవ్వూరు నుండి రాజమండ్రి వరకు గోదావరి పై కట్టిన మూడు వంతెనలు ఇక్కడి ప్రత్యేకత. సుమారు నూరు సంవత్సరాల క్రితము సర్. ఆర్థర్ కాటన్ కట్టించిన రైలు వంతెన ఇప్పటికి చెక్కుచెదరకండా ఉండటం విశేషం. పన్నెండు వత్సరములకొక సారి వచ్చే గోదావరి పుష్కరములందు దేశపు నలుమూలల నుండి ఆశేష భక్తజనం ఈ గోష్పాద క్షేత్రమును దర్శించి, పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిస్తారు.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

దృశ్యమాలిక[మార్చు]

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". 
  3. 3.0 3.1 బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి ‘వేంగీ విషయం’లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.  Check date values in: |date= (help)"https://te.wikipedia.org/w/index.php?title=కొవ్వూరు&oldid=2236783" నుండి వెలికితీశారు