Jump to content

శిల్పం

వికీపీడియా నుండి
పోతపోసిన నటరాజు శిల్పం.

శిల్పం అంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ. ఇవి నల్ల రాళ్ళా తోనూ పాలరాళ్ళతోనూ చేస్తారు. దేవతా మూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులు మొదలైనవి శిల్పాలలో చోటు చేసుకుంటాయి. శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమావిద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని 'స్తపతి' లేదా 'శిల్పి' అంటారు. రాతి యుగంలో లిపి బొమ్మలను చెక్కడంద్వారా ఆరంభం అయింది. మనుష్యులు పరిణితి చెందుతున్న ప్రారంభంలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు.

మతాలలో శిల్పాల ప్రాధాన్యత

[మార్చు]

అంతర్జాతీయంగా అనేక విషయాలకు చెందిన ప్రముఖులు శిల్ప కళలో చోటుచేసుకున్నా భారతదేశంలో మాత్రం పురాణదృశ్యాలు, దేవతలూ, రాజకుటుంబాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. నవీనకాలంలో రాజుల స్థానంలో రాజకీయ నాయకులు, కవులు పలురంగాలలో ప్రముఖులు శిల్పాలలో చోటు చేసుకోవడం విశేషం. చెన్నైలో సముద్ర తీరంలో స్థాపించిన ఉళైప్పాళీ (శ్రమజీవి) శిల్పం అధినిక శిల్పసైలికి ఒక ఉదాహరణ. దక్షిణ భారతంలో ఆలయశిల్పాలే అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక్కడి శిల్పాలు అనేకంగా నల్లరాతితో చేయడం విశేషం. హిందూ సంప్రదాయంలో విగ్రహారాదనకు ప్రాధాన్యం అధికం కనుక ఆలయాలలో శిల్పకళకూ అత్యంత ప్రాధాన్యత నిస్తాయి. ఆలయ కుడ్యాలు, ఆలయ స్తంభాలు, ఆలయ గోపురాలు, పైకప్పు కూడా చెక్కిన రాతిబొమ్మలతో అలంకరించి ఉన్నాయి. ఇవన్నీ గర్బగుడిలో ఉన్న ప్రధాన దేవత యొక్క పురాణదృశ్యాలతో నిండి ఆనాటి కథలను చెప్తుంటాయి.

ఆలయాలు శిల్పాలు

[మార్చు]

ఆలయాలలో శిల్పాలు శాస్త్రీయమైన పద్ధతిలోనే స్థాపిస్తారు. ఆయా మతాలను అనుసరించి శిల్పాలూ విభిన్నంగా ఊంటాయి. హిందూ ఆలయాలలో శిలలను చెక్కాడానికి ఆగమశాస్త్రాన్ని అనుసరించి చేస్తారు. శాత్రీయరీతిలో చెక్కిన శిపాలే పూజకు అర్హమని హిందువుల విశ్వాసం. హిందూ ఆలయాలలో చెక్కిన శిల్పాలను మూడు తరగతులుగా విభజిస్తారు. మూల ప్రతిమలు, పార్శ్యదేవతలు, పరివార దేవతలు. మూలదేవతలంటే ఆలయానికి మూలమైన దేవత. ఈ దేతతకు ప్రాణ ప్రతిష్ఠ, ఆవాహనల ద్వారా అచంచల శక్తిని కలిగించి తరువాత ఆరాదించడం ఆరంభిస్తారు. పార్శ్యదేవతలంటే ఆయాదేవతలకు అత్యంత ముఖ్యులు. ఉదాహరణగా శివునికి వినాయకుడు, పార్వతి, కుమారస్వామి, నంది అలాగే రామునికి హనుమంతుడు, విష్ణువుకి గరుత్మంతుడు పార్శ్యదేతలే. అలాగే వినాయకుడికి శువుడు, కుంఆరస్వామి, పార్వతి పార్శ్యదేవతలు అవుతారు. పరివార దేవతలు అష్టదిక్కులలో నివసించే దేవతలు పరివార దేవతలు.
ఈ ప్రతిమలను మూడు బింబాలుగా విభజిస్తారు. పూర్ణబింబం, అర్ధబింబం, అభాసబింబం అభాస బింబం. పూర్ణ బింబం అంటే ముందు వెనుక కచ్చితమైన ప్రంఆణంతో చెక్క బడినవి ఇవి అన్నిటికంటే మైనవి. వీటిని పూజిస్తే ఉత్తమ ఫలితాలనందిస్తాయని విశ్వాసం. అర్ధ బింబాలంటే ముందు వైపు చెక్కబడి వెనుక వైపు చదరంగా ఉండేవి వీటిని పూజిస్తే ఫలితం మధ్యమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. అభాస బింబాలంటే చిత్రంగా చెక్క బడినవి, చిత్రాలు వీటిని వీటిని పూజిస్తే సంతృప్తికరమైన ఫలితం ఉండదని విశ్వాసం.
ఆలయంలోగర్భ గృహంలో ఉండే విగ్రహాన్ని మూల విగ్రహం అంటారు. వీటిని మూల బింబం, మూలవిగహం అంటారు. ఇలాంటి విగ్రహాలను స్థపతి శాస్త్రీయంగా సమగ్రహంగా పరిశీలించి ఎన్నిక చేస్తాడు.

వాస్తు శిల్ప శాస్త్రాలు

[మార్చు]

భారతీయ వాస్తుశిల్పము కళగా పరిగనింపబడింది. కళ అనగా అంశము. '''క''' కారము బ్రహ్మ వాచక మగుటవలన సృష్టిని, '''ల''' కారము లయమును సూచించుచున్నందున కళకూడా సృష్టి, స్థితి, లయ రూపమైనది.64 కళలులో 38 వ కళ '''వాస్తువిద్యా'''. అనంతాంధకార కాల గర్భమున దాగియున్న ప్రాచీన వాస్తువిజ్ఞానమును దర్శించుటకు జ్ఞానజ్యోతిలవలె అపౌరుషమైన వైదిక సాహిత్యము, పురాణము అగు శిల్పశాస్త్రములు ఇంకనూ మిగిలిఉన్నవి. అందువలన నేటికిని నష్టావిశిష్టములైన ప్రాచీన నిర్మాణములు మన కళావిశిష్టత నెలుగెత్తి చాటుచున్నవి.భారతీయ వాస్తు విజ్ఞానము ముత్కృష్ణమైనది; ఉదాత్తమైనది. మన ఆధ్యాత్మిక వికాసమున కనుగుణముగా ఆయాప్రయోజనములతో కూడిన ఆరాధనలు, ఉపాసనలు, వానికి తగిన దేవతలు, దేవాగారములు వెలసినవి. ప్రపంచ వాజ్మయమున ప్రాచీనమగు చతుర్వేదాలు ఉపనిషత్తు లయందు దేవమూర్తులు, దేవాగారములు, పూజలు ప్రస్తావించబడినవి.వేదకాలమునందు జనులు గూహలలో కాక సుందరహర్మయములలో నివసించారు అని అథర్వణ వేదం చెప్పుచున్నది.వేదములలో రాజులకు ప్రాపదములను, రాజోద్యోగులకు శాలా హర్మ్యములు ఉండినట్లు తెలియుచున్నది. తైత్తిరీయోపనిషత్తు బ్రాహ్మణమున ఒక బ్రాహ్మణ గృహ వర్ణన ఉంది. అగ్నిశాలలు, శ్మశానవాటికల నిర్మాణములు, శిలా ఫలకములపై గీయబడిన చిత్తరువుల, విగ్రహముల ప్రస్తావన తెలుపబడింది. అప్పటికే వాస్తు శిల్ప అభివృద్ధి జరుగుచుండెడను. ఋగ్వేదం న 1000 ద్వారములు గల ఒక రాజు ప్రస్తావించబడినాడు.7 మిత్రావరుణులు 100 స్తంభములు, 100 ద్వారములు గల భవనముల నాక్రామించుకిని ఉండిరి.

వేదవాజ్మయము తరువాతి కాలమున సింధు లోయ నాగరికత అను వ్యవహరించబడుచున్న మొహంజో-దారో హరప్పా త్రవ్వకాలలో బయల్వడిన ప్రాచీన నగరశిథిలములు, దేవప్రతిలు ఇవి భారతీయ వాస్తిశాస్త్రోత్కృష్ణకు ప్రబల నిదర్శనములై ఉన్నాయి.శ్రీ వినోద విహారరాయ్ వేదరత్న అను వంగదేశీయ విద్వాంసుడు '''హరప్పా''' ఋగ్వేదమున ప్రస్తావించబడిన '''హరియప్రియ''' అన్య్ ఆర్యనగరమని అచటి అవశేషములను వేదమంత్రములతో సమంవయించి నిరూపించారు.

కావ్యములకంటే పురాణ వాజ్మయమున వాస్తువిశేషములు చాలవివరించబడినవి. పురాణములులో తొమ్మిది పురాణములు వాస్తులక్షణములను శాస్త్రీయముగా దెపిలి తరువాత వచ్చిన శిల్పశాస్త్రములకు తగిన సామగ్రి నందించినవి. మత్స్య పురాణము న 252, 255,256 258,262, 253,269,270 అధ్యాయములలోను, గరుడ పురాణం లోని 45,46,47, 48 అధ్యాయములలోను, స్కాంద పురాణము న మహేశ్వరఖండలో 24 వ అధ్యాయము, వైష్ణవఖండలో 25వ అధ్యాయములోను, నారద పురాణము న 13 వ అధ్యాయమునను, బ్రహ్మాండ పురాణము న 7వ అధ్యాయమునను, భవిష్య పురాణం న 12,130,131,132 వ అధ్యాయములలో, వాయు పురాణము న 39 వ అధ్యాయమున, అగ్ని పురాణము న 42 నుండి 60, 104, 105 వ అధ్యాయములలో వాస్తు శిల్ప విషయములు ప్రస్తావించబడినవి.

సుప్రసిద్ధ వరాహమిహిరుడు విశ్వకోశమందగిన బృహత్సంహితలో 53 (వాస్తువిద్యా), 56 (ప్రాసాదలక్షణం), 57 (వజ్రలేప లక్షణం), 58 (ప్రతిమా లక్షణము) అధ్యాయములను ప్రస్తావించాడు.

పురాణములు ప్రాస్తావికముగ మాత్రమే శిల్ప శాస్త్రమును తడవినవి. శిల్పశాస్త్రమునకు ఆగమములు ఆధారములు.ఇందు శాస్త్రీయ చర్చ ఉంది. ఆగములలో ప్రధాన లక్షణములైన భూపరీక్షా, స్థలపరీక్షా, దిక్సాధన, స్థలపధక, హర్మ్య, ప్రాసాద నిర్మాణపద్ధతులు సప్రమాణముగా నిరూపించబదినవి.ఆగములు వేదతుల్యములు. ఇవి శివోపాసన కుద్దేశించబడినవి. ఇవి మొత్తం 28 అని అంగీకరించబడినవి. వీటిలో ప్రత్యేకముగా గ్రామ, నగర, దేవతా నిర్మాణములకు అవసరమైన వాస్తు లక్షణములు వివరించబడినవి.

ఇవికాక ప్రత్యేక వాస్తుశిల్ప శాస్త్రములు ఉన్నాయి. వీనిలో చాల మట్టుకు వ్రాతప్రతులలో ఉన్నాయి. వీటిని తెలిసినవారు అత్యల్ప సంఖ్యలో కలరు. అనేక గ్రంథములు విదేశీయ గ్రంథాలయములలో భద్రపరచి ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రంథముల పేర్లు: '''మానసారము, వాస్తు విద్యా, శిల్పరత్న, అభిలషితార్ధచింతామణి, సమరాంగణ సూత్రధార, వాస్తురత్నావలీ, ప్రతిమాలక్షణ, ప్రతిమా మాన లక్షణ, రూపమండన, వాస్తుమండన, చిత్రసారము ''. ఇంకా 150 వరకు గ్రంథములు కలవి అను అభిప్రాయము.

వీటిలో '''మానసారము''' సమగ్ర లక్షణములు తెలుపుచూ దేవాలయ గ్రామ నిర్మాణాదికమును వివరించు ఉత్తమ శిల్పశాస్త్రము.ఇందు 70 అధ్యాయములు కలవు.దీనిని పరమ ప్రమాణ గ్రంధముగా భావింతురు.దీనిని రచించనవారు '''మానసారఋషి''' క్రీ, పూ.3 వ శతాబ్దమువాడని అంగీకరించారు.

'''చిత్రసారము''' లోని శిల్పతంత్ర ప్రకరణములో శిల్పశాస్త్ర ద్వాదశ లక్ష గ్రంథాత్మకమని తెలుపబడింది. ఈ 12 లక్షల గ్రంథములను పలువు మహర్షులు విరచించిరి.

ఇంచిమించుగా అన్ని దేవాలయములను మహాశిల్పులు కట్టిరో తెలియుటలేదు. కానీ కొన్నియందు ఉదాహరణకు హోయసాల దేవాలయములలో మాత్రము శిల్పుల పేర్లు కానవచ్చుచున్నది. ఉండవల్లి, బాదామి, అలంపురము మొదలైన క్షేత్రములలో ఆలయమును కట్టిన శిల్పుల పేర్లు మారుపేర్లతొ వ్యవహరించబడినారు. ఇంకా బౌద్ధ, జైన, బ్రాహ్మణ మతములకు సంబంధిచిన ఆలయములు శిల్పకళాదృష్టితో నిర్మించినను నిర్మాతలెవ్వరో నేటికీ ఆజ్ఞాతమే.

భారతీయ శిల్పులలో 4 తెగలు ఉన్నాయి.వీరు బ్రహ్మ సంతతి అని చెప్పుదురు. మహా భారతము న పేర్కొనబడిన దేవశిల్పి విశ్వకర్మ ఈతెగలకు మూలపురుషుడు అని చెప్పెదరు. '''మానసారము''' దీనిని గూర్చి ఈ విధముగా తెలుపు చున్నది: పరబ్రహ్మకు పద్మసంభువుడు పుట్టెను. ఆ సృష్టి కర్తకు 4 ముఖములునుండు విశ్వకర్మమయ, త్వష్ట, మనువు లుద్భవించిరి. వారికే విశ్వకర్మ, విశ్వభూ, విశ్వస్తి, విశ్వప్రష్టలను పేర్లు ఉన్నాయి. విశ్వకర్మ (పూర్వ ముఖోద్భవుడు) ఇంద్రపుత్రికయగు బ్రహ్మసత్వను పెళ్ళియాడెను. మయుడు ( దక్షిణ ముఖోద్భవుడు) రాక్షసపుత్రి క్షత్రియసత్వను పెళ్ళియాడెను. త్వష్ట ( పశ్చిమ ముఖోద్భవుడు) కుబేరపుత్రి వైశ్యసత్వను పెళ్ళియాడెను. మనువు ( ఉత్తర ముఖోద్భవుడు) నలపుత్రి కూద్రసత్వ పెళ్ళియాడెను. ఈ నలుగురు దంపతులకు వరుసగా స్థపతి, సూత్రగ్రాహి, నర్ధకి, తక్షకులను పుత్రులు కలిగిరి. వీరిలో స్థపతి సకలశాస్త్రపారంగతుడైన ప్రధాన పర్యవేక్షకుడు (Chief Architect), వేదవిదుడు; నిర్మాన పధకములను నిర్ణయించువాడు. సూత్రగ్రాహికుడు పధక నిర్మాణ దీక్షితుడు (Draftsman) ; నర్ధకి చిత్రకళా నిపుణుడు; తక్షకుడు వడ్రంగి నిపుణుడు, రాయి, కర్ర, రాగి, బంగార, లోహముల పని చేయుటలో నిపుణుడు. ఈ నాలుగు తెగల శిల్పుల చేతనే, భారతీయ వాస్తుశిల్ప ప్రచారము, గృహ, దేవయాతన, దుర్గ, నగర, వాసీ కూప తటాకాదుల నిర్మాణము కొనసాగినది.

శిల్పకళాశోభితమైన స్తంభాలు

[మార్చు]

వివిధ దేవాలయాలలో స్తంబాలపై వివిధ దేవతా మూర్తులు, యితర కళాకృతులను చెక్కి ఆలయానికి అపురూప శోభకు కల్పిస్తారు.

కోనేరులు - పుష్కరిణులు

[మార్చు]

పైకప్పులో శిల్పకళ

[మార్చు]

భంగిమలు

[మార్చు]

శిల్పంలో భంగిమను మూడువిదాలుగా విభజిస్తారు. స్థానక మూర్తులు, ఆశీన మూర్తులు, శయన మూర్తులు. స్థానక మూర్తులలో ఐదురకాల ఉప భంగిమలుంటాయి. సమపాద స్థానకం, సమభంగం, అతిభంగం, అతి భంగం, అతీదానం. స్థానక భంగిమ అంటే ఏ విధమైన వంపు లేకుండా నిటారుగా నిలిచిన భంగిమ. సమభంగం అంటే పాదాలు తల దగ్గర మాత్రమే వంపు ఉండటం. అతి భంగిమ అంటే తల, పాదాలు, కటి భాగాలలో వంపులు ఉండటం. అభాస భంగిమ అంటే అశాదారణ భంగిమ ఉదాహరణగా నాట్యం, తాండవం, లాస్యమూర్తులు.ఆశీనభంగిమ ఆంటే కూర్చున్న మూర్తులు యోగముద్ర, తపో ముద్ర, పద్మాసన ముద్రలో ఉన్న మూర్తులు. సుఖాసన మూర్తులు ఈ కోవలోకి వస్తాయి. శయన భంగిమలంటే శయినించిన మూర్తులు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శిల్పం&oldid=4202453" నుండి వెలికితీశారు