తైత్తిరీయోపనిషత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం


తైత్తిరీయోపనిషత్తు చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. ఉపనిషత్తు‌లలో ఇప్పటికీ సాంప్రదాయకంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత కాలంలోని కర్మ కాండలు (పూజలు) మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఇది కృష్ణయజుర్వేదతిత్తిరిశాఖకు చెందినది. దీనిని తిత్తిరిపక్షులు ప్రకటించాయి.

తైత్తరీయోపనిషత్తు అయిదు ప్రశ్నములు (భాగాలు) గా అధ్యాపక ప్రసిద్ధము. అవి

  1. శిక్షాప్రశ్నము లేక శిక్షావల్లి
  2. బ్రహ్మవల్లి లేక ఆనందవల్లి
  3. భృగువల్లి
  4. నారాయణప్రశ్నము
  5. చిత్తిప్రశ్నము

వీటిలో చిత్తి ప్రశ్నము బ్రహ్మవిద్యాప్రతిపాదకము కానందు వల్ల దీనికి ప్రాచుర్యము లేదు. ఈ తైత్తిరీయోపనిషత్తు ఆంధ్ర పాఠము, ద్రావిడ పాఠము అని రిండు విధములుగా ఉంది.ద్రావిడపాఠాన్ని శ్రివైష్ణవులు పఠిస్తారు.ఆంధ్రపాఠాన్ని వింధ్యకు దక్షిణానగల బ్రాహ్మణులు పఠిస్తారు. ద్రావిడపాఠములో లేని కొన్ని మంత్రములు ఆంధ్ర పాఠములో ఉండడంచేత ఆంధ్రపాఠమే హెచ్చు ప్రాచుర్యంలో ఉంది. శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి ప్రశ్నములకు శంకరభగవత్పాదుల భాష్యము, విద్యారణ్యుల బృహద్వివరణము, సురేశ్వరాచార్యుల భాష్యవార్తికము మొదలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. నారాయణ ప్రశ్నమునకు భట్టభాస్కరభాష్యము, సాయనాచార్యుల భాష్యములు ఉన్నాయి. వీటిలో ఆంధ్రపాఠాన్ని అనుసరించి సాయన భాష్యము ఉంటే, ద్రావిడపాఠాన్ని భట్టభాస్కరభాష్యము అనుసరించింది.
తైత్తిరీయోపనిషత్తులో మొత్తం 112 అనువాకాలు ఉన్నాయి. వీటిలో శిక్షావల్లిలో 12, బ్రహ్మవల్లిలో 10, భృగువల్లిలో 10, నారాయణప్రశ్నములో 80 అనువాకాలు ఉన్నాయి.
ప్రతి అనువాకం మంత్రాల సముదాయం.

శిక్షావల్లి[మార్చు]

ఈఅధ్యాయానికి శిక్ష అనే సంస్కృతం పదం నుండి దాని పేరు వచ్చింది, దీని అర్థం "బోధన, విద్య". ఈ మొదటి అధ్యాయంలోని వివిధ పాఠాలు భారతదేశంలోని ప్రాచీన వేద యుగంలో విద్యార్థుల విద్య, పాఠశాలలో వారి దీక్ష, విద్యాభ్యాసము తర్వాత వారి బాధ్యతలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడినవి. ఇది జీవితకాల "జ్ఞాన సాధన" గురించి ప్రస్తావిస్తుంది, "ఆత్మజ్ఞానం" యొక్క సూచనలను వివరిస్తుంది. శిక్షా వల్లిలో వేద పాఠశాలలో ప్రవేశించే విద్యార్థుల వాగ్దానాలు, ప్రాథమిక విద్యాభ్యాసము యొక్క రూపురేఖలు, అధునాతన విద్యాభ్యాసము యొక్క స్వభావం, మానవ సంబంధాలకు అవసరమైన సృజనాత్మక గురుంచి, ఉపాధ్యాయుడు, విద్యార్థుల నైతిక, సామాజిక బాధ్యతలు, ప్రాణాయామము పాత్ర, సరైన ఉచ్చారణ వంటివి వివరించబడినవి. వేద సాహిత్యం, జీవతంలో నిర్వహించవలసిన ప్రాథమిక విధులు, నైతిక సూత్రాలు కూడా తెలుపబడినవి

శిక్షావల్లి ప్రధానంగా విద్యా బోధన గురించి చెప్తుంది (అనంతరకాలంలోని శిక్షా శాస్త్రాలకు ఇదే ఆధారం) బ్రహ్మచర్యంలోని గొప్పతనాల్ని (ఏకాగ్రత సంయమనం, మొదలగు వాటిని గుర్తించి) బోధించింది. స్నాతకుడుగా మారబోతున్న విద్యార్థికి 'సత్యంవద' (సత్యం చెప్పు) 'ధర్మంచర' (ధర్మంగా ప్రవర్తించు) 'మాతృ దేవోభవ 'పితృ,, ఆచార్య,, అతిథిదెవోభవ' (తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని, దేవునిగా పూజించాలి) వంటి ఎన్నో సూక్తులు చెప్తుంది. ఆ సూక్తులు శాశ్వతత్వాన్నికలిగి ఉన్నాయి.
దీనిలో సంహితాధ్యయనం చక్కగా చెప్పబడింది కనుక దీనిని సాంహిత అని కూడా అంటారు. సంహిత అంటే వేదపాఠం.

ఆనందవల్లి[మార్చు]

తైత్తిరీయ ఉపనిషత్తులోని రెండవ అధ్యాయం, ఆనంద వల్లి, కొన్నిసార్లు బ్రహ్మానంద వల్లి అని కూడా పిలుస్తారు, ఇతర ప్రాచీన ఉపనిషత్తుల మాదిరిగానే ఆత్మజ్ఞానం పై ఇది దృష్టి పెడుతుంది. ఇది "ఆత్మ" ఉంది అని, అది బ్రహ్మపదార్ధాన్ని నిరుపిస్తుందని తెలుపుచున్నది. దీనిని తెలుసుకొనటయే అత్యున్నతమైన శక్తినిచ్చే, విముక్తి కలిగించే జ్ఞానం అని నొక్కి చెబుతుంది. ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవడము వలన అన్ని ఆందోళనలు, భయాల నుండి విముక్తికి దోహదపడుతుందని, ఇదే ఆనందకరమైన జీవన సానుకూల స్థితికి మార్గం అని ఆనంద వల్లి నొక్కి చెబుతున్నది.

బ్రహ్మవల్లి[మార్చు]

బ్రహ్మవల్లి, భృగువల్లి ప్రశ్నములను వారుణి అంటారు. బ్రహ్మవిద్యాసాంప్రదాయ ప్రవర్తకుడైన వరుణిని సంబంధముచేత ఈ రెండు ప్రశ్నములకు వారుణి అని పేరు వచ్చింది.
బ్రహ్మవల్లి లేదా ఆనందవల్లి అనబడే ఈ ప్రశ్నమునందు బ్రహ్మ విద్యకు ప్రయోజనము అవిద్యా నివృత్తియని, అవిద్యానివృత్తిచేత జనన మరణ రూపమైన సంసారము నిశ్శేషముగా నశించునని ప్రతిపాదించబడింది.
ఈ ప్రశ్నములోనే క్రింది శాంతి మంత్రము ఉంది.

ఓం సహనావవతు |
సహనౌ భునక్తు |
సహవీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై |

ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః

భృగువల్లి[మార్చు]

ఇది భృగు మహర్షి గురించిన కథ ద్వారా ఆనంద వల్లి ఆలోచనలను పునరావృతం చేస్తుంది. ఈ అధ్యాయం దాని ఇతివృత్తాలలో కూడా సమానంగా ఉంటుంది, కౌసితకీ ఉపనిషత్తులోని 3వ అధ్యాయం, ఛాందోగ్య ఉపనిషత్తులోని 8వ అధ్యాయంలో కనిపించే వాటితో సమానంగా ఉంటుంది. భృగు వల్లి యొక్క ఇతివృత్తం ఆత్మ-బ్రాహ్మణం (నేనే), స్వీయ-సాక్షాత్కారమైన, స్వేచ్ఛా, విముక్తి పొందిన మానవునిగా ఉండడమంటే ఏమిటో వివరించడం. భృగు వల్లి యొక్క మొదటి ఆరు అనువాకాలను భార్గవి వారుణి విద్య అంటారు, అంటే "భృగువు తన తండ్రి అయిన వారుణి నుండి పొందిన జ్ఞానం" అని అర్థం. ఈ అనువాకాల్లోనే ఋషి వరుణి భృగువుకు బ్రహ్మం తత్త్వము, జీవులు ఎలా ఉద్భవించాయి, దేని ద్వారా జీవిస్తాయి, మరణానంతరం అవి ఎటు తిరిగి ప్రవేశిస్తాయి అన్న ప్రశ్నలకు వివరణ అందిస్తాడు. ఇందులో బ్రహ్మ తత్త్వ నిరూపణ, సాధన ప్రక్రియ వివరించబడుతున్నది.

భృగుమహర్షి తన తండ్రి అయిన వరుణుని బ్రహ్మను గూర్చి తెలుపవలసినదిగా ప్రార్థించాడు. వరుణుడు తన కుమారుని జిజ్ఞాసకు ప్రీతి చెంది, అన్నము, ప్రాణము, చక్షుస్సు, శ్రోతము, మనస్సు, వాక్కు అనునవి బ్రహ్మప్రాప్తికి ద్వారభూతములని చెప్పి, బ్రహ్మము యొక్క లక్షణమును కూడా భృగువునకు ఉపదేశించెను.ఇది స్థూలముగా భృగువల్లి సారాంశము.

నారాయణప్రశ్నము[మార్చు]

నారాయణప్రశ్నమునకు ఖిలకాండమనిపేరు.శ్రౌతసూత్రములో వినియోగంలేని మంత్రములు ఉండడంచేత ఆపేరు వచ్చింది.దీనికి యాజ్ఞికి అని కూడా పేరు ఉంది. సంధ్యావందనము, దేవతాపూజనము, వైశ్వదేవము మొదలైన కర్మప్రతిపాదకాలైన మంత్రాలు, యజ్ఞ సంబంధమైన మంత్రాలు ఎక్కువగా ఉండడంచేత ఆ పేరు వచ్చింది. అంతమాత్రాన ఇది ఉపనిషత్తు కాదనడానికి వీలులేదు. దీనిలో ప్రారంభంలో బ్రహ్మతత్త్వప్రతిపాదనము, చివరలో దానిని సాధించడానికి ఉపయోగపడే సత్యాది సన్యాసాంత సాధనలున్నూ చెప్పబడ్డాయి కనుక దీనిని ఉపనిషత్తు అనడానికి ఏరకమైన సందేహం కనబడదు.