వామన పురాణము
స్వరూపం
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగంలో 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగంలో 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలో సరో మహత్యంగా అనే పేరుతో వర్ణింపబడుతుంది. బలి చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలో జరిపినట్లు చెప్పబడింది. ఈ పురాణానికి ప్రధాన వక్త పులస్త్యుడు శ్రోత నారదుడు.
వామన పురాణంలోని అంశాలు
[మార్చు]- ఈశ్వరుడు జీమూతకేతువు అనే రూపం ధరించుట.
- వామనుడు చెప్పిన విష్ణు పవిత్ర స్థలాలు.
- వామనపురాణ ఫలశృతి.
- హరిభక్తి ఫలం.
- సుదర్శనచక్ర స్తవ, ప్రహ్లాదుడు చేసిన హరిభక్తి ప్రభోధం.
- బ్రహ్మ వామనుని స్తుతించుట.
- వామనుడు బలిని నిగ్రహించుట.
- బలి చెప్పిన కోశాకార పుత్రుని కథ.
- బలి యఙం మొదలుపెట్టడం.
- పాపశమన స్తోత్రం.
- సర్వపాప ప్రమోచన స్తోత్రం.
- విష్ణు సారస్వత స్తోత్రం.
- ప్రహ్లాదుడి తీర్ధయాత్ర.
- విష్ణుమూర్తి శివుని నుండి చక్రాయుధాన్ని వరంగా పొనదడం.
- శివుడు చక్రాన్ని విష్ణువు శూలాన్ని ధరించుట.
- నక్షత్ర పురుషవ్రత మహిమ.
- శ్రవణద్వాదశీ వ్రత మహిమ.
- మొదటి వామనావతారం, దుధువధ.
- ప్రహ్లాదుడి తీర్ధయాత్రకు బయలు దేరడం.
- అదితికి విష్ణువు వరం ప్రసాదించడం.
- బలిచక్రవర్తి ఆదర్శ పాలనా.
- బలికి ప్రహ్లాదుడు ధర్మబోధన.
- కాలనేమి వధ.
- మరుత్తుల కథ.
- పాపనాశనుడు గోత్రభేధి కథ.
- మహాభైరవుడు అంధకుని వధించుట, కుజుడు చంద్రిక పుట్టడం.
- శ్వేతార్క పుష్పంలో పారతీదేవి.
- మందగిరి వద్ద జరిగిన యుద్ధవర్ణన.
- శివకేశవుల అభేధం శివుడే తెలియజేయుట.
- దండకారణ్యం, అంధకుడు హతితో యుద్ధం చేయుట.
- సప్తగోదావరి.
- సురధుడు చిత్రాంగద.
- అంధకుని జన్మవృత్తాంతం. అరజ కథ.
- శుక్రాచార్యుడు హరుడి నుండి మృతసంజీవనీ విద్య పొందడం.
- సనందుడు బ్రహ్మ నుండి యోగ విద్య పొందడం, మురాదుర వధ.
- కేదారక్షేత్రంలో హరుని తపసు. మురాసురుని వృత్తాంతం.
- ౠతుధ్వజుడు, మదాలస, శతరూప ఆవిర్భావం.
- తారక మహిషుల వధ. క్రౌంచభేధనం.
- కుమారస్వామి జననం, దేవసేనాధిపతిగా పట్టాభిషేకం.
- రక్తబీజ శంభు నిశుంభుల సంహారం.
- ఋరు చండముండుల సంహారం.
- కౌశికి జననం, వినాయక జననం.
- శివపార్వతుల కల్యాణం.
- సప్తఋషులు శివినిఐ పార్వతిని ఇమ్మని హిమాంతుని కోరుట.
- పార్వతి తపసు.
- అక్షయతిథి మహిమ.
- కురుక్షేత్రం, ధరక్షేత్రం.
- తపతి వృత్తాంతం.
- మహిషాసుర సంహారం.
- దుందుభి రాయభార.
- కాత్యాయనీదేవి అవతారం.
- విష్ణుపంజర స్తోత్రం.మహిషాసురుని పుట్టుక.
- దేవతల శయన విధానం.
- లోలార్క క్షేత్ర మహిమ.
- ధర్మాచరణ.
- శంకరప్రోక్త సుప్రభాతం సుప్రభాతం. సదాచరం.
- జంబుద్వీపం, భారతవర్షం.
- నరకాలు కలిగించే పాపకర్మలు ఏవి ?
- సుకేశి వృత్తాంతం.
- దేవాసుర సంగ్రామం.
- అంధకుడు దైత్యాధిపతి కావడం.
- ప్రహ్లాద నరనారాయణుల యుద్ధం.
- ప్రహ్లాదుడు నైమిశారణ్యం దర్శించడానికి వెళ్ళడం.
- లింగోత్పత్తి, మన్మధదహనం.
- మహాకాల రూపం - 12 రాశులవర్ణన.
- వీరభద్రుడు దక్షయఙం ధ్వశం చేయడం.
- వారణాశి- కపాలమోచన తీర్థం.
- చంద్రుడు దుర్వాసుడు నరుడు పుట్టడం.