Jump to content

కాత్యాయన మహర్షి

వికీపీడియా నుండి

కాత్యాయన మహర్షి (సా.పూ 1 లేదా 3 వ శతాబ్దం) ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక మహర్షి, సంస్కృత వ్యాకరణ పండితుడు, గణిత శాస్త్రవేత్త.[1] ఈయనకే కాత్యుడనీ, వరరుచియనీ, [2] మేధాజిత్ అనీ, పునర్వసుడనీ ఇతర పేర్లు ఉన్నాయి. సంస్కృత వ్యాకరణాన్ని రచించిన పాణిని ముఖ్య శిష్యుడనీ, దక్షిణ దేశానికి చెందిన వాడనీ పతంజలి ఒక సూత్రంలో ప్రకటించాడు. పాణినీయ వ్యాకరణాన్ని విస్తరిస్తూ ఈయన రాసిన వార్తికం అనే గ్రంథం ప్రాచుర్యం పొందినది. ప్రాకృత భాషలో మొదటి వ్యాకరణ గ్రంథమైన ప్రాకృత ప్రకాశాన్ని రచించినది వరరుచి అని పండితులు వాదిస్తున్నారు. శకపురుష రాజు విక్రమాదిత్యుడు ఆస్థానములో తొమ్మిది రత్నాలలో ఒకటి (తొమ్మిది పండితులు) ప్రసిద్ధ పదకొండవ శతాబ్దపు గొప్ప రచన కథాసరిత్సాగరంలో, వరరుచి ప్రధాన పాత్ర పేరును కలిగి ఉంది.

రచనలు

[మార్చు]

వరరుచి కౌశాంబి నివాసి. సోమదత్తుడు అతని తండ్రి. ఇతను దక్షిణాదిన, కేరళ దేశ ప్రాంతివాసి అని కొందరు అంటారు. భూష్యకారుడు పతంజలి అతనిని 'భగవాన్', 'ఆచార్య' అని గౌరవంగా సంబోధించాడు. ఇతని కాలము క్రీస్తుపూర్వం 1000 లేదా 3వ శతాబ్దానికి చెందినదని పండితులు భావిస్తున్నారు. ఈయనా వ్రాసిన వార్తికములు పాణిని సూత్రాల వివరణ రూపాలు. సూత్రాలలో ఉపయోగించిన పదాల ప్రయోజనం గురించి వాదనను వివరిస్తాయి, పేర్కొనబడని పదాలను జోడించి, తప్పుగా మాట్లాడిన పదాలను సమం చేస్తుంది. వార్తికములు ప్రత్యేక గ్రంథాలుగా అందుబాటులో లేవు. అవి మహాభాష్యలో (పతంజలిచే) చేర్చబడ్డాయి. కాత్యాయన వార్తికములు పాణిని సూత్రాల శైలిని అనుసరిస్తుంది. కాత్యాయనుడు వ్యాకరణం యొక్క గొప్పతనాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశాడు.

కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పురాతన కథలలో, ప్రధాన గ్రంథాలలో వరరుచి పేరు వినబడుతుంది. వరరుచి అనే పేరు సంస్కృతంలో పదికి పైగా పురాణ చారిత్రక శాసనాలలో కనిపిస్తుంది. పదహారు సంస్కృత గ్రంథాలలో కూడా కాత్యాయన పేరు కనిపిస్తుంది. వరరుచి పేరుతో ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాలలో పది కంటే ఎక్కువ రచనలతో ఈ పేరు ముడిపడి ఉంది.

కాత్యాయనుడు రాసిన రెండు రచనలు బాగా ప్రసిద్ధి పొందాయి.

  • పాణినీయ వ్యాకరణంపై ఆయన రాసిన వార్తికం అనే భాష్యం, పతంజలి రాసిన మహాభాష్యంతో కలిపి సంస్కృత వ్యాకరణానికి తిరుగులేని మూల గ్రంథాలుగా పండితులు పేర్కొంటారు. ఇది ఆరు వేదాంగాల్లో ఒకటి.
  • ఆలయాల నిర్మాణంలో ప్రధాన పీఠం నిర్మించడానికి దీర్ఘ చతురస్రాలు, లంభకోణ త్రిభుజాలు, సమచతుర్భుజాల వర్ణన కలిగిన సులభ సూత్రాలు తొమ్మిది పుస్తకాలుగా రాశాడు.

పైన పేర్కొన్నవి కాకుండా నామమాల అనే నిఘంటువు రాశాడు.[3]

పింగళుడు లాంటి పండితుల కోవలోనే కాత్యాయనుడు కూడా గణిత శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన రాసిన సులభ సూత్రాలు అనే గ్రంథం జ్యామితి శాస్త్ర విషయాలు వివరిస్తుంది. ఇందులో సా.పూ 800 శతాబ్దంలో బౌధన్య సూత్రాలలో పేర్కొన్న పైథాగరస్ సిద్ధాంతాన్ని విపులీకరించాడు.[4] ఈ ఖగోళ శాస్త్రవేత్త వరరుచి దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ వాక్య పంచాంగానికి ఆధారమైన వాక్యకరణం అనే గ్రంథం రచయిత. తాను తమిళనాడుకు చెందినవాడినని తన గ్రంథం ప్రారంభంలోనే స్పష్టం చేశాడు. ఇది తమిళనాడులోని కంజి ప్రాంతంలో క్రీ.శ.1282లో వ్రాయబడిందని కూడా తెలుయుచున్నది.

సూచనలు

[మార్చు]
  1. Joseph (2000), p. 328
  2. Edwards Byles Cowell (1854). The Prākrita-prakāsa or the Prākrit grammar of Vararuci with the commentary (Manorama) of Bhāmaha. Hertford, England: Stephen Austin, Book Sellers to East India College.
  3. రసజ్ఞ. "నిఘంటువులు". magazine.maalika.org. మాలిక పత్రిక. Archived from the original on 2 జూన్ 2015. Retrieved 9 November 2016.
  4. Pingree (1981), p. 6

మూలాలు

[మార్చు]