వేదాంగములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము

హిందూమతంలో వేదాలను అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారు. వేదములను శృతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధంబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతను రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను "అపౌరుషేయములు" అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను "ద్రష్ట"లని అంటారు.

వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగాలను వేదాంగములు అంటారు. వేదాంగాలు ఏవి? అన్న దానికి సమాధానంగా ఉపయోగపడే శ్లోకం ఇది:

శిక్షా వ్యాకరణంఛందో నిరుక్తం జ్యోతిషం తథా
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః

ఒక్కొక్క వేదాంగాన్ని గురించి క్లుప్తంగా ఇక్కడ వ్రాయబడింది.

  1. శిక్ష: పాణిని శిక్షాశాస్త్రమును రచించెను. ఇది వేదమును ఉచ్ఛరింపవలసిన పద్ధతిని బోధిస్తుంది. వేదములలో స్వరము చాలా ముఖ్యము.
  2. వ్యాకరణము: వ్యాకరణ శాస్త్రమును కూడ సూత్రూపమున పాణినియే రచించెను. ఇందులో 8 అధ్యాయాలున్నాయి. దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమాలు అన్నీ ఇందులో చెప్పబడ్డాయి.
  3. ఛందస్సు: పింగళుడు "ఛందోవిచితి" అనే 8 అధ్యాయాల ఛందశ్శాస్త్రమును రచించెను. వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకిక ఛందస్సులు కూడా ఇక్కడ చెప్పబడినవి.
  4. నిరుక్తము: నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడు. వేదమంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడింది. పదములన్నీ ధాతువులనుండి పుట్టినవని యాస్కుని అభిప్రాయము.
  5. జ్యోతిషము: వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాలనిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాలనియమాలు జ్యోతిషంలో ఉంటాయి. లగధుడు, గర్గుడు మున్నగువారు ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథాలను రచించారు.
  6. కల్పము: కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదాలు చెప్పబడ్డాయి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రాలను రచించారు

మూలాలు[మార్చు]

  • హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానములు వారి ప్రచురణ