మత్స్య పురాణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇదియు శైవము. వాయుపురాణమున వ్రతాదికములు తక్కువ. దీనిలో అవి ఎక్కువ. చైత్ర అమావాస్యనాడు పార్వతి కుక్షిని భేదించుకొని షడాసనుడు పుట్టెనని ఇందు ఉంది. భారతమున కార్తికామావాస్యనాడు, లేక ఆగ్రహాయణ శుద్ధ ప్రతిపత్తునాడు శరవణమున కుమారోత్పత్తి అని ఇందు ఉంది. ద్వీపసన్నివేశ విషయమున మత్స్య భారతము లొకటి. కాళుదాసు నకు కుమారసంభవము కావ్య రచనలలో శివపురాణముతో పాటు ఇందలి కుమారకథ కూడా ఆలతి ఆధారము. ఇందలి శ్రాద్ధ కల్పము ప్రాచీనము. శ్రాద్ధమునకు ద్రవిడులును, కోకనులును (అనగా కొంకణులు) నిషిద్ధులు. ఇందు ఉత్తరదేశములయందు లేని దేవాలయ గోపురములయు, దేవదాసికలయు ప్రసంగమున్నది. ఇందు ఐదు విష్ణు అవతారముల ప్రశంస ఉంది. క్రీ.శ.6వ శతాబ్దము ఇది చేరినదని కొందరి అభిప్రాయము.