తండిమహర్షి

వికీపీడియా నుండి
(తండి మహర్షి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శివ అష్టోత్తర నామాల స్త్రోత్రం పుస్తకం

తండి మహర్షి పరమ శివ భక్తుడు. అతడు బ్రహ్మచర్య నిష్ఠతో సకల వేదశాస్త్రములను, యోగవిద్యను చదివి జ్ఞానియై ప్రసిద్ధిగాంచెను. అతడు పదివేల సంవత్సరములు సమాధి స్థితినుండి పరమశివుని ఆరాధించెను. అతనికి శివుడు ప్రత్యక్షమయ్యెను. శివకటాక్షము నందిన పిదప తండిమహర్షి యొక ఆశ్రమమును నిర్మించుకొని తపోధ్యానయుక్తుడై యుండెను.

ఉపమన్యు మహర్షి ఒకనాడు తండిమహర్షి ఆశ్రమమునకు విచ్చేసి, అతిథి సత్కారములనందిన పిదప పరమేశ్వరుని సహస్రనామములు తెలుకొనగోరుతున్నట్లుగా ప్రార్థించెను. అప్పుడు తండి భక్తిశ్రద్ధలతో శివుని ధ్యానించి "పరమేశ్వరుని నామములు తెలుపుమని మున్ను దేవతలు బ్రహ్మ నడుగ నతడు వారికి పదివేల నామములను దెలిపెను. వానినుండి వేయినామము లెన్ని బ్రహ్మ స్వర్గవాసుల కోసంగెను. నేను వానినెరింగి స్వర్గలోకమునుండి భూలోకమునకు గొనివచ్చితిని. అందుకే భూలోకవాసులీ స్తవరాజము తండికృత మందురు. ఇది సర్వమంగళములను సమకూర్చునది. సర్వకల్మషములను నశింపజేయునది. బ్రహ్మలకు బ్రహ్మ, పరులకు బరుడు, తేజములకు దేజము, తపములకు దపము, శాంతములకు శాంతము, ద్యుతలకు ద్యుతి, దాంతులకు దాంతుడు, ధీమంతులకు దీ, దేవతలకు దేవత, మహర్షులకు యజ్ఞములకు యజ్ఞము, శివులకు శివుడు, రుద్రులకు రుద్రుడు, యోగులకు యోగి, కారణములకు గారణము, నగు హరుని అష్టోత్తర సహస్రనామములు:

ఇలా తండిమహర్షి శివ సహస్రనామ స్తోత్రమును తెలియజేసెను. వీనిని జపించినవారు సర్వకామ్య సంసిద్ధిగాంచి ముక్తులగుదురు. దీని యొక్క పూర్తిపాఠం వికీసోర్స్ లో ఇక్కడ చూడండి. దీని వివరాలు మహాభారతంలో 14 అధ్యాయం: అనుశాసనిక పర్వములో పేర్కొనబడినవి.

తండి బ్రహ్మపదము జేరి శివునారాధించి శివైక్యమునందెను.

మూలాలు

[మార్చు]
  • మహర్షుల చరిత్రలు, (ఏడవ సంపుటము) విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1989.