Jump to content

యోగి

వికీపీడియా నుండి

[[File:Babaji.jpg|link=https://simple.wikipedia.org/wiki/File:Babaji.jpg%7Cకుడి%7Cthumb%7C320x320px%7C[[:simple:Mahavatar[permanent dead link] Babaji|Mahavatar Babaji]], a noted Hindu yogi in Himalaya.]] కర్మఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయువాడే నిజమైన సన్యాసి, యోగి[1]. అంతేకాని అగ్నిహోత్రాదికర్మలు మానేసినంత మాత్రాన కాదు. సన్యాసమన్నా, యోగమన్నా ఒకటే. యోగాన్ని కోరేవాడికి మొదట కర్మయే సాధనం. అంటే నీ పని నువ్వు చేయవలసిందే, కొంత సాధన తర్వాత అంటే నీ దేహ ధర్మాలు నిర్వహిస్తూ, ఇంద్రియ విషయాలందు, (కామ క్రోధ లోభ మధ మాత్సర్యాలు ) వాటి కర్మలయందు కోరికలను, అన్ని సంకల్పాలను వదిలి సాక్షిగా గమనిస్తూ ఉండేవారు యోగిగా చెప్తారు.

ఆత్మకు ఆత్మే బంధువు (నిగ్రహం కలవారికి), ఆత్మకు ఆత్మే శత్రువు (నిగ్రహంలేని వారికి). మానావమాన, శీ తోష్ణ, సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు, మట్టీని, రాతిని, బంగారాన్ని ఒకేలా చూస్తాడు. శత్రువులయందు, మిత్రులయందు, బంధువులు, సాధువులు, దుర్మార్గుల యందు సమబుద్ధికలిగిన యోగి శ్రేష్ఠుడు. ( ఆస్దితికి ఎదిగిన వారు మాత్రమే యోగి ) . ఇంత గొప్ప స్డితికి ఎదగాలంటే ఎంతో సాధన ఉండాలి.

ఈ స్థితికి రావాలంటే ఆశలను వదిలి ఏకాంతప్రదేశంలో యోగాభ్యాసం చేయాలి.

ధ్యాన పద్ధతి

[మార్చు]

శుభ్రమైన ప్రదేశంలో మరీ ఎత్తు లేక తగ్గు కాని పీఠంపై పై వస్త్రం పరచి ఆసనం ఏర్పరచుకోవాలి. దానిపై నిటారుగా కూర్చొని, నాసికాగ్రం (భ్రూమధ్యం) పై చూపు కేంద్రీకరించి మనసును ఏకాగ్రంగా నిలిపి, అదుపులో ఉంచుకొని భయపడకుండా, ప్రశాంతంగా భగవంతుని యందు మనసు నిలిపి నిత్యం యోగాభ్యాసం చేయువాడు నన్ను, యోగ స్థితినీ పొందుతాడు.

కొందరు ప్రముఖ యోగులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. White 2012, p. 8.
"https://te.wikipedia.org/w/index.php?title=యోగి&oldid=3435907" నుండి వెలికితీశారు