సుధామ
సుధామ | |
---|---|
![]() సుధామ | |
జననం | అల్లంరాజు వెంకటరావు నవంబరు 25, 1951 ![]() |
వృత్తి | ప్రోగామ్ ఎక్జిక్యూటివ్ (ఆల్ ఇండియా రేడియో) రచయిత |
ప్రసిద్ధి | సుధామ |
మతం | హిందూ |
భార్య / భర్త | ఉషారాణి |
పిల్లలు | అల్లంరాజు స్నేహిత్ , కోడలు: అల్లంరాజు(దువ్వూరి) లక్ష్మీ స్రవంతి |
తండ్రి | అల్లంరాజు కామేశ్వరరావు |
తల్లి | అల్లంరాజు కామేశ్వరమ్మ |
అల్లంరాజు వెంకటరావు అసలు పేరుతో కంటే సుధామ గా పేరు పొందిన కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి
జీవిత విశేషాలు[మార్చు]
సుధామ [1]1951, నవంబర్ 25వ తేదీన విశాఖ జిల్లా అనకాపల్లిలో అల్లంరాజు కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ దంపతులకు జన్మించారు . ఒకటో తరగతి నుండి మొత్తం విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల నుండి ఎం.ఓ.యల్ ప్రాచ్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివి ' తెలుగు అభ్యుదయ కవిత్వంలో భావచిత్రాలు ' అనే అంశం పై ఎం.ఫిల్ పరిశోధన చేసారు. ఆ తరువాత 1975-1977 లలో కరీంనగర్ లోని బిషప్ సాల్మన్ జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు.. 1978లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వివిధభారతి వాణిజ్య ప్రసార విభాగంలో ట్రాన్స్‌మిషన్ ఎక్జిక్యూటివ్‌గా చేరి, 1991 లో పదోన్నతి పై విజయవాడ ఆకాశవాణి తెలుగు విభాగాన్ని ఉషశ్రీ గారి అనంతరం నాలుగేళ్ళు నిర్వహించి, 1995 నుండి హైదరాబాద్ లో తెలుగువిభాగం అధిపతి గా, ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ కో ఆర్డినేటర్ గా చేసి,రెండేళ్ళు వరంగల్ కేంద్రంలోనూ పనిచేసి ,చివరగా 2008లో వివిధభారతి ప్రసార విభాగం కార్యక్రమ నిర్వహణాధికారిగా స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు . ఇతని భార్య ఉషారాణి కూడా ఆకాశవాణి ఉద్యోగి.ఆకాశవాణి రీజనల్ అకాడమీ ఫర్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియా ట్రైనింగ్ సెంటర్ సంచాలకులుగా ఆవిడ పనిచేసారు. చిత్రకళ, సంగీత, సాహిత్యాలలో సుధామకు ప్రవేశం ఉంది.పత్రికారంగంలో కవిగా,కా ర్టూనిస్ట్ గా,కాలమిస్ట్ గా, పుస్తక,సినిమా సమీక్షకునిగా,సాహిత్య విమర్శకునిగా,పజిల్స్ నిర్మాతగా పేరొందారు. ప్రముఖ వక్తగా ప్రసిద్ధులు.ప్రతిష్టాత్మక
సాహిత్య సంస్థ యువభారతి ప్రచురణల ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
పుస్తకాలు[మార్చు]
- 'వీచికలు' కవితా సంకలనం 1967లో అచ్చయ్యింది.
- 'మేం' కవితా సంకలనం 1974లో మిత్రుడు డాక్టర్. నాగినేని భాస్కరరావ్ సహ కవిగా ప్రచురింపబడింది.
- 'అగ్నిసుధ 'కవితా సంకలనం 1990లో ప్రచురితమయింది.
- 2001లో ''సం.సా.రా.లు '' (సంస్కతి, సాహిత్యం. రాజకీయాలు) ఆంధ్రభూమి దినపత్రిక కాలం 50 వ్యాసాలతో ప్రచురితమైంది.సుమారు15 సంవత్స రాలు ఆ కాలమ్ నిర్వహించారు.
- 'మనసు పావన గంగ ' పేరిట సుధామ రేడియో, టీ.వీ పాటలు 2010 లో పుస్తకంగా వచ్చాయి.
- ఆంధ్రప్రభ దినపత్రికలో మూడు ఏళ్ళపాటు గురువారాల్లో ఎడిట్ పేజ్ లో కవిత్వరూపంలో రాసిన కాలమ్ నుంచి ఎంపికచేసిన కవితలతో 'కవికాలమ్ ' 2011లో విడుదలైంది.
- అలాగే 2011 లో నే 'చిత్రగ్రంథి ' కవితా సంకలనం వచ్చింది.
- 2012 లో 'పూతరేకులు' పేర జోక్స్ సంకలనం వెలువరించారు.
- 2018 లో 'మన తెలంగాణ ' పేర 2015-16 లో 'సుధామ'యోక్తి' పేర మనతెలంగాణ దినపత్రిక లోని కాలమ్ వ్యాసాలు పుస్తకం గా వెలువడింది
- ఆంధ్రభూమి వార పత్రికలో 88 వారాల పాటు పాఠకులను అలరించిన ' రామాయణ పథం' పజిల్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అభినందన వచనాలతో 2018 జూలై లో ప్రశ్నోత్తరమాలికా గ్రంథం గా వెలువడింది
- సుధామ రాసిన పీఠికలు -ముందుమాటలు 'భూమిక ' పేర 470 పేజీల బృహద్గ్రంథం గా వారి శ్రీమతి అల్లంరాజు (సూకూరు) ఉషారాణి సంపాదకులుగా 25 నవంబర్ 2018 న ఆవిష్కరింప బడింది .
- వ'సుధా (స)మ'యం -విజయక్రాంతి దినపత్రిక కాలమ్ వ్యాసాలు 2019 లో ప్రచురితం
- మాటాట (గళ్ళ నుడికట్టు) 2019 లో ప్రచురితం
- మన పండుగలు',' ఈసఫ్ నీతికథలు'.' పురాణ బాలలు ', విజయవాడ ప్రచురణ సంస్థ కై రాయగా పుస్తకాలుగా వెలువడ్డాయి.
ప్రస్తుతం ఆంధ్రభూమి దినపత్రికలో 'మాటాట ' పేరిట డైలీ పజిల్, ఆంధ్రభూమి వారపత్రికలో ' పదబంధ పారిజాతం',నవ్య వారపత్రికలో ' సుధామ పదగారడి', రచన మాసపత్రికలో' పజిలింగ్ పజిల్ 'ప్రహేళీకలు సుధామ నిర్వహిస్తున్నారు., ' వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్" మాసపత్రిక లో 'సీ' నియర్ కబుర్లు కాలమ్ నిర్వహిస్తున్నారు.. 10 సంవత్సరాల పాటు ' వార్త' ఆదివారం అనుబంధం లో,ఆంధ్రప్రభ దినపత్రిక లోపజిల్స్ నిర్వహించారు .హాస్యానందం మాసపత్రిక తన నవంబర్ '2019
సంచికను సుధామ ప్రత్యేక సంచికగా వెలువరించి కార్టూనిస్టు గా ,హాస్యరచయితగా గౌరవించింది.
అవార్డులు
- 1983 లోనే ఆకాశవాణి సర్వ భాషా కవిసమ్మేళనానికి తెలుగుకవిగా ఎంపికై జాతీయకవిగా పాల్గొన్నారు.
- అగ్నిసుధ కవితా సంకలనానికి 1990 కలహంసి, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డులు లభించాయి.
- 2004లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథంగా సం.సా.రా.లు (సంస్కతి, సాహిత్యం. రాజకీయాలు)సాహితీ పురస్కారం అందుకుంది.ఆ కాలమ్ సుమారు15 సంవత్స రాలు ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో వచ్చింది.
- 1995లో ఆరాధన సంస్థవారి ఆకాశవాణి అవార్డు
- 1998లో కమలాకరఛారిటబుల్ ట్రస్టు వారిచే విశిష్టదంపతుల పురస్కారం
- 2002లో జ్యోత్స్న కళాపీఠం కవితా పురస్కారం
- 2003లో అభినందన సంస్థ పురస్కారం
- 2005లో ఆచార్య తిరుమల స్మారక సాహితీ పురస్కారం
- 2007లో చేతన పత్రిక విశిష్ట పురస్కారం
- 2008 లో వంశీ ఇంటర్నేషనల్ ఉగాదికవితా పురస్కారం
- 2008 లో తురగా కృష్ణమోహన్‌రావు స్మారక పురస్కారం
- 2011 లో తేజ ఆర్ట్స్ సంస్థ సాహితీ పురస్కారం
- 2011 లో చిత్ర గ్రంథికవితా సంకలనానికి చెలిమిసంస్థ పురస్కారం
- 2012 లో సమైక్య భారతివారిచే కార్టూనిస్టుల కాన్ఫరెన్స్ లో కార్టూనిస్ట్ గా సన్మానం
- 2013 లో నోరి ఛారిటబుల్ సంస్థ వారిచే దివాకర్ల వెంకటావధానిస్మారక సాహిత్య పురస్కారం
- 2015 లో మునిమాణిక్యం హాస్యనిధి పురస్కారం
- 2015 లో నవ్య సాహితీ సమితి ఉగాదివసంతోత్సవ సాహిత్య పురస్కారం
- 2015 లోనే పింగళిజగన్నాధరావు స్మృతిసాహిత్య పురస్కారం
- 2015 లోనే హాసం సంస్థ వారి పురస్కారం
- 2015 లో డా.తిరుమల శ్రీనివాసాచార్య,స్వరాజ్యలక్ష్మిల యువభారతి ధర్మ నిధిపురస్కారం
- 2016 లో దివాకర్ల వేంకటావధాని స్మారక ట్రస్టు సాహిత్య పురస్కారం
- 2017 లో కంభమ్మెట్టు చెన్నకేశవరావు జయంతి పురస్కారం
- 2018 లో కీ.శే..పోలవరంవెంకటసుబ్బమ్మ సాహితీపురస్కారం
- 2018లో నెల్లూరు గుర్రాల వెంకటరమణమ్మ స్మారక సాహితీ పురస్కారం
- 2019లో యువకళావాహిని వివేకానంద ప్రతిభా సాహిత్య పురస్కారం
మూలాలు[మార్చు]
- ↑ [1][permanent dead link] కదిలించే కలాలు - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- తెలుగువారు
- తెలుగు రచయితలు
- తెలుగు లలిత సంగీత ప్రముఖులు
- తెలుగు కవులు
- ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు గ్రహీతలు
- విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ఉద్యోగులు
- విశాఖపట్నం జిల్లా కవులు
- విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయులు