అగస్త్య మహర్షి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అగస్త్యుడు మరియు లోపాముద్ర విగ్రహాలు

అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు.agastya did thapasya near garudeswar on the baks of river narmada.

వింధ్యుని గర్వ మణచుట[మార్చు]

మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకోమన్నారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని ఉపసంహరించుకుని వెంటనే వారు నడచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. [1] వేరొక కథనం ప్రకారం-శివ పార్వతుల కళ్యాణానికి ఉత్తరానికి ఋషులందరు హిమాలయలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పొవు చుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్యభగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పొతున్నందుకు చింతించుచుండగా వారికి అక్కడనుండి కూడ ప్ర్యత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి అగస్త్యులవారు దక్షిణాన ఉన్నారు. వారు మొట్టమొదటి దక్షిణ భాష ఐన తమిళంను పరిచయం చేసారు. తమిళం అతి ప్రాచీన భాష అని అందరికి తెలిసిన విషయమే. వారు మొట్టమొదటి నుండి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారన్న గుర్తుగా వారి పేరు మీద ఒక ఊరు కూడా ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ వెళ్ళే దారిలో ఉంది. అక్కడ శివాలయం పక్కనే శనీశ్వరాలయం ఉన్నాయి.

వివాహం[మార్చు]

మనుస్మృతి ప్రకారం అందరు హిందువుల లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానం కనాల్సి వచ్చింది. అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టించాడు. ఇదే సమయంలో ఘనకీర్తి కలిగిన విదర్భ రాజు సంతానం లేక భాధపడుతున్నాడు. ఆయన ఒక పుత్రిక కోసం జపతపాదులు చేస్తూ నిరీక్షిస్తున్నాడు. అగస్త్యుడు ఆయన సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు. పుట్టిన బిడ్డకు ఆ రాజదంపతులు లోపాముద్ర అని నామకరణం చేశారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెకు తనతో వివాహం జరిపించాల్సిందిగా రాజును కోరాడు. మొదటగా ఒక విరాగి నుంచి ఈ ప్రతిపాదన విన్నరాజు ఖిన్నుడయ్యాడు. కానీ మానసికంగా వ్యక్తిత్వ పరంగా ప్రతిభాశీలియైన తన కూతురు పట్టుబట్టడంతో ఒప్పుకున్నాడు. దాంతో రాజు వారిద్దరి వివాహం జరిపించాడు. Agasthya did thapasya on the bank Narmada river near garudeshwar,gujarat.

వాతాపి, ఇల్వలుల కథ[మార్చు]

ఒకానొకప్పుడు వాతాపి, మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు నివసించేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయినవారిని బ్రతికించే సంజీవనీ విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినపుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. వారు ఆ మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవినీ మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. అలా ఒక సారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా వెళుతుండగా రాక్షస సోదరులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి అందరికీలానే మేక మాంసం వడ్డించాడు ఇల్వలుడు. ఆయన భోంచేసిన తరువాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవనీ మంత్రం పఠించాడు. కానీ వాతాపి మాత్రం తిరిగి రాలేదు. ఎందుకంటే ఈ విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేశాడు.

అగస్త్యుడు : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879[మార్చు]

ఇతఁడొక మహర్షి. మిత్రావరుణులు సముద్రపుగట్టున సంచరించుచుండి ఊర్వశిని చూచి కామింప, వారికి వీర్యములు స్ఖలితములై ఘటమున ఉనుపబడఁగా అందు అగస్త్య - వసిష్ఠులు పుట్టిరి. ఇతని యాశ్రమము వింధ్యపర్వతసమీపమున కలదు.

ఈతని కథలనేకములు కలవు. వాతాపి ఇల్వలుఁడు అను నిరువురు రాక్షసులు బ్రాహ్మణులను మిగుల హింసించుచుందురు. రాక్షసులు కామరూపులు గనుక ఇల్వలుఁడు సాధారణముగ ఒక బ్రాహ్మణరూపము ధరియించి వాతాపిని మాంసముగ వండి తన యింట పితృకార్యమనుచు బ్రాహ్మణుని ఎవ్వనినైనను పిలిచి భోజనము పెట్టి భోజనానంతరము బ్రాహ్మణభుక్తశేషమును భుజియించుటకు రమ్మనువానివలెనే వాతాపిని పిలుచును. వాడు అపుడ ఆబ్రాహ్మణుని పొట్ట చించుకొని వెలుపలికి వచ్చును. ఈ సంగతిని అగస్త్యమహర్షి యెఱిఁగి ఒక దినము ఇల్వలుని యింటికి బ్రాహ్మణార్థము వచ్చెను. అప్పుడు ఎప్పటి తెఱంగున ఇల్వలుడు చేయగా అగస్త్యుఁడు "వాతాపే జీర్ణో భవ" అనెను. అంత వాతాపి నశించెను. ఇల్వలుడు అగస్త్యుని పై పడిరాఁగా అతనికోపముచే భస్మమాయెను.

మఱియు తొల్లి ఒకప్పుడు మేరువింధ్య పర్వతములకు ఒక నిమిత్తము వివాదము కలిగి వింధ్యపర్వతము సూర్యచంద్రగతులకు అడ్డముగ పొడవెదుగ లోకమునకు అలజడి పొడమ అది తెలిసి దేవర్షులు అగస్త్యునిచెంతకు పోయి పొడమిన విపత్తును విచారింపుడని వేఁడఁగా అమ్మహామహుఁడు బయలువెడలి తన శిష్యుఁడగు వింధ్యముకడకు రాఁగా ఆపర్వతశ్రేష్ఠుడు అగస్త్యునకు దండప్రణామము ఒనర్చుటకు నేలమట్టమయ్యెను. అప్పుడు అగస్త్యుడు వింధ్యునిం గని నేను దక్షిణమునకు పోయి మరలి వచ్చుదనుక నీవిచ్చట ఈప్రకారమే ఉండుమని పలికి పోయెను. వింధ్యము అది మొదలు ఇదివఱకును ఆ ప్రకారముననే క్రింద పడి ఉన్నదని ప్రసిద్ధి. ఇతఁడు కాలకేయులనిమిత్తము సముద్రమునందలి జలమును ఆపోశనముగ తీసికొనెనని పురాణకథ. చూ|| కాలకేయులు. మఱియు నహుషుఁడు దేవేంద్రత్వమును అనుభవించుచుండినపుడు ఒకనాడు వేదములంగూర్చియు బ్రాహ్మణులంగూర్చియు నిర్లక్ష్యముగ మాటలాడినందున వానిని సర్పమగునట్లు అగస్త్యుఁడు శపియించెనని చెప్పియున్నది.

అగస్త్యుడు పులస్త్యునికి హవిర్భుక్కు అను భార్యయందు పుట్టినట్లు కొన్ని చోట్ల అగపడుచున్నది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]