హిమాలయాలు
హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్, చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.[1]
ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరాలున్నాయి. సుమారు నూరు శిఖరాలు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.[2]
ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర, యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు. వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ, 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.
హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు[మార్చు]
శిఖరం పేరు | ఇతర పేర్లు, అర్థం | ఎత్తు (మీటర్లు) | ఎత్తు (అడుగులు) | మొదటి అధిరోహణ | వ్యాఖ్యలు/గమనికలు | అక్షాంశరేఖాంశాలు[3] |
---|---|---|---|---|---|---|
ఎవరెస్టు శిఖరం | సాగర్ మాతా, "ఆకాశ నుదురు", చోమోలాంగ్మా, "విశ్వమాత" |
8,848 | 29,029 | 1953 | ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు. | 27°59′17″N 86°55′31″E / 27.98806°N 86.92528°E |
కే-2 | చోగో గాంగ్రి | 8,611 | 28,251 | 1954 | ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్, చైనాలోని జింజియాంగ్ లో గలదు. | 35°52′53″N 76°30′48″E / 35.88139°N 76.51333°E |
కాంచనగంగ | కాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" | 8,586 | 28,169 | 1955 | ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్), నేపాల్ లో గలదు. | 27°42′12″N 88°08′51″E / 27.70333°N 88.14750°E * |
లోట్‌సే | "దక్షిణ శిఖరం" | 8,516 | 27,940 | 1956 | ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్, టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు | 27°57′42″N 86°55′59″E / 27.96167°N 86.93306°E |
మకాలూ | "మహా నల్లనిది (The Great Black)" | 8,462 | 27,765 | 1955 | ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. | 27°53′23″N 87°5′20″E / 27.88972°N 87.08889°E |
చో ఓయు | ఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత" | 8,201 | 26,905 | 1954 | ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. | 28°05′39″N 86°39′39″E / 28.09417°N 86.66083°E |
ధవళగిరి | "తెల్లని పర్వతం" | 8,167 | 26,764 | 1960 | ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. | 28°41′48″N 83°29′35″E / 28.69667°N 83.49306°E |
మానస్లూ | కుటాంగ్, "ఆత్మ పర్వతం" | 8,156 | 26,758 | 1956 | ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు. | 28°33′00″N 84°33′35″E / 28.55000°N 84.55972°E |
నంగా పర్వతం | దయామీర్, "నగ్న పర్వతం" | 8,126 | 26,660 | 1953 | ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు. | 35°14′14″N 74°35′21″E / 35.23722°N 74.58917°E |
అన్నపూర్ణ | "పంటల దేవత" | 8,091 | 26,545 | 1950 | ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు. | 28°35′44″N 83°49′13″E / 28.59556°N 83.82028°E |
గాషెర్‌బ్రమ్ I | "అందమైన పర్వతం" | 8,080 | 26,509 | 1958 | ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. | 35°43′28″N 76°41′47″E / 35.72444°N 76.69639°E |
విశాల శిఖరం | ఫైచాన్ కాంగ్రి | 8,047 | 26,401 | 1957 | ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు.. | 35°48′38″N 76°34′06″E / 35.81056°N 76.56833°E |
గాషెర్‌బ్రమ్ II | - | 8,035 | 26,362 | 1956 | ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు.. | 35°45′28″N 76°39′12″E / 35.75778°N 76.65333°E |
షిషాపాంగ్మా | జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" | 8,013 | 26,289 | 1964 | ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు.. | 28°21′12″N 85°46′43″E / 28.35333°N 85.77861°E |
గాషెర్‌బ్రమ్ IV | - | 7,925 | 26,001 | 1958 | ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనాలో గలదు. . | 35°45′38″N 76°36′58″E / 35.76056°N 76.61611°E |
మషేర్బ్రం / K1 | మషెర్బ్రమ్ | 7,821 | 25,660 | 1960 | ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. . | 35°38′28″N 76°18′21″E / 35.64111°N 76.30583°E |
నందా దేవి | "ఆశీర్వదించు-దేవత" | 7,817 | 25,645 | 1936 | ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్లో గలదు.. | 30°22′33″N 79°58′15″E / 30.37583°N 79.97083°E |
రాకాపోషి | "మెరిసే కుడ్యము" | 7,788 | 25,551 | 1958 | శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. . | 36°08′33″N 74°29′22″E / 36.14250°N 74.48944°E |
గాంగ్‌ఖర్ పుయెన్సుమ్ | గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" | 7,570 | 24,836 | అధిరోహించలేదు | ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్లో గలదు.. | 28°02′50″N 90°27′19″E / 28.04722°N 90.45528°E * |
అమా దబ్లామ్ | "తల్లి , ఆమె నెక్లేస్" | 6,848 | 22,467 | 1961 | ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూలో గలదు. . |
ధార్మిక స్థానాలు[మార్చు]
హిమాలయాలలో హిందూ, బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.
- హరిద్వార్, గంగానది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం.
- బద్రీనాథ్, వైష్ణవాలయం.
- కేదార్నాథ్, 12 జ్యోతిర్లింగాలు గల ప్రదేశం.
- గోముఖ్, భాగీరథి జన్మస్థానం.
- దేవ్‌ప్రయాగ్, ఇచట అలక్‌నంద, భాగీరథి నదులు కలసి గంగా నదిగా ఏర్పడుచున్నవి.
- రిషీకేష్,లో లక్ష్మణ దేవాలయం ఉంది.
- కైలాస పర్వతం, 6,638 మీటర్ల ఎత్తులో గల శిఖరం, ఇది శివపార్వతుల నివాస స్థలి. ఈ పర్వత అడుగుభాగానే మానస సరోవరం ఉంది. ఇది బ్రహ్మపుత్ర జన్మస్థానం.
- అమరనాథ్, ఇక్కడ శివలింగం ఉంది.
- వైష్ణోదేవి, ఈ దేవాలయం, దుర్గాదేవి భక్తులకు కేంద్రబిందువు.
- హిమాలయాలలో టిబెట్ కు చెందిన ఎన్నో ధార్మిక ప్రదేశాలు గలవు. దలైలామా నివాస స్థలం కూడా ఈ హిమాలయాలలోనే గలదు.
- యతి అనే ప్రసిద్ధ జీవి, జీవించినట్లు ప్రజల విశ్వాసం.
- శంభాల బౌద్ధ ధర్మంలో ప్రముఖ నగరం. భౌతికంగా ఈ నగరం లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా బౌద్ధులు చేరే నగరం.
- హేమ్‌కుండ్ సాహెబ్ - గురు గోబింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంలో గల గురుద్వార్
ఇవీ చూడండి[మార్చు]
- శంభల - శంభల అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరం. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది.
- భారతదేశం
- కారాకోరం (పర్వత పంక్తి)
- లడఖ్
- భూమిపై ఎత్తైన పర్వతాల జాబితా - 7,200 మీటర్ల ఎత్తుకు మించినవి.
మూలాలు[మార్చు]
- ↑ "Oracle Education Foundation: Indian Himalayas". Archived from the original on 2007-10-11. Retrieved 2008-05-07.
- ↑ "Himalayan Mountain System". Retrieved 2007-08-07.
- ↑ Coordinates were established by comparing topographical maps with satellite images and SRTM-derived terrain maps. The terrain maps and satellite images often don't match exactly. An asterisk (*) indicates that the map and image are shifted by more than 100 m (4") and/or that the landscapes around the summit don't match.
ఇతర పఠనాలు[మార్చు]
- Michael Palin, Himalaya, Weidenfeld Nicolson Illustrated (2004) ISBN 0-297-84371-0
- John Hunt, Ascent of Everest, Hodder & Stoughton (1956) ISBN 0-89886-361-9
- Everest, the IMAX movie (1998), ISBN 0-7888-1493-1
- The Himalayan Journal published by Himalayan Club
బయటి లింకులు[మార్చు]
- A German language page with comprehensive information about the mountains of the Himalaya. Has links to good images.
- Maps, pictures and travelogues from various regions of the Himalayas
- The making of the Himalaya and major tectonic subdivisions
- Geology of the Himalayan mountains
- Birth of the Himalaya
- Some notes on the formation of the Himalaya Archived 2010-06-12 at the Wayback Machine
- Guide to the 8000 m peaks
- Pictures from a trek in Annapurna (film by Ori Liber)[permanent dead link]
చిత్రమాలిక[మార్చు]
1. The summit of Mount Everest is the highest point on Earth.
3. Kangchenjunga is the second highest summit of the Himalaya.
7. Dhaulagiri in the Himalaya.
9. Nanga Parbat in the Himalaya.
10. Annapurna I in the Himalaya.
11. Gasherbrum I is the second highest summit of the Karakoram.
12. Broad Peak is the third highest summit of the Karakoram.
13. Gasherbrum II in the Karakoram.
14. Shishapangma in the Himalaya.
పాకిస్తాన్ లోని కే-2 దగ్గరలోని గ్లేషియర్ లు